టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు | Telangana ysrcp leader takes on kcr govt | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు

Published Sat, Apr 25 2015 12:16 AM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

Telangana ysrcp leader takes on kcr govt

తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరలక్ష్మి ఆరోపించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మాట్లాడుతూ.... నిజమైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెన్షన్లు, ఆహార భద్రతకార్డులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నా... టీఆర్ఎస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని వరలక్ష్మీ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజల్లో టీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం పోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వరలక్ష్మి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement