
అప్పన్నపాలెంలో పవన్ కల్యాణ్
సింహాచలం: జీవీఎంసీ 95వ వార్డు పరిధి సుజాతనగర్‌లో ఇటీవల హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని శనివారం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆమె ఇంటికి వెళ్లి వరలక్ష్మి భర్త గోపాలకృష్ణమూర్తి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 98వ వార్డు జనసేన నాయకులు పంచ గ్రామాల భూ సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీకి సంబంధించి యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ అప్పన్నపాలెం కూడలిలో పలువురు ఆయన్ని కలిశారు. ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్‌బాబు, తమ్మిరెడ్డి శివశంకర్, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
సీబీసీఎన్‌సీ భూముల పరిశీలన
బీచ్‌రోడ్డు: సిరిపురంలోని సీబీసీఎన్‌సీ భూములను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంపీగా ఎన్నికై న ఎంవీవీ ఇప్పుడు వేరే చోట వ్యాపారం చేస్తానడం సరికాదన్నారు. అలాంటప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ వెనుక, సీబీసీఎన్‌సీ భూములతో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారని ఆరోపించారు.
జనసేన కార్యకర్తల వీరంగం
పవన్ కల్యాణ్‌ను చూడడానికి వచ్చిన జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దురుసగా ప్రవర్తించి వారి సహనాన్ని పరీక్షించారు. ఓ కార్యకర్త పోలీసులను దూషిస్తూ.. వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు అతన్ని మందలించారు. మరో వైపు సీబీసీఎన్‌సీ లోపలకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా పోలీసులు శాంతియుతంగా తమ విధులను నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment