
విశాల్ క్లారిటీ ఇచ్చాడు
తమిళనాట సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేస్తున్న యంగ్ హీరో విశాల్. వరుస హిట్స్తో హీరోగా మంచి ఫాం కొనసాగిస్తునే నడిగర్ సంఘం నేతగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.
చాలా కాలంగా విశాల్, వరలక్ష్మిల మధ్య ఏదో ఉందంటూ చర్చ జరుగుతున్నా.. క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్, విశాల్ ముఖాముఖి తలపడటంతో.. ఇక విశాల్, వరలక్ష్మి కలవటం అసాధ్యం అనుకున్నారు. కానీ అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ ఒక్క ఫొటోతో మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు విశాల్.
వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్పీ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విశాల్, అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ చేశాడు. విశాల్ ఉద్దేశం ఏంటో తెలియదు గానీ, సినీ వర్గాలు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మీదే విశాల్ క్లారిటీ ఇచ్చాడని భావిస్తున్నారు. విశాల్ ఫొటో పోస్ట్ చేసిన సమయంలో శరత్ కుమార్ అస్వస్థతకు గురికావటం కూడా హాట్ టాపిక్గా మారింది.
Dis pic says it all. pic.twitter.com/SFL6nBfdDx
— Vishal (@VishalKOfficial) 26 June 2016