
నటి వరలక్ష్మీ కిడ్నాప్..!
తమిళ నటి వరలక్ష్మి కిడ్నాప్‌కు గురయ్యారంటూ ట్విట్టర్‌లో ఓ ఫొటో వైరల్ అయింది. ఫోటో వరలక్ష్మి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ అంటిచారు. ఆ ఫోటోను చూసిన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే, ఆ ఫోటోను వరలక్ష్మీ తర్వాతి చిత్ర ప్రచారం కోసం విడుదల చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
తాజాగా ఈ విషయంపై వరలక్ష్మీ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. తను బాగానే ఉన్నానని.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పనిని తన సినిమా ప్రచారంలో భాగంగా చేశామని, సాయంత్రం ఆరు గంటలకు ఆ వివరాలు ప్రకటిస్తామని వరలక్ష్మి చెప్పారు.
I'm absolutely fine.. thank u for ur concern..it's a part of our movie promotion.. announcement at 6pm..!!
— varu sarathkumar (@varusarath) April 18, 2017