telangana ysr congress party
-
వైఎస్ షర్మిలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ► వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు రిమాండ్‌ను రద్దు చేసి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆమెను అక్కడే అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వైఎస్ షర్మిలను 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఆమె రిమాండ్ ప్రధానాంశంగా వాదనలు సాగుతున్నాయి. తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్న వైఎస్ షర్మిల తరపు లాయర్లు వాదించారు. శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసుల తీరును తప్పుపట్టారు. అంతేకాదు.. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ వ్యవహారాన్ని ఈ సందర్భంగా న్యాయవాది మెజిస్ట్రేట్ ముందు ప్రస్తావించారు. పోలీస్ విధులకు ఎక్కడ ఆటంకం తమ క్లయింట్ ఆటంకం కలిగించలేదని షర్మిల తరపు లాయర్లు పేర్కొన్నారు. అయితే.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తుగా సహకరించాలి అని కోరామని, కానీ, ఆమె, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్సు క్రియట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సమయంలో రిమాండ్ విధించకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు, మెజిస్ట్రేట్‌ను కోరారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో.. నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టుకు వైఎస్ఆర్టీపీ లీగల్‌సెల్ చైర్మన్ వరప్రసాద్‌తో పాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ చేరుకున్నారు. ఏం జరిగిందంటే? సోమవారం టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును.. మంగళవారం తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత -
పెనుబల్లిలో వైఎస్ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
-
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
మిర్యాలగూడ టౌన్: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు 1.7 ల క్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ ..ఆ మేరకు ఉద్యోగాలిచ్చిన తరువాతనే ఎన్నికల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నాలుగు ఏళ్లలో భర్తీ చేయలేని ఉద్యోగాలను, కేసీఆర్ ఈ పది నెలల్లో ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ వేయ కుండా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. కోర్టు వివాదాల్లో లేకుండా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మెహన్‌రెడ్డి కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ధర్నాలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, నాయకులు సలీం, బాలకృష్ణారెడ్డి, రవికుమార్, మేష్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే ఆయన రాజన్న అయ్యాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. దేశంలో ఏ ఒక్కనేత అందించని పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఆదివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సాఆర్ ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే, ఆయన్ను రాజన్న అని పిలుచుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అప్పటి వరకూ పాలకులు విస్మరిస్తే, కేవలం ఒక్క వైఎస్సార్ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు రెండు రూపాయలకే బియ్యం, పక్కా గృహాలు, ఉచిత విద్యుత్, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రాణహిత, పాలమూరు రంగారెడ్డి పథకాలు పేర్లు మార్చినా వాటికి పునాదులు వేసింది మాత్రం వైఎస్సారే అని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. -
2019 ఎన్నికల్లో క్రియశీలక పాత్ర: గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్రియశీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వ స్ఫూర్తితో ముందుకు వెళదామని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ చంపాపేటలోని స్థానిక సామ నరసింహారెడ్డి గార్డెన్లో గురువారం జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశం ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రతి అడుగులో కూడా పేదవాడి గుండె చప్పుడు విన్నారన్నారు. ఆ మహానేతను మరవడం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయగలిగేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. వచ్చే ప్లీనరీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో హాజరు అవుతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాగా ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి తెలంగాణలోని 31 జిల్లాల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. -
ఎదిరించి పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్
-
ముగిసిన టీ.వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసింది. ఈ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎల్బీనగర్ ప్రాంతంలోని చంపాపేట్ రోడ్డులోని ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్(సామ నరసింహా రెడ్డి గార్డెన్)లో జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ప్రజలంతా తమ కుటుంబమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారన్నారు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేక తెలంగాణలోనే ఎక్కువమంది మరణించారన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కుటుంబాన్ని ఎదిరించి...పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. 2024లో తెలంగాణలో అధికారం దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ రాజీపడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. -
హెచ్ఆర్సీలో టీ.వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణంపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించి రోగి మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. స్పందించిన హెచ్ఆర్సీ ఈ ఘటనపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (ప్రాణం ఖరీదు రూ. 150!) వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం రాయారంకు చెందిన వడ్త్యా కృష్ణ నాయక్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న అతనికి వెంటనే ఆక్సిజన్ పెట్టాలంటూ కృష్ణ భార్య డ్యూటీలోని సిబ్బందిని కోరింది. అయితే అందుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో అతడు కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను వైఎస్ఆర్ సీపీ ...హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్లింది. -
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూర్యాపేట : ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని, కేవలం రెండు సీట్లు మాత్రం సమస్య ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అతికష్టమన్నారు. 2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలనే కుయుక్తులతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల గురించి మాట్లాడడం తప్పా.. రైతులు, విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీపై ఎన్నడైనా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాట్లాడారా..అని ప్రశ్నించారు. సర్వేలు చేయించుకొని రాష్ట్రంలో 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా కాంగ్రెస్‌పార్టీకి రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వచ్చేంత వరకూ గడ్డం తీయనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లశక్తిని గడ్డంతో పోల్చడం నీతిమాలిన పని అని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీకి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు రావడంతో పాటు నాలుగు చోట్ల డిపాజిట్లు దక్కాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ ప్రస్తుతం రెండు ఎంపీ సీట్లు వస్తే ఆ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే తపన తప్ప కాంగ్రెస్‌పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడుదామనే ఆలోచన లేదన్నారు. ఇతర పార్టీలను కించపరిచే విధంగా ఉత్తమ్ మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, శేఖర్‌రెడ్డి, నాయకులు మద్ది ఉపేందర్‌రెడ్డి, గోరెంట్ల సంజీవ, ఎజాజ్, తాడోజు జనార్దన్చారీ, ఎండీ ఇఫ్రాన్, విష్ణు, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంటి, పవన్, వీరస్వామి, హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుల నియామకం
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ క్రింద పేర్కొన్న వారిని ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించడం అయింది. కొత్త జిల్లాలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులుగా నియమకమైంది వీరే... 1.బొడ్డు సాయినాథ్ రెడ్డి ......గ్రేటర్ హైదరాబాద్ 2.బెంబడి శ్రీనివాస్ రెడ్డి..... మేడ్చల్ - మల్కాజిగిరి 3.తుమ్మలపల్లి భాస్కర్ రావు ...సూర్యాపేట 4.లక్కినేని సుధీర్.......ఖమ్మం 5.సంగాల ఇర్మియా.... వరంగల్ అర్బన్ 6.బొబ్బిలి సుధాకర్ రెడ్డి...రంగారెడ్డి 7.మాదిరెడ్డి భగవంతు రెడ్డి.... నాగర్ కర్నూల్ 8.నీలం రమేష్...........కామారెడ్డి 9.గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి.... సంగారెడ్డి 10.ఏనుగు రాజీవ్ రెడ్డి...జగిత్యాల 11.వొడ్నాల సతీష్.... మంచిర్యాల 12.బెజ్జంకి అనిల్ కుమార్.... ఆదిలాబాద్ 13.నాయుడు ప్రకాష్.... నిజామాబాద్ 14.మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి......వనపర్తి 15.జమల్పుర్ సుధాకర్.... క్రుమంభీం-అసిఫాబాద్ 16.తడక జగదీశ్వర్ గుప్త....సిద్ధిపేట 17.అప్పం కిషన్.....జయశంకర్ భూపాలపల్లి 18.సెగ్గెం రాజేష్.......పెద్దపల్లి 19.కిందాడి అచ్చిరెడ్డి....మహబూబాబాద్ 20.నాడం శాంతికుమార్........వరంగల్ రూరల్ 21.డా.కె.నగేష్.........కరీంనగర్ 22. చొక్కాల రాము... రాజన్న-సిరిసిల్ల 23. బీస మరియమ్మ....మహబూబ్ నగర్ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇంచార్జ్‌లు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పదవితో పాటు ఐటీ విభాగంలో పలువురు నాయకులను నియమించింది. ఈ మేరకు శనివారం వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. లీగల్ సెల్ కన్వీనర్‌గా పాలెం రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. చాలా ఏళ్లుగా పాలెం రఘునాథ్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబీకులను విధేయుడిగా ఉంటూ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లి, పార్టీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కటుకూరి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా బాదం నరేష్ గుప్త, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పేరం నవీన్ కుమార్, మునగాల జగన్మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడుగా సి. హరికృష్ణారెడ్డిలను నియమిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం పొట్ట కొడుతోంది
-
’కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదు’
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పది జిల్లాల పాలనే గాడిన పడలేదన్నారు. తాజాగా కొత్త జిల్లాలంటూ గ్రామాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని శివకుమార్ ధ్వజమెత్తారు. ఇప్పుడు జిల్లాల కోసం పోరాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఇప్పటికే వేలాది ఫిర్యాదులు అందాయని శివకుమార్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో పలు పదవుల నియామకం చేపట్టింది. రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మందడపు వెంకటరామిరెడ్డి, అలస్యం సుధాకర్, వేమారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందాడపు వెంకటేశ్వర్లు, జిల్లపల్లి సైదులు, కొల్ల వెంకట్‌రెడ్డి లను నియమించింది. సంయుక్త కార్యదర్శులుగా బండ్ల సోమిరెడ్డి, తుమ్మటి నర్సిరెడ్డి, వనమారెడ్డి నాగిరెడ్డి, పులి సైదులు, కుర్సమ్ సత్యనారాయణలు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు జరిపినట్లు తెలిపారు. పదవులకు ఎంపికైన వారిని గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. -
ట్యాంక్‌బండ్ వద్ద టీఎస్ వైఎస్ఆర్ సీపీ నిరసన
-
గట్టు శ్రీకాంత్‌రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ సీపీని ఆహ్వానించకపోవడంపై ళ టీఎస్-వైఎస్ఆర్ సీపీ ఇవా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటీన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. -
ట్యాంక్‌బండ్‌పై టీ-వైఎస్ఆర్సీపీ నిరసన
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ పదవుల నియామకం
హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాసరావు, గుండెరెడ్డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా అదే జిల్లాకు చెందిన నందమల్ల నరేష్ ను నియమించబడ్డారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లాకు కె.విశ్వనాథ్ చారిని నియమించింది. కొత్తగా నియమించబడిన నేతలకు పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
టీ.వైఎస్ఆర్ సీపీ కార్యదర్శిగా దుబ్బాక సంపత్
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో నియామకాలు చేసింది. రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శులుగా తిరుపతయ్య, గంగాధర్, హనుమంతురెడ్డి, సిరి రవిని ఆపార్టీ నియామకం చేసింది. అలాగే వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శిగా దుబ్బాక సంపత్, జీహెచ్ఎంసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సుధాకర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడుగా వందాల సతీష్ నియమితులయ్యారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అనుమతితో, పార్టీ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్ ఆధ్వర్యంలో వారిని రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో నియమించడం అయింది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి: గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంపునకు నిరసనగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వరంలో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. -
పోరాటాలకు సిద్ధం కావాలి
చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల్ని అన్ని విషయాల్లోనూ చైతన్యవంతుల్ని చేయాలన్నారు. గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగించారు. అమరవీరుల త్యాగం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేస్తోందని, బంగారు తెలంగాణ కోసం ఆశపడితే అది కనుచూపు మేరలో సాధ్యమయ్యేలా కన్పించటంలేదని చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ తన ఐదేళ్ల 100 రోజుల పాలనలో ఏనాడూ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి.. వారికి అండగా నిలిచి, చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ కమిటీలను ఈ నెల 28లోగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును ప్రజలకు వివరించి, వారిని చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, మతీన్, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, రఘురామిరెడ్డి(మీసాల్ రెడ్డి) తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?..
హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో పోలీస్ రాజ్యం నడుస్తోందని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడిమా సమావేశంలో మాట్లాడుతూ....'బంగారు తెలంగాణ అంటే ఇదేనా?. నిర్వాసితులకు ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలి. రీ డిజైన్ పేరుతో తెలంగాణ ప్రజలను ముంచుతున్నారు. చట్టప్రకారం భూ సేకరణ జరపాలి. లేకుంటే నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తాం' అని తెలిపారు. కాగా మెదక్ జిల్లా తోగుట మండలంలో మల్లన్న ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 15వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు భూసేకరణ కోసం సర్కారు 123, 214 జీవోలను విడుదల చేసింది.. అయితే ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి… దీంతో ఈ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.. భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
శివకుమార్‌కు వైఎస్సార్సీపీ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శివకుమార్‌కు తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనందున గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవిధంగా ఉన్నాయని, అందుకే ఆయనకు షోకాజ్ నోటీసుల జారీ చేశామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటీసులపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని శివకుమార్‌ను కోరారు. -
గ్రేటర్లో పోటీ చేయడం లేదు