Khammam sabha
-
కేసీఆర్ సర్కార్‌కు పొంగులేటి వార్నింగ్.. సీరియస్ కామెంట్స్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌కు అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ క్రమంలో ప్రభుత్వం, పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. కాగా, పొంగులేటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు రాహుల్ గాంధీ సభ జరుగుతోంది. అధికారాన్ని ఉపయోగించి సభను ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. లక్షలాది మంది ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ప్రైవేటు వాహనాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 1700 వాహనాలు సీజ్ చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. పోడు పట్టాలు, దళిత బంధు, రేషన్ కార్డులు ఇస్తామని ఆపుతున్నారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెంచా గిరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన పొంగులేటి కంటతడి పెట్టారు. నేను కొద్దిసేపట్లోనే రోడ్ల మీదకు వస్తున్నాను. ఎక్కడా వెనక్కి తగ్గవద్దు.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకండి. తెలంగాణ తొలి ఉద్యమం ఖమ్మం నుంచే ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ పతనం ఈ సభ నుంచే ప్రారంభం అవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ జనగర్జన సభ: ఖమ్మంలో కోలాహలం.. భారీ కటౌట్స్, తోరణాలు -
కాంగ్రెస్ కార్యకర్తలు పులుల్లాగా విజృంభిస్తున్నారు: రాహుల్
Live Updates.. ►రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోసంగా ఉంది. మా ఐడియాలజీ దేశాన్ని కలపడం. ఇతరులది దేశాన్ని విభజించడం. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్ధించింది. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు శక్తినిచ్చారు. మీ మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే మీరు కాంగ్రెస్ ఆలోచనను సమర్ధించారు. పాదయాత్ర చేసిన భట్టిని అభినందిస్తున్నా. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నా. తెలంగాణ ఒక స్పప్నంగా ఉండేది. జోడోయాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ కార్యకర్తలు పులుల్లాగా విజృంభిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ►భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెట్టాను. పీపుల్స్ మార్చ్ అనేది భట్టి విక్రమార్క్ యాత్ర కాదు.. అధికార మదంతో విర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర ఇది. భారత్ జోడో యాత్రు కొనసాగింపే పీపుల్స్ మార్చ్. రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారు. పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించారు. కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం. ధరణిని రైతులు వ్యతిరేకిస్తున్నారు. మన రాష్ట్రం మనకు వస్తే భూములు వస్తాయని ప్రజలు అనుకున్నారు. ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకున్నా. భారతదేశాన్ని ఒక్కటి చేయాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు’ అని పేర్కొన్నారు. ►కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే’’ అని పొంగులేటి అన్నారు. ► ‘తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. విద్యార్థుల పోరాటాలతో ఆమె తెలంగాణ ఇచ్చారు. రెండుసార్లు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు.. అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చేది కాంగ్రెస్ పభుత్వమే. ఆరు నెలల పాటు అందన్నీ కలిశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ నెరేవేర్చుతాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలిపేయడం కాంగ్రెస్‌కే సాధ్యం. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. ►రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ► రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో ప్రసంగించనున్నారు. ►గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. కాసేపట్లో గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మంకు ఆయన చేరుకోనున్నారు. ►కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభం కానుంది. సభకు జనం భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 5.30కి సభా ప్రాంగణం వద్దకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. జనంతో సభా ప్రాంగణం సందడిగా మారింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరనున్నారు. ► ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ విధానాలు నాకు నచ్చాయి. ఈరోజు కాంగ్రెస్‌లో నేను చేరగలను.. కానీ, నేను పార్టీ పెట్టాను. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఉండవు. ► సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో నేతల్లో భిన్నాభిప్రాయాలే.. వర్గ విభేదాలు లేవు. జనగర్జన సభకు రాకుండా ప్రజలను అడ్డుకోవడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90-100 సీట్లు వస్తాయి. ► ఖమ్మంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్ల ఏర్పాటుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సభకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ► జనగర్జన సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ► జూలూరుపాడు, సుజాతనగర్లో చెక్‌పోస్టులు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు. ► పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ► తనిఖీల పేరుతో వాహనాల పత్రాలు లేకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో, పొంగులేటి అభిమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోతున్నారు. సాక్షి, ఖమ్మం: తెలంగాణలో తిరిగి పట్టు పెంచుకుని అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమైంది. ► తెలంగాణ జనగర్జన సభను పురస్కరించుకుని కాంగ్రెస్‌లో కోలాహలం నెలకొంది. ► సీనియర్లు అంతా ఏకతాటికిపై వస్తుండటం.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతుండటం.. సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగుస్తుండటం నేపథ్యంలో దీనికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ► ఐదు లక్షల మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు అంతా సిద్ధం చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ► ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 5:30 గంటలకు సభా ప్రాంగణానికి రాహుల్ విచ్చేస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సభ ముగిశాక రోడ్డు మార్గంలో గన్నవరం వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారని వివరించాయి. ► ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా.. నగరం మొదలు సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, పార్టీ తోరణాలతో ముస్తాబు చేశారు. ► గతంలో ఎన్నడూ లేని విధంగా సభకు భారీగా జన సమీకరణ చేస్తుండగా.. దాదాపు ఐదు లక్షల మందిని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు. ► 55 అడుగుల ఎత్తులో 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సభాస్థలిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేయగా వేదిక ముందు 1.50 లక్షల మంది కూర్చొని వీక్షించేలా గ్యాలరీలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే మిగతా వారు సభను వీక్షించేలా 12 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో 4 లక్షల మంది నిల్చొని చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రకటనకు అవకాశం.. ఈ సభతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. రానున్న ఎన్నికల్లో అనుసరించే రాజకీ య వ్యూహం, ఇతర పార్టీలతో పొత్తులు, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై ఈ వేదిక నుంచే రాహుల్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నాపై ఎవరి ఒత్తిడి లేదు.. ఇండిపెండెంట్‌గానే పనిచేస్తున్నా: తమిళిసై
-
ఖమ్మం సభ ఎఫెక్ట్.. కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సభలో పలువురు సీఎంలు, నేతలు గవర్నర్లు, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా, గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ వ్యవస్థను అవమానించారు. సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడను. గవర్నర్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు. ప్రభుత్వం ఎందుకు ప్రొటోకాల్ పాటించడం లేదో సమాధానం చెప్పాలి. ప్రొటోకాల్‌పై కేసీఆర్ స్పందించాకే ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతాను. రిపబ్లిక్ డే అంశంపై నాకు సమాచారం లేదు. నేను ఎక్కడా నా లిమిట్స్ క్రాస్ చేయలేదు. నేను 25 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాను. ప్రొటోకాల్ ఏంటో నాకు తెలుసు. గవర్నర్ వ్యవస్థను కించపరచడం మంచిది కాదు. నా డ్యూటీ నేను చేస్తున్నా.. నా దగ్గర ఎలాంటి సమస్య లేదు. గవర్నర్ కూర్చీకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. నేను ఇండిపెండెంట్‌గా పని చేస్తున్నా.. నాపై ఎవరి ఒత్తిడి లేదు. అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. -
కరెంట్ ఉందో లేదో అలా తెలుసుకో.. సంజయ్‌కు పువ్వాడ కౌంటర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సహా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. ఇక, కేసీఆర్ కామెంట్స్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనను తానే ఓడించుకుంటోంది. కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకోవాలి. బండి అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్రం మూసివేస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్‌లోనైనా బండి సంజయ్ వేలు పెట్టి చూడాలని చురకలంటించారు. మాకు వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం. ఇంత పెద్ద సమావేశానికి ప్రత్యేకమైన ఆహ్వానం అవసరం లేదు.. బొట్టుపెట్టి పిలవరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మక సభ జరిగింది. కరీంనగర్ సింహగర్జన సభం తెలంగాణ ఏర్పాటుకు స్పూర్తి. ఖమ్మం సభ దేశ అభివృద్దికి నాంది కాబోతోంది. ఖమ్మం సభ విజయంతో బీఆర్ఎస్ పార్టీ మొదటి అడుగు ప్రారంభమైంది. సభపై ఎంత మంది విమర్శలు చేసినా, వక్రభాష మాట్లాడిని ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సభకు వారెందుకు రాలేదు.. బండి సంజయ్ సూటి ప్రశ్న -
దేశంపై విమర్శలు వద్దు.. ఆర్మీని తిట్టడం సరికాదు: కిషన్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తలపెట్టిన ఖమ్మం సభకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. సభకు విచ్చేసిన ప్రతీ నేతకు, కార్యకర్తకు, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు. ఇక, ఈ సభా వేదికగా కేంద్రంలోకి బీజేపీ, కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ మీటింగ్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. బీజేపీపై విమర్శలు చేయండి కానీ.. దేశంపై విమర్శలు వద్దు. పక్క దేశాలను పొగడటం, భారత ఆర్మీని తిట్టడం కేసీఆర్‌కు అలవాటు. తెలంగాణలో ఎరువుల ఫ్యాక్టరీ మేకిన్ ఇండియా వల్లే వచ్చింది. దేశంలో ప్రధాని సీటు ఖాళీగా లేదు. కల్వకుంట్ల కుటుంబాన్ని పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కి పంపించాలి. మేకిన్ ఇండియా వల్ల రైళ్లు, విమానాలు తయారు చేస్తున్నాము. దేశవ్యాప్తంగా కరెంట్ ఉత్పత్తి పెరిగింది. జల వివాదాల పరిష్కారాలకు ఎందుకు మీటింగ్‌కు రాలేదు. హైదరాబాద్‌ను డల్లాస్, కరీంనగర్‌ను ఇస్తాంబుల్ చేస్తానన్న కేసీఆర్.. ఎందుకు చేయలేదు?. ప్రధాని మోదీ వ్యాపారాలు చేయడం లేదు. లిక్కర్ బిజినెస్ అంతకన్నా చేయడం లేదు. ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని.. నిన్ను చూసి నేర్చుకోవాలా?. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. మీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీటింగ్‌కు వచ్చిన ఒక్కరూ కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్.. గుజరాత్లో ఎందుకు పోటీచేయలేదు?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో తలపెట్టిన సభ విజయవంతమైంది. సభలో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఖమ్మం ప్రజలపై వరాలు కురిపించారు. ఈ క్రమంలోనే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దీంతో, కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్.. గుజరాత్లో ఎందుకు పోటీ చేయలేదు. బీజేపీతో పోరాడతానుంటున్న కేసీఆర్.. కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీనే. విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని మోదీ అమ్మకానికి పెట్టిన సంస్థలు స్థాపించింది కాంగ్రెస్ పార్టీనే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే కమ్రంలో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అందుకే బడ్జెట్ సమావేశాలను ఆలస్యం చేస్తున్నారు. టెక్నికల్‌గా ఎన్నికల సంఘం అడ్డురాకుండా ఉండేందుకు బడ్జెట్ సమావేశాలను ఆలస్యం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
బీజేపీతో పోరాడుతానంటున్న కేసీఆర్ కాంగ్రెస్‌పై ఎందుకు దాడి చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి
-
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్: సీఎం కేసీఆర్
-
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటివారు: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
-
ఇవాళ మార్పు కోసం తొలి అడుగు పడింది: పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్
-
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, ఖమ్మం: దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ భేరి ఒక సంకేతమని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అంతకు ముందు సభకు హాజరైన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులకు, రాష్ట్ర నేతలకు, పార్టీ కేడర్‌కు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం, ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. తర్వాత.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతూ.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశ మార్పునకు ఈ సభ ఓ సంకేతం. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ప్రభుత్వాల మెడలు వంచేలా పోరాటం జరగాలి. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పెట్టిందే బీఆర్ఎస్. ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బకెట్ నీళ్ల కోసం చెన్నై కన్నీరు పెట్టుకోవాలి. ఈ దుర్మార్గాలకు కాంగ్రెస్, బీజేపీనే కారణం. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషనలైజేషన్. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశారు. పథకాలను బీజేపీ అమలు చేయకపోతే బీఆర్ఎస్ అమలుచేస్తుంది. ఎల్ఐసీని అమ్మేయ్.. ఫర్వాలేదు. మేము మళ్లీ తీసుకుంటాము. ఎల్ఐసీ ఉద్యోగులు సింహాల్లా గర్జించాలి. 2024 తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి వెళ్తామన్నారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని సభా వేదికగా హామీ ఇచ్చారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని భ్రష్టు ప్రట్టిస్తున్నాయి: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
-
కేసీఆర్ మాకు పెద్దన్న: కేజ్రీవాల్
సాక్షి, ఖమ్మం: దేశం మార్పు కోరుతోందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందిపెడుతున్నారని, వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఆడిస్తున్నారని ఆరోపించారు. తాను ఇతర సీఎంలు, నేతలు కలసి రాజకీయాలు మాట్లాడుకోలేదని.. దేశ అభివృద్ధి కోసమే చర్చించామని తెలిపారు. ఖమ్మం సభలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.. వారందరికీ ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది. దానికి అనుగుణంగా గవర్నర్లు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించాలి, ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని 24 గంటలూ ఆలోచిస్తుంటే దేశం ఎప్పుడు బాగుపడుతుంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు. ఎవరి ఎమ్మెల్యేలను కొనాలి, ఎవరి ప్రభుత్వా న్ని పడగొట్టాలనే ఆలోచనే తప్ప ఏమీ పట్టడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా మన దేశం ఇంకా పేద దేశంగానే ఉంది. మనకంటే వెనుక స్వాతంత్య్రం వచ్చిన సింగపూర్ జపాన్ వేగంగా అభివృద్ధి చెందాయి. ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలి ఈ రోజు సీఎంలు అందరం కలిసి రాజకీయాలు చర్చించలేదు. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం. పరస్పర ఘర్షణ వైఖరి కాకుండా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఢిల్లీలో మేం చేపట్టిన మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు సీఎం కేసీఆర్ గల్లీల్లో తిరుగుతూ.. మా డాక్టర్లు, నర్సు లతో మాట్లాడారు. తెలంగాణలో బస్తీ దవాఖా నాలను ఏర్పాటు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ధిని చూసి.. ఆ రాష్ట్రంలోనూ చేపట్టి నన్ను ఆహ్వానించారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. 99.7 శాతం ఫలితాలు వచ్చాయి. కేరళలో స్కూళ్లు, హాస్పిటళ్లు బాగున్నాయి. దేశవ్యాప్తంగా అలా ఎందుకు లేవు? కేసీఆర్ పెద్దన్నలాంటి వారు తెలంగాణలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు గొప్ప కార్యక్రమం. నాలుగు కోట్ల మంది పేద, ధనిక వర్గాలకు కంటి పరీక్షలు చేసి మందులు, ఆపరేషన్లు, కళ్ల జోళ్లు ఉచితంగా అందించటం అభినందనీయం. తెలంగాణ నుంచి చాలా నేర్చుకున్నా.. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తాం. సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతం. కేసీఆర్ ఈ విషయంలో పెద్దన్నలాంటి వారు. తెలంగాణలో చేపట్టిన మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు: సీఎం భగవంత్‌మాన్
సాక్షి, ఖమ్మం: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారతీయ అబద్ధాల పార్టీగా మారిపోయిందని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ విమర్శించారు. గుట్టలు, నదులు, ఫ్యాక్టరీలు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే, ఎల్ఐసీ ఇలా దేశం మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని మండిపడ్డారు. ఖమ్మం సభలో భగవంత్‌మాన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ కూడా ఎర్రకోట మీద పంద్రాగస్టు ప్రసంగంలో నిరుద్యోగం, ఉగ్రవాదంపై చింతిస్తున్నానని చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇప్పటికైనా ప్రధాని ప్రసంగాన్ని మార్చాలి. నేను దేశాన్ని ప్రేమిస్తాను. బోకేలో రంగురంగుల పూలు ఉన్నట్టే.. దేశం రంగు రంగుల పూల సమాహారం. కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారు. బీజేపీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రాల్లో బీజేపీ గెలవదు. ఆ పార్టీది లోక్తంత్ర కాదు.. లూటీ తంత్రం. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అన్నీ తమ కోసమే అన్నట్టు వ్యవహరిస్తోంది. పంజాబ్‌లో కంటి వెలుగు ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌లో మొహల్లా క్లినిక్‌లు పెట్టాం. కంటి వెలుగు పథకం బాగుంది. ఇంత పెద్ద సభకు వచి్చన జనాన్ని చూసేందుకు పెద్ద కళ్లజోడు అద్దాలు ఉంటే ఇంకా బాగా చూసి ఆనందించేవాడిని. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్‌లో చేపడతాం. ఎమ్మెల్యేలను తక్కువ ధరకు అమ్మే పారీ్టగా కాంగ్రెస్ మారిపోయింది. గతంలో ఢిల్లీ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసింది. ఆ తర్వాత ట్రంప్ సతీమణి మన దేశంలో స్కూళ్లను చూడాలనుకుంటే.. కేజ్రీవాల్ అభివృద్ధి చేసిన స్కూళ్లనే కేంద్రం చూపించింది. దేశం కోసం బ్రిటీష్ వాళ్లతో పోరాడి ప్రాణాలు అరి్పంచిన భగత్‌సింగ్ గుర్తుగా ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం నినదించాలి. తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న కేసీఆర్‌కు అభినందనలు..’’ అని భగవంత్‌మాన్ పేర్కొన్నారు. -
అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు: సీపీఐ రాజా
సాక్షి, ఖమ్మం: బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నా.. తెలంగాణలో సుపరిపాలన అందుతోంది. సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్, తాగునీరు అందుతున్నాయి. రైతుబంధు, దళితబంధు పథకాలు దేశానికే ఆదర్శం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. మోదీ వెనుక అంబానీ, అదానీ ఉండి నడిపిస్తున్నారు. రిపబ్లిక్ దేశంగా ఉన్న దేశాన్ని మార్చి ఒకే మతం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారు. మోదీ పేదలు, రైతుల పక్షాన లేకుండా.. అదానీ, అంబానీ, టాటా బిర్లాల జపం చేస్తున్నారు. బీజేపీ గవర్నర్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్‌ను ఇబ్బంది పెడుతోంది. 2024లో అందరు కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఐక్య పోరాటాలు చేయాలి. ఐక్య పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలి. బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం’ అని డి.రాజా చెప్పారు. -
కేసీఆర్‌కు మా మద్ధతు: కేరళ సీఎం విజయన్
సాక్షి, ఖమ్మం: దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు జాతీయ సంపదను కొల్లగొట్టి, పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. జాతీయ విధానానికి స్వస్తి పలికి ప్రైవేట్ శక్తులను పెంచి పోషిస్తున్నాయని.. దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని పేర్కొన్నారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటయ్యే అవకాశం వచ్చిందని.. ఈ సభ జాతికి దిశానిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో విజయన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉంది. కంటి వెలుగు పథకం చరిత్రలో నిలిచిపోతుంది. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త పోరాటానికి తెరలేపారు. ఆయనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. దేశ సమగ్రత, హక్కులను కాపాడుకోవా ల్సిన బాధ్యత అందరిపై ఉంది. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోంది. గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా.. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్ చేస్తోంది. సంస్కరణల పేరుతో అనైతిక విధానాలను ఆచరిస్తోంది. న్యాయవ్యవస్థలను నాశనం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియంపై కూడా రాజకీయాలు చేస్తూ రాజ్యాంగ నిబంధనలను హరించివేస్తోంది. దేశ బడ్జెట్లో సామాన్యులకు కేటాయించడానికి నిధులు లేవంటూ.. కార్పొరేట్ శక్తులకు మాత్రం దోచిపెడుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలి విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తోంది. సామ్యవాద, ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ను విభజించేందుకు కుట్ర జరుగుతోంది. దేశ సంస్కృతిని నాశనం చేస్తూ గాంధీజీని హిందూత్వవాదిగా చూపిస్తూ దేశవ్యాప్తంగా హిందూత్వాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోంది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పరిపాలన, ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్రాల్లో పాలనను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్న బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలి..’’ అని పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ప్రసంగిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్ -
నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భేరీ
-
మంత్రి హరీష్, తుమ్మల కీలక వ్యాఖ్యలు..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావుతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సభ చారిత్రాత్మకమైనది. ఆనాడు తెలంగాణ సభ సింహగర్జనను కరీంనగర్లో ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. ఈ సభలో సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన జిల్లా ఉమ్మడి ఖమ్మం. జాతీయ రాజకీయాలకు ఖమ్మం వేదిక కానుంది. సభ కోసం 100 ఎకరాలు కేటాయించాము. పార్కింగ్ కోసం 20 ప్రాంతాలను ఏర్పాటు చేశాము. పార్కింగ్ బాధ్యతలను ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించాము. నియోజకవర్గాలుగా ఇంచార్జీలను ఏర్పాటు చేశాము. ఆరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. వాహనాలు కాకుండా కాలి నడకన వేలాదిగా తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేదికపై ఉంటారు అని తెలిపారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ చారిత్రాత్మకమైనది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వచ్చాక ఖమ్మం అభివృద్ధి ఏంటో చూడాలి. సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఖమ్మంలో ఉండి అభివృద్ధికి నిధులు ఇచ్చి.. ఖమ్మం స్వరూపం మార్చారు. దేశ ప్రజల ఆకాంక్షే బీఆర్ఎస్ ఖమ్మం సభ అని తెలిపారు. -
బరాబర్.. తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కొట్లాడుతా
-
వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం: వైఎస్ విజయమ్మ
-
వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ఇకపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజన్న తరహా సంక్షేమ పాలన కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా తమ పార్టీ ముందుకుసాగుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ‘రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ’కు తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వచ్చిన వైఎస్ షర్మిల తొలుత సభా ప్రాంగణంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి ఫలాలన్నీ ఆ కుటుంబానికే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్‌ను తిరిగి ప్రతిష్టించేందుకు పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదన్నారు. విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు లేవని విమర్శించారు. నీళ్లు, నిధులు, ని యామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ లో అభివృధ్ధి ఫలాలన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయ్యాయని, వారి కుటుంబమే లబ్ధి పొందుతోందని ఆరోపించారు. పదవులన్నీ బంధు వర్గానికి, భజన బ్యాచుకే కట్టబెడుతున్నారన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభకు హాజరైన జనం బంగారు తెలంగాణ ఎక్కడుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడుందని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం అంతా కేసీఆర్ దొరగారి ఎడమ కాలిచెప్పు కింద పడి నలిగిపోతోందని విమర్శించారు. దేశంలో సచివాలయానికి రాని ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీ డిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి అవినీతికి పాల్పడ్డారని, దీన్ని ప్రశ్నించేందుకు ఒక పార్టీ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్..నేను ఏడ్చినట్లు చేస్తా’అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై కొత్త పార్టీతో వస్తున్నా..’అని అన్నారు. దారి పొడవునా ఘనస్వాగతం షర్మిలకు హైదరాబాద్ నుంచి ఖమ్మం పట్టణం వరకు దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. లోటస్ పాండ్ నుంచే షర్మిల వాహనం వెంబడి వందలాది వాహనాలు అనుసరించాయి. పలుచోట్ల నేతలు, అభిమానులు పూలు, హారతులు, బోనాలతో షర్మిలకు స్వాగతం పలికారు. 15 నుంచి హైదరాబాద్‌లో నిరాహార దీక్ష రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో రిలేదీక్షలు చేస్తారని తెలిపారు. నా బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన రోజునే షర్మిల తన రాజకీయ అడుగులు మొదలు పెడుతున్నారని వైఎస్ విజయమ్మ తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలంటూ, ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. షర్మిల స్వభావం పూర్తిగా వైఎస్ రక్తం నుంచే వచ్చిందని, వైఎస్ మాదిరే షర్మిల సైతం మంచి పాలన అందిస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల గతంలో తెలంగాణలో చేసిన ప్రతి యాత్రలో ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటుందని అన్నారు. వైఎస్‌ను గతంలో తెలంగాణ ప్రజలు ఆదరించారని, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటామని తెలిపారు. వైఎస్ భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చానని విజయమ్మ పేర్కొన్నారు. -
