
సాక్షి, విశాఖపట్నం : ఉన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కేసును విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రధాన నిందితుడు అఖిల్ సాయి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అదే సమయంలో ఇతరుల ప్రమేయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో హోంమంత్రి ఆదేశాల మేరకు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి మరో యువకుడు రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేక అఖిల్ సాయి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చదవండి: హత్యకేసులో సెంట్రల్ జైలుకి అఖిల్..
ఈ హత్యకు ముందు అఖిల్ సాయి గాజువాకలో రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు సూర్యనారాయణ రాజుతో కలిసి రామును బెదిరించడమే కాకుండా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద దాడి కూడా చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్ కూడా ఉన్నారు. వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్‌ను రెచ్చ గొట్టి ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే వరలక్ష్మి హత్యలో ఈ రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు ప్రమేయం ఏ మేరకు ఉందన్న కోణంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment