సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌కు అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ క్రమంలో ప్రభుత్వం, పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, పొంగులేటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు రాహుల్ గాంధీ సభ జరుగుతోంది. అధికారాన్ని ఉపయోగించి సభను ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. లక్షలాది మంది ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ప్రైవేటు వాహనాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 1700 వాహనాలు సీజ్ చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు.
పోడు పట్టాలు, దళిత బంధు, రేషన్ కార్డులు ఇస్తామని ఆపుతున్నారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెంచా గిరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన పొంగులేటి కంటతడి పెట్టారు. నేను కొద్దిసేపట్లోనే రోడ్ల మీదకు వస్తున్నాను. ఎక్కడా వెనక్కి తగ్గవద్దు.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకండి. తెలంగాణ తొలి ఉద్యమం ఖమ్మం నుంచే ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ పతనం ఈ సభ నుంచే ప్రారంభం అవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ జనగర్జన సభ: ఖమ్మంలో కోలాహలం.. భారీ కటౌట్స్, తోరణాలు
Comments
Please login to add a commentAdd a comment