నా బిడ్డ షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ
ఖమ్మం: ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఖమ్మం నుంచి ప్రజలతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చిందని వైఎస్ విజయమ్మ అన్నారు. షర్మిలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలతో తమకున్న అనుబంధం చెరిగిపోనిదని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ని నాయకుడిగా నిలబెట్టిన ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంది అని పేర్కొన్నారు. వైఎస్సార్ లేరన్న వార్తతో అనేక గుండెలు ఆగిపోయాయని గుర్తుచేశారు. ఖమ్మం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని మాట్లాడారు. ‘‘ వైఎస్సార్ మనిషిని మనిషిగానే ప్రేమించారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సంక్షేమ ఫలాలు అందించారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించిన దమ్మున్న నాయకుడు వైఎస్సార్. వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగం. కరెంటు బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఏవీ పెంచలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి మేలు చేశారు. ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే అయినా వైఎస్ఆర్ చలవే. నా బిడ్డ షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి’’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన -
తెలంగాణలో జిల్లాకొక సభ: బాబు
ఖమ్మం సభ తరహాలో తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఒకటి చొప్పున సభలను నిర్వహించనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఖమ్మంలో శనివారం నాటి సభకు గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలోనూ రానంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. తెలంగాణ అంశంలో తనది రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరికాయ సిద్ధాంతమని కొందరు ఎద్దేవా చేశారని.. తాను చెప్పిందే సరైందని ఇప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపడతానని గతంలో చెప్పిన చంద్రబాబు ఇందుకు సంబంధించిన ప్రక్రియకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ‘మీ ఊరు-మీ అభ్యర్థి-మీ ఇష్టం’ పేరిట పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు ఫోన్ చేసి.. వారి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సూచించే ముగ్గురి అభ్యర్థుల్లో ఎవరు గెలవగలరో అభిప్రాయాలు అడుగుతారు. ముగ్గురూ నచ్చకపోతే కొత్త పేర్లను సూచించే అవకాశమిస్తారు. తన అభ్యర్థిత్వంపైనా కుప్పం నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ కోరతానని చెప్పారు. శత్రుచర్ల చేరిక: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్, రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మేడా మల్లిఖార్జునరెడ్డి ఆదివారం వేర్వేరుగా బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం శత్రుచర్ల విలేకరులతో మాట్లాడుతూ బాబు నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేయమని కోరితే అక్కడ్నుంచి పోటీ చేస్తానన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యాసంస్థ అధినేత ఎం.కృష్ణారావు కూడా టీడీపీలో చేరారు. ఐదు జిల్లాల్లో ప్రజాగర్జన సభలు: ఇదిలా ఉండగా ఈ నెల 21న కర్నూలు, 22న మహబూబ్‌నగర్, 25న కడప, 26న కృష్ణా, 27న తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగే ప్రజాగర్జన సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని పార్టీ ఉపాధ్యక్షుడు కె.రామ్మోహనరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలంటూ గవర్నర్‌కు బాబు లేఖ రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా ఏప్రిల్ 15 వరకు వివిధ ప్రాజెక్టుల కింద సాగునీటిని విడుదల చేయాలని, విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు ఆదివారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.