సాక్షి, ఖమ్మం: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారతీయ అబద్ధాల పార్టీగా మారిపోయిందని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ విమర్శించారు. గుట్టలు, నదులు, ఫ్యాక్టరీలు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే, ఎల్‌ఐసీ ఇలా దేశం మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని మండిపడ్డారు. ఖమ్మం సభలో భగవంత్‌మాన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ కూడా ఎర్రకోట మీద పంద్రాగస్టు ప్రసంగంలో నిరుద్యోగం, ఉగ్రవాదంపై చింతిస్తున్నానని చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇప్పటికైనా ప్రధాని ప్రసంగాన్ని మార్చాలి. నేను దేశాన్ని ప్రేమిస్తాను. బోకేలో రంగురంగుల పూలు ఉన్నట్టే.. దేశం రంగు రంగుల పూల సమాహారం. కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారు. బీజేపీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రాల్లో బీజేపీ గెలవదు. ఆ పార్టీది లోక్‌తంత్ర కాదు.. లూటీ తంత్రం. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అన్నీ తమ కోