సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తమను చిన్న కారణాలతో తొలగించారని చెప్పుకొచ్చారు.
వివరాల ప్రకారం.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొందరు బుధవారం తెల్లవారుజామునే సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. చిన్న చిన్న కారణాలతో తమను సస్పెండ్ చేసి, మెమో ఇచ్చి, జీతాలు కట్ చేసినట్టు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తమ గోడును చెప్పుకున్నారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment