vratam
-
మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం!
పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డుపలకోడి నూఱాయిరమ్ మల్లాణ్డు తిణ్ణోళ్ మణివణ్ణా! ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు’ అంటూ భగవంతుడికే మంగళాశాసనం చేసిన మహాభక్తుడు విష్ణుచిత్తుడు. అతని గారాలపట్టి మన గోదాదేవి ఆచరించిన ముప్ఫై రోజుల వ్రతమే ధనుర్మాస వ్రతం.హేమంత ఋతువులో వాతావరణ ప్రభావం చేత మనుష్యులు సుషుప్తి అవస్థలో వుంటారు. అటువంటి మాయావస్థనుండి బయటపడవైచే ఒకానొక ఉద్దేశంతో ఈ వ్రతం స్వయంగా ఆమె ఆచరించీ, సామాన్యుల చేత ఆచరింపజేసిన మహా తల్లి గోదాదేవి. యితర గోపికలని కూడా కలుపుకుని వారిని వేకువజామునే మేలుకొలుపుతూ అందరిని ఆ భగవత్సన్నిధికి చేరవేసిన నిస్వార్ధపరురాలు. పరమాత్మునికి సామూహిక పూజే చాలా ప్రీతి అన్న విషయం ఎరిగినందుకే గోదాదేవి తన బృందంతో సహా శ్రీ కృష్ణుని వద్దకు వెళ్ళింది. లోకమంతా పచ్చగా, భోగభాగ్యాలతో కళకళలాడాలనే ఉద్దేశంతో పరమాత్మని ప్రార్థిస్తూ తెల్లవారుఝామున స్నానం చేసి సౌందర్యవంతులైన గోపికలతో కలసి చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ఇక్కడ సౌందర్యమంటే ఆత్మసౌందర్యం, స్నానమనగా భక్తితత్వంలో మునిగితేలడం. రోజుకొక పాశురం పాడుతూ ఒక్కొక్క గోపికను మేలుకొలిపే ముప్పై పాశురాల రాగమాలికే తిరుప్పావై!రమారమి క్రీ.శ.750 ప్రాంతంలో శ్రీరంగనాథస్వామి వెలసిన శ్రీరంగానికి దగ్గరలో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో పెరియాళ్వార్ (విష్ణుచిత్తుని మరో పేరు)అనే భక్తశిఖామణి ఒకనాడు తన తులసివనంలో మొక్కలకు పాదులు తవ్వుతుండగా భూమిలో లభించిన ఈ బాలిక కర్కాటక మాసం, పుబ్బానక్షత్రంలో దొరికింది. ఈమెని పెరియాళ్వార్ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. విష్ణుచిత్తుని ఇంట అన్నసంతర్పణలూ, శ్రీరంగనాథుని భజనలే నిత్యకృత్యాలు. అందుకే గోదాదేవి చిన్నతనం నుంచి ఆ రంగనాథుడ్ని మనసారా సేవించింది. ఆమె భక్తితో కట్టే పూలదండలని వాసన చూసి ముందుగా తాను ధరించిన తరువాత వాటిని తండ్రిద్వారా ఆ రంగనాథునికి సమర్పించేది. పూలమాలలని ముందుగా తాను ధరించడంతో ఆమెకు శూడికొడుత్త అనే పేరువచ్చింది. గోదాదేవి ముందుగా ధరించి ఇచ్చిన పూలమాలలు తస్ప వేరే మాలలని తాను ధరించనని రంగనాథుడు స్వయంగా విష్ణుచిత్తునితో చెప్పడంతో తన బిడ్డ కారణ జన్మురాలని తనని తరింపజేయడానికే తన ఇంట వెలసిందని గ్రహించాడు.ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుణ్ణి భర్తగా పొందదలచి కాత్యాయనీ వ్రతాన్ని చే శారని తండ్రి ద్వారా తెలుసుకుంది గోదాదేవి. శ్రీకృష్ణుని లీలలు కథలు కథలుగా అక్కడి అందరూ చెప్పుకోవడంతో తాను ఆ కృష్ణావతార సమయంలో ఉంటే బాగుండునని తలచింది. అయితే కృష్ణావతారంలో సత్యభామ తానేనని జ్ఞానసంపద కలిగిన ఓ గోపిక ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తాను కూడా ధనుర్మాస వ్రతమాచరించి ఆ శ్రీరంగనాథుని సన్నిధి చేరుకోవాలని కోరుకుంది. ‘శూడిక్కొడుత్త శుడర్ క్కోడియే..