తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ మధుసూదనాచారిని మంగళవారం కలిశారు.
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ మధుసూదనాచారిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్ను కోరారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ముఖ్యమంత్రి కేసీఆర్కు తగదని వైఎస్ఆర్ సీపీ నేత శివకుమార్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు వచ్చేలోగా నిర్ణయం తీసుకోవాలని కోరామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని మధుసూదనాచారి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
telangana ysrcp Leaders complaint on t.ysrcp mlas over