
శ్రీకాంత్, రాహుల్ విజయ్
మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’ (2021)కు తెలుగు రీమేక్‌గా ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ మేకా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలో ఉన్న శ్రీకాకుళం ఫోక్ సాంగ్‌ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పొస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ‘‘పూర్తి స్థాయి ఫోక్ సాంగ్‌గా రానున్న ఈ పాట ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్.
Comments
Please login to add a commentAdd a comment