తోల్పావై పొడి యరుళ వల్ల పల్ వళైయామ్, వేంగడ వఱ్కెన్నైవిది యెన్ద విమ్మాత్తమ్, నాంగడవా వజ్రమే నల్గు’ దీని అర్ధం–‘సువాసనతో కూడిన బంగారుజిలుగులు (జ్ఞాన కాంతులు) వెదజల్లే పుష్పదండలను దాల్చి, వాటినే శ్రీరంగనాథునికి సమర్పించిన ఓ మెరుపుతీగా, ఆ వేంకటేశ్వరునికి నీవు ఎట్లైతే ప్రియము కల్గించుమని వేడుకొన్నావో అలాగే, నీ భక్తులమైన మాకు కూడా ఆ వ్రతఫలం కల్గించు తల్లీ!’ అంటూ పరాశరభట్టర్ గోదాదేవిని స్తుతించడం ఇక్కడ గమనించాలి. సుగంధమైన పుష్పమాలలని స్వామికి సమర్పించినందున ఆముక్తమాల్యద అనే పేరు గోదాదేవికి వచ్చింది. కోదై, నాచియార్, ఆండాళ్...ఇలా వివిధ నామధేయాలు ఆమెకున్నాయి.గోదాదేవి మెడలో ధరించే పూమాల భక్తిగీతమాలగా, చేతిలోని చిలుక గురువుకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. గోదాదేవి ధనుర్మాస వ్రతమాచరించడానికి తన గోపికలతో కలసి ఆ పరమాత్మని కోరినదేమిటంటే, భూమండలాన్ని దద్దరిల్లచేసే తెల్లనైన ΄ాంచజన్యమనబడే శంఖాన్నీ, విశాలమైన పర అనే వాద్యాన్ని, మంగళగానం చేయడానికి భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజములు కావాలని కోరింది. వీటిని ఆ భగవత్సేవ వినియోగం కొరకు కోరుకున్నారు. అంతేకాదు, పాంచజన్యం, పర అనే భౌతిక వస్తువులని ఎందుకు కోరారంటే ఈ పరికరాలు ఎల్లప్పుడూ ఆ భగవంతుని అంటి పెట్టుకుని ఉంటాయి. అటువంటివి తమ వద్దవుంటే ఆ భగవంతుడు తమతో ఉన్నట్టేనని భావించి కోరుకున్నారు. వ్రతమాచరించే ముప్పై రోజులూ ఆహారనిష్ఠలతోపాటూ ఇతర కఠినమైన నియమాలు పాటిస్తూ సదా భగవన్నామ స్మరణలో గడిపారు గోదాదేవి బృందం. ఎదుటి వారిని నొప్పించే మాటలు ఆడకుండా, వారికి సహాయపడుతూ కలసి మెలసి మెలుగుతూ లోకకళ్యాణం కొరకు వ్రతమాచరించడమే గోదాదేవి ముఖ్యోద్దేశం.విష్ణుచిత్తుడు ఆ రంగనాథుని ఆజ్ఞతో ముప్పైరోజుల వ్రతానంతరం గోదాదేవిని శ్రీరంగానికి తోడుకొనిపోయి ఆ శ్రీరంగనాథునితో కళ్యాణం జరిపించాడు. గోదాదేవి భక్తి ప్రవత్తుల కారణంగా, జనులందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో లీనమైపోయింది. పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి మన ఆండాళ్ తల్లి! ‘తిరు’ అంటే శ్రీ, లక్ష్మీ, అమృతం మొదలగు అర్థాలున్నాయి. ‘పావై’ అంటే పాటల సమాహారం, వ్రతం అనే అర్థాలున్నాయి. ‘శ్రీకృష్ణుని(రంగనాథుడు) పొందకోరి ఆచరించిన గానామృత వ్రతమే ఈ మార్గశీర్ష వ్రతం లేదా ధనుర్మాస వ్రతం! మార్గమంటే బుద్ధి, శీర్షమంటే ఉత్తమమైనది. ‘మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే!’ అని స్వయంగా శ్రీ కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. అటువంటి కృష్ణుణ్ణి పొందడానికి మార్గశిరమే ఉత్తమమైన కాలమని భావించి ఈ వ్రతమాచరించింది గోదాదేవి. – కారంపూడి వెంకట రామదాస్ -
మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..?
మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. కుమారస్వామి సర్పరూపంలో భూలోకంలోకి అడుగిడిన రోజుకే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. అదేవిధంగా దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును ‘శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి‘ గా వ్యవహరిస్తారు.ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. ఏం చేయాలంటే..? ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం (చదవండి: మహిమాన్వితం మార్గశిర లక్ష్మీవార వ్రతం) -
వినాయక నిమజ్జనం రోజు ఆచరించే వ్రతం! ఎలా చేస్తారంటే..?
భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని 'అనంత చతుర్థి' అంటారు. ఈ రోజే వినాయక నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ఆచరించే అనంతపద్మనాభస్వామి వ్రతం అత్యంత మహిమాన్వితమైనది. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణడే పాండవులు సూచించాడని వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగిపోయి...విజయం, అభయం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణ వచనం. అనంత వ్రతం అనగా..మాయాజూదంలో ఓడిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాల గురించి శ్రీ కృష్ణుడు తెలుసుకుంటుండేవాడు. అలా ఓసారి పాండవుల దగ్గరకు వెళ్లిన శ్రీ కృష్ణుడితో.. ఏ వ్రతాలను ఆచరిస్తే తమకు కష్టాలు తొలగిపోతాయో వివరించమని అడిగాడు ధర్మరాజు. అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు సూచించినదే అనంత పద్మనాభస్వామి వ్రతం. ఎవరీ అనంతడు...అనంత పద్మనాభుడు ఎవరని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అనంతుడు అంటే ఎవరో కాదు స్వయంగా తానే అని వివరించాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, కాల స్వరూపుడు అని అర్థం. అనంత విశ్వంలో అణువణువు నిండి ఉండేది తానే అని వివరించాడు కృష్ణుడు. సృష్టి, స్థితి,లయలకు కారణం అయినా కాలస్వరూపుడి రూపంలో ఉన్నది, దశావతారాలు ఎత్తేది తానే అని చెప్పాడు. అందుకే చతుర్ధశ భువనాలు నిండి ఉన్న అనంతస్వరూపం అయిన అనంతుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నాడు. ఏటా భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి తిధి ఉండడం ప్రధానం కాబట్టి చతుర్దశి ఏ రోజైతే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజుని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇవాళ (సెప్టెంబరు 17, 2024) మంగళవారం ఉదయం 11 గంటలవరకూ చతుర్దశి ఉంది...అందుకే ఈ రోజే స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించి ఆ దైవం అనుగ్రహంతో తమ కష్టాల నుంచి బయటపడతామని విశ్వసిస్తారు. వ్రత విధానం..ఏ పూజ తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి..అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆరంభించే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం నవగ్రహ పూజ ఆచరించి ఆ తర్వాత అనంతపద్మనాభుడికి షోడశోపచార పూజ చేయాలి. 14 దారాలను కలిపి ఎరుపు రంగు తోరాన్ని పూజించి..వ్రతం అనంతరం కట్టుకోవాలి. ఇలా అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించాలని శ్రీ కృష్ణుడు వివరించాడు. శ్రీకృష్ణుడి సూచన పాండవులు ఈ వ్రతం చేసి అడగడుగున ఎదురైన కష్టాల నుంచి బయటపడటమే గాక కోల్పోయిన తమ రాజ్యాన్ని సంపదను తిరిగి దక్కించుకోగలిగారు. కలిగే ప్రయోజనాలు..వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు..సంపద పెరుగుతుంది.వృత్తి జీవితంలో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.(చదవండి: ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..) -
నేడు నాగ పంచమి? లేక గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..
నిజానికి పంచమి తిథి అనగానే నాగులే గుర్తుకొస్తాయి. చాలామంది పంచమి తిథి రోజున పుట్టలో పాలు పోయడం, నాగ్రేంద్రుడుని పూజించడం వంటివి చేస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం 'గరుడ పంచమి' అని కూడా అంటారు. నాగులు. గరుడు (అంటే గ్రద) రెండు పరమ వైరి జంతువులు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి అని పిలవాలా లేక గరుడు పంచమి అనాల? ఎందికిలా రెండు రకాలుగా పిలుస్తున్నాం. దీనికున్న ప్రాశస్యం తదితరాల గురించే ఈ కథనం!. ఎందుకిలా రెండు రకాలుగ పిలుస్తున్నారంటే.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచిమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎందుకింత మహిమాన్వితమైంది అంటే.. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ , వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా , వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు , గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని , గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం. కద్రువ తన కపట బుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా . దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి , సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం , తల్లి ఋణం తీర్చుకోవాలని , ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని , పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ , ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి.. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి , తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ , కుబేరుడు , వాయువు , యముడు అందరినీ ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా.. విష్ణువు అతడిని సమీపించి , ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా , జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక , అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే.. వారని జయించడం కష్టం. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా, తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు. ‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి, నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి, పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి , అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి.. ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి.. అనుసరించాలి. నిర్మలమైన మనస్సు , తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడ పంచమి. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి , బియ్యంపోసి , వారి శక్తి మేర బంగారు , వెండి నాగపడిగను ప్రతిష్టించి , పూజచేసి , పాయసం నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. అలాగే కాలసర్ప దోషాలు ఉన్నా, సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచిమి లేదా గరుడ పంచిమి రోజున ఆ ఇరువురిని కొలచినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారని ప్రతీతి. (చదవండి: శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..) -
ఏ వ్రతం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయంటే?
-
సర్వాభీష్ట ప్రదాయకం
భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయన వేయి నామాల విష్ణుదేవుడు కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమైనది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వేంకటేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్థం. అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కల్గించేది మాల. శ్రీ వ్రతమాల వేయు విధానం: ‘ఓం శ్రీ వేంకటేశ్వర పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ గోవింద పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ వాసుదేవ పరబ్రహ్మణే నమః’ ముడుపు: ఎవరైతే దీక్షాధారణ చేయదలచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడగలడు. కావలసిన వస్తువులు: అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము 1 మీటరు, 7 రూపాయి బిళ్లలు + 7 పావలా బిళ్లలు. ఇప్పుడు పావలా బిళ్లలు దొరకవు కాబట్టి, చిల్లర పైసలు ఏవి దొరికితే అవే. తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్ది, ఆరబెట్టి బాగా ఆరిన తరువాత దీక్షకు కూర్చొని, మొదట మాలను కింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూప దీప పూజా కార్యక్రమాలొనర్చి సిద్ధపరచుకోవాలి. తరువాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమ అరచేతిలో ఉంచుకొని, అందులో రూపాయి పావలా ఉంచి స్వామి సకలాభీష్టసిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వేయాలి. అలాగే కొంత స్థలమిచ్చి రెండో ముడి వేయాలి. ఈ రెండవ ముడి వేసేటప్పడు ఇదివరకువేసిన ముడిని దాటించి వేయరాదు. ఖాళీగా వున్న వస్త్రాన్నే తిప్పుతూ ముడివేయాలి. ముడుపు కట్టే సమయంలో ఎవ్వరితోను మాట్లాడరాదు. స్వామి అభీష్ట సిద్ధిమంత్రాన్ని జపిస్తూ ఏడు ముడుపులు కట్టాలి. ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత పూజ కావించి మాలధారణ చేయవలెను. మాలను ఇలా పవిత్రం చేయాలి ఆవు పంచితం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, గంధం, నీళ్లు– వీటితో మాలను అభిషేకం చేసి, కర్పూర నీరాజనం çసమర్పించి, గోవింద నామాన్ని 108 పర్యాయాలు జపిస్తూ ధరించాలి. వ్రత నియమం ♦ వైకుంఠ ఏకాదశికి 7 వారాలు, 6 వారాలు, 5 వారాలు, 4 వారాలు, 7 రోజులు ముందుగా గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ♦ మాలను తులసి పూసలతో గాని తామర పూసలతో గాని, పటిక పూసలతో గాని పవిత్రం చేసి శ్రీవేంకటేశ్వరస్వామికి తమ శక్త్యనుసారం పూజ కావించి ధరించాలి ♦ స్త్రీలు అయితే 7 రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు ♦ వైకుంఠ ఏకాదశి ముందురోజు ఉదయం 9–30 గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంవద్ద ’యాగపూజ –కంకణ ధారణ జరుగుతుంది. భక్తులు విధిగా హాజరుకావాలి. భక్తులు యాగానికి కావలసిన 7 రకముల సమిధలు 500 గ్రా. ఆవు నెయ్యి తీసుకు రావాలి ♦ శ్రీస్వామివారికి ముఖ్యమయిన పసుపు వస్త్రాలను విధిగా ధరించాలి. నుదుట తిరునామాలు పెట్టుకోవాలి ♦ వ్రతకాలంలో ధూమం మద్యం, మత్తుపదార్థాలు, మాంసాహారం సేవించరాదు. దాంపత్యానికి దూరంగా ఉండాలి. సాత్వికాహారం ఉత్తమం ♦ ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం స్నాన కార్యక్రమం ముగించుకొని శ్రీ స్వామి వారి గోవిందనామము ధ్యానించాలి. వీలైతే రోజుకు 1008 సార్లు ‘ఓం నమోవేంకటేశాయ’ అనే సకలాభీష్ట సిద్ధిమంత్రాన్ని జపించాలి. భజనలో పాల్గొనాలి ♦ ఎదుటి వారిని తనమాటల చేతకాని, చేతలచేతగాని బాధింపరాదు ♦ దీక్షాకాలంలో ఇతరులను ‘గోవిందా’ అని పిలవాలి ♦ ఉపవాస కార్యక్రమాన్ని తూ.చ. తప్పక భక్తిగా, నిష్ఠగా పాటించాలి. ఈ వ్రతాన్ని అన్ని వర్ణాలవారు ఆచరించవచ్చు. ఆచరించినవారు స్వామివారి కృపా కటాక్షం వలన తలచిన కోర్కెలు నెరవేర్చుకొని సకల సుఖాలు పొందవచ్చు. శ్రీవారి హుండీ ముడుపు పచ్చకర్పూరం 50 గ్రా.; జీడిపప్పు 50 గ్రా.; ఎండు ద్రాక్ష 50 గ్రా.; ఏలకులు 50 గ్రా.; మిరియాలు 50 గ్రా.; జీలకర్ర 50 గ్రా.; బియ్యం 50 గ్రా.; కర్పూరం 50 గ్రా. ఇంటికి తెచ్చుకొనే ముడుపు బియ్యం 100 గ్రా; టెంకాయ 1; కర్పూరం 1 ప్యాకెట్ పై పదార్థాలు రెండు విడి విడి సంచులలో వేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడచి శ్రీ స్వామివారి సన్నిధి చేరాలి. ఇంటికి తెచ్చుకొను ముడుపు మూటను దగ్గరిలో వచ్చే శనివారం రోజున వారి వారి ఇంటిలో పూజ చేసుకుని ముగించుకొనవచ్చు. – టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) -
వ్రతాల రేట్లు పెంచకండి
‘డయల్ టు ఈఓ’లో ఓ భక్తుని సూచన పలు అంశాలను ప్రస్తావించిన భక్తులు అన్నవరం: సత్యదేవుని ఆలయంలో సామాన్య భక్తులు ఎక్కువగా ఆచరించే రూ.150, రూ.300, రూ.700 వ్రతాల రేట్లు రూ.50 నుంచి రూ.వంద వరకూ పెంచాలనుకోవడం తగదని కాకినాడకు చెందిన పి.మాధవరావు అనే భక్తుడు వ్యాఖ్యానించారు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ ‘డయల్ టు ఈఓ’ నిర్వహించగా పలువురు భక్తులు పెక్కు అంశాలకు సంబంధించి ఫోన్లు చేశారు. మాధవరావు మాట్లాడుతూ గతంలో వ్రతం టిక్కెట్ రూ.75 మాత్రమే ఉండేదని, అప్పుడు ఇచ్చిన దానికన్నా తక్కువ పరిమాణంలో పూజాసామాగ్రి ఇస్తున్నారని, రేటు మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. ఈఓ సమాధానమిస్తూ వ్రతనిర్వహణ సామగ్రి ధరలు పెరిగినందున టిక్కెట్ల రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. రూ.1,500 వ్రతం టిక్కెట్ మినహా మిగిలిన వ్రతాల టిక్కెట్ ధరలు పెంచాలన్న పాలకవర్గం ప్రతిపాదనకు కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా ఈఓకి వచ్చిన మరికొన్ని ఫోన్ల వివరాలివి.. కొన్ని అభియోగాలపై తొలగించిన వ్రతపురోహితుడు డీఎస్వీవీఎన్ శర్మ స్థానంలో ఆయన కుమారుడి నియామకం అక్రమమని కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. శర్మను గత మేలో కొన్ని కారణాల వల్ల తొలగించామని,, గత నెలలో ఆయన కుమారుడిని వ్రతపురోహితునిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని ఈఓ తెలిపారు.అయితే సర్వీస్ నుంచి తొలగించిన పురోహితుని కుమారుడిని ఎలా నియమిస్తారనే విమర్శలు రావడంతో నియామకాన్ని నిలిపివేశామన్నారు. కమిషనర్ తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాపేశ్వరానికి చెందిన జోగానందం దేవస్థానం కాఫీ, టీ పాయింట్లలో కాఫీ నాణ్యతగా లేదని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామన్నారు. కుర్చీలో కూర్చుని వ్రతమా? అమలాపురానికి చెందిన భీమశంకర్ ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా మాజీ ప్రధాని దేవెగౌడను కుర్చీలో కూర్చోబెట్టి వ్రతం చేయించడాన్ని తప్పుపట్టారు. అయితేS ఆరోగ్యం సహకరించని వారికి పీటల మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. మెట్లదారిలో రత్నగిరికి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించాలని కాకినాడకు చెందిన రాఘవేంద్రరావు కోరగా చర్యలు తీసుకుంటామని ఈఓ చెప్పారు. నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులను పల్లకీబోయీలు డబ్బులు అడుగుతున్నారని గంగవరానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. దేవస్థానం గోవులకు మంచిమేత పెట్టాలని, దేవస్థానం వైద్యశాల వైద్యుడు వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నవరానికి చెందిన సూర్యప్రకాశరావు కోరారు. దేవస్థానంలో మోటార్ సైకి ల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన సత్యనారాయణ సూచించారు. పెంచిన డీ ఏ ముందుగా పెన్షనర్లకే చెల్లించేలా చూడాలని దేవస్థానం పెన్షనర్ల సంఘం నాయకుడు వరహాలు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏసీ జగన్నాథరావు పాల్గొన్నారు. -
వ్రతాల రేట్లు పెంచకండి
‘డయల్ టు ఈఓ’లో ఓ భక్తుని సూచన పలు అంశాలను ప్రస్తావించిన భక్తులు అన్నవరం: సత్యదేవుని ఆలయంలో సామాన్య భక్తులు ఎక్కువగా ఆచరించే రూ.150, రూ.300, రూ.700 వ్రతాల రేట్లు రూ.50 నుంచి రూ.వంద వరకూ పెంచాలనుకోవడం తగదని కాకినాడకు చెందిన పి.మాధవరావు అనే భక్తుడు వ్యాఖ్యానించారు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ ‘డయల్ టు ఈఓ’ నిర్వహించగా పలువురు భక్తులు పెక్కు అంశాలకు సంబంధించి ఫోన్లు చేశారు. మాధవరావు మాట్లాడుతూ గతంలో వ్రతం టిక్కెట్ రూ.75 మాత్రమే ఉండేదని, అప్పుడు ఇచ్చిన దానికన్నా తక్కువ పరిమాణంలో పూజాసామాగ్రి ఇస్తున్నారని, రేటు మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. ఈఓ సమాధానమిస్తూ వ్రతనిర్వహణ సామగ్రి ధరలు పెరిగినందున టిక్కెట్ల రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. రూ.1,500 వ్రతం టిక్కెట్ మినహా మిగిలిన వ్రతాల టిక్కెట్ ధరలు పెంచాలన్న పాలకవర్గం ప్రతిపాదనకు కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా ఈఓకి వచ్చిన మరికొన్ని ఫోన్ల వివరాలివి.. కొన్ని అభియోగాలపై తొలగించిన వ్రతపురోహితుడు డీఎస్వీవీఎన్ శర్మ స్థానంలో ఆయన కుమారుడి నియామకం అక్రమమని కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. శర్మను గత మేలో కొన్ని కారణాల వల్ల తొలగించామని,, గత నెలలో ఆయన కుమారుడిని వ్రతపురోహితునిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని ఈఓ తెలిపారు.అయితే సర్వీస్ నుంచి తొలగించిన పురోహితుని కుమారుడిని ఎలా నియమిస్తారనే విమర్శలు రావడంతో నియామకాన్ని నిలిపివేశామన్నారు. కమిషనర్ తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాపేశ్వరానికి చెందిన జోగానందం దేవస్థానం కాఫీ, టీ పాయింట్లలో కాఫీ నాణ్యతగా లేదని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామన్నారు. కుర్చీలో కూర్చుని వ్రతమా? అమలాపురానికి చెందిన భీమశంకర్ ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా మాజీ ప్రధాని దేవెగౌడను కుర్చీలో కూర్చోబెట్టి వ్రతం చేయించడాన్ని తప్పుపట్టారు. అయితేS ఆరోగ్యం సహకరించని వారికి పీటల మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. మెట్లదారిలో రత్నగిరికి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించాలని కాకినాడకు చెందిన రాఘవేంద్రరావు కోరగా చర్యలు తీసుకుంటామని ఈఓ చెప్పారు. నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులను పల్లకీబోయీలు డబ్బులు అడుగుతున్నారని గంగవరానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. దేవస్థానం గోవులకు మంచిమేత పెట్టాలని, దేవస్థానం వైద్యశాల వైద్యుడు వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నవరానికి చెందిన సూర్యప్రకాశరావు కోరారు. దేవస్థానంలో మోటార్ సైకి ల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన సత్యనారాయణ సూచించారు. పెంచిన డీ ఏ ముందుగా పెన్షనర్లకే చెల్లించేలా చూడాలని దేవస్థానం పెన్షనర్ల సంఘం నాయకుడు వరహాలు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏసీ జగన్నాథరావు పాల్గొన్నారు. -
వ్రతభ్రమణం
‘నీ మొక్కు ఏది అంటే తల చుట్టూ తిప్పి చూపించి నట్టు’గా ఉంది అన్నవరం దేవస్థానం అధికారుల నిర్వాకం. పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న వ్రతాల కౌంటర్లో టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు, వ్రత మండపాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వ్రతాల కౌంటర్ ఎదురుగా పెద్ద గేటు ఉంది. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు ఆ గేటు తీయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. – అన్నవరం సత్తెన్న వ్రతాల భక్తులకు తప్పని ప్రదక్షిణలు పశ్చిమ రాజగోపురం వద్ద మూసి ఉంటున్న వ్రత మండపం గేటు రద్దీ రోజుల్లో అయినా తెరిపించాలనే డిమాండ్ దేవస్థానానికి వాహనాల్లో వచ్చే భక్తులతో పాటు సత్రాల్లో బస చేసే వారు పశ్చిమ రాజగోపురం వద్ద ఆగుతారు. పశ్చిమ రాజగోపురం లోపల వ్రతాలు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనానికి రూ.వంద టిక్కెట్లు కూడా ఆ కౌంటర్లో విక్రయిస్తున్నారు. రూ.150, రూ.300 వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేసేవారు కౌంటర్ పక్కనున్న ఆయా వ్రతమండపాల్లో వ్రతాలాచరిస్తున్నారు. రూ.700, రూ. 1,500, రూ.2,000 వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఎండైనా, వానైనా ఆలయం చుట్టూ తిరిగి తూర్పు రాజగోపురం ముందుకు వచ్చి, క్యూలో నిలబడి వ్రత మండపాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వ్రతాల కౌంటర్‌కు ఎదురుగా పెద్ద గేటు ద్వారా ఆయా వ్రతాల టిక్కెట్లు తీసుకున్న వారు వారి మండపాల్లోకి సులభంగా చేరుకోవచ్చు. కానీ ఆ గేటు నిత్యం మూసే ఉంటోంది. గతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గేటు ద్వారానేవ్రతమండపాల్లోకి అనుమతించేవారు. స్వామి దర్శనం చేయిస్తామని ప్రైవేట్ గైడ్లు ఈ గేటు ద్వారా భక్తులను తీసుకొచ్చి, మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇందులో ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం 12 దాటితే.. కాగా, మధ్యాహ్నం వచ్చే భక్తులకు మరో ఇబ్బంది కూడా ఉంది. 12 దాటితే కౌంటర్లో వ్రతాల టిక్కెట్లు అమ్మడం లేదు. సాయంత్రం వరకూ మాత్రం రూ.వంద ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నారు. పర్వదినాల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడైనా ఈ గేటు తీస్తే భక్తులకు సౌలభ్యంగా ఉంటోంది. ఈ మార్గంలో గైడ్లను అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. -
