బంగారు తెలంగాణ ఇదేనా?: పొంగులేటి
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ వచ్చినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు రైతు సమస్యలపై ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసేందుకు కలెక్టరేట్కు వచ్చారు.
అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.... దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని ఆయన ఆందోళన చెందారు. బంగారు తెలంగాణ ఇదేనా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలే అని పొంగులేటి స్పష్టం చేశారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో నెలకొన్న కరువుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు.