సకల వరప్రదాయినీ.. వరలక్ష్మి
– సామూహిక వరలక్ష్మివ్రతాలతో మల్లన్న ఆలయప్రాంగణం కళకళ
– 1100కు పైగా ముతై ్తదువల శాస్త్రోక్త వ్రతపూజలు
– ముతైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలు, అన్న, ప్రసాద వితరణలు
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మల్లన్న ఆలయప్రాంగణం వరలక్ష్మి వ్రత మంత్రోచ్చరణతో ప్రతిధ్వనిస్తుండగా, వందల సంఖ్యలో ముౖలె వుదులు తమ ఐదవతనం వృద్ధిచెందాలని అషై ్టశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ వరలక్ష్మివ్రతాచరణకు పూనుకున్నారు. ఉదయం 10. ంటలకు వరలక్ష్మీవ్రత నోములు నిర్వహించుకోవడానికి ముందుగా నమోదు చేసుకున్న వారందరికీ వరుస క్రమంలో కలశాల ఎదుట కూర్చోబెట్టారు. ఆ తరువాత వచ్చిన వారందరికి కూడా వ్రతనోములను నిర్వహించుకోవడానికి వీలుగా సమీప స్థలంలోనే అప్పటికప్పుడు ఏర్పాట్లను చేశారు. సుమారు 1100 మందికి పైగా ముతై ్తదువలు ఈ వ్రతాల్లో పాల్గొని తమ జన్మధన్యమైందిగా భావించారు. వ్రత ఆరంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను చేసి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణమూర్తులకు, అలంకారమండపంలోని ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం వ్రతాలకు హాజరైన ముతై ్తదువచేత కలశస్థాపన చేయించి ఆ కలశంలో వరలక్ష్మి దేవిని సమంత్రకంగా ఆవహింపజేశారు. శ్రీసూక్త విధానంతో వ్రతకల్పపూర్వకంగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు చేయించారు. వ్రత ముగింపుగా కర్పూర నీరాజనాలను అర్పించి కలశోద్వాసన చేశారు. అనంతరం ముతై ్తదువులను అందరికి రూ.500 ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉచితంగా స్వామిఅమ్మవార్ల దర్శన అవకాశాన్ని కల్పించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల శేషవస్త్రాలను అందజేసి స్వామిఅమ్మవార్ల అన్నపూర్ణభవన్‌లో వ్రతంలో పాల్గొన్న వారందరికి ఉచిత భోజనసౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
300 మందికిపైగా చెంచు గిరిజనులు
ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చెంచు గూడాల నుంచి వచ్చిన గిరిజనులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో చివరి శ్రావణ శుక్రవారం రోజున 300 మందికిపైగా చెంచుముతైదువులు వరలక్ష్మివ్రతంలో పాల్గొన్నారు.