సకల వరప్రదాయినీ.. వరలక్ష్మి
– సామూహిక వరలక్ష్మివ్రతాలతో మల్లన్న ఆలయప్రాంగణం కళకళ – 1100కు పైగా ముతై ్తదువల శాస్త్రోక్త వ్రతపూజలు – ముతైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలు, అన్న, ప్రసాద వితరణలు శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మల్లన్న ఆలయప్రాంగణం వరలక్ష్మి వ్రత మంత్రోచ్చరణతో ప్రతిధ్వనిస్తుండగా, వందల సంఖ్యలో ముౖలె వుదులు తమ ఐదవతనం వృద్ధిచెందాలని అషై ్టశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ వరలక్ష్మివ్రతాచరణకు పూనుకున్నారు. ఉదయం 10. ంటలకు వరలక్ష్మీవ్రత నోములు నిర్వహించుకోవడానికి ముందుగా నమోదు చేసుకున్న వారందరికీ వరుస క్రమంలో కలశాల ఎదుట కూర్చోబెట్టారు. ఆ తరువాత వచ్చిన వారందరికి కూడా వ్రతనోములను నిర్వహించుకోవడానికి వీలుగా సమీప స్థలంలోనే అప్పటికప్పుడు ఏర్పాట్లను చేశారు. సుమారు 1100 మందికి పైగా ముతై ్తదువలు ఈ వ్రతాల్లో పాల్గొని తమ జన్మధన్యమైందిగా భావించారు. వ్రత ఆరంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను చేసి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణమూర్తులకు, అలంకారమండపంలోని ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం వ్రతాలకు హాజరైన ముతై ్తదువచేత కలశస్థాపన చేయించి ఆ కలశంలో వరలక్ష్మి దేవిని సమంత్రకంగా ఆవహింపజేశారు. శ్రీసూక్త విధానంతో వ్రతకల్పపూర్వకంగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు చేయించారు. వ్రత ముగింపుగా కర్పూర నీరాజనాలను అర్పించి కలశోద్వాసన చేశారు. అనంతరం ముతై ్తదువులను అందరికి రూ.500 ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉచితంగా స్వామిఅమ్మవార్ల దర్శన అవకాశాన్ని కల్పించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల శేషవస్త్రాలను అందజేసి స్వామిఅమ్మవార్ల అన్నపూర్ణభవన్‌లో వ్రతంలో పాల్గొన్న వారందరికి ఉచిత భోజనసౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 300 మందికిపైగా చెంచు గిరిజనులు ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చెంచు గూడాల నుంచి వచ్చిన గిరిజనులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో చివరి శ్రావణ శుక్రవారం రోజున 300 మందికిపైగా చెంచుముతైదువులు వరలక్ష్మివ్రతంలో పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం
సామూహిక వ్రత నిర్వహణకు ఏర్పాట్లు ఈవో సూర్యకుమారి వెల్లడి ఒక్కో టికెట్ రూ. 1500 ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 26వ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో సూర్యకుమారి తెలిపారు. వ్రతం జరిగే రోజున అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తిని మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు. వ్రతంలో పాల్గొనేందుకు టికెటు ధరను రూ. 1500గా ఆలయ అధికారులు నిర్ణయించారు. మహా మండపంలోని ఆరో అంతస్తులోని ఆర్జిత సేవల ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 6 గంటల నుంచి 8–30 గంటల వరకు , రెండో షిప్టు ఉదయం 10–30 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు నిర్ణయించారు. ఇక వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రితో పాటు కుంకుమ భరిణ, అష్టలక్ష్మీ యంత్రం, కాళ్ల మెట్టెలు, రవిక, అమ్మవారి లామినేషన్ ఫోటో, అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం అందచేస్తుంది. 24 నుంచి టికెట్ల విక్రయాలు స్థలాభావం కారణంగా టికెటు కొనుగోలు చేసిన ముల్తైదువునే వ్రతం ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ నెల 24వ తేదీ నుంచి టికెట్లు దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్లో లభిస్తాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలకు దేవస్థాన టోల్‌ప్రీ నెం.1800 4259 099 కు సంప్రదించవచ్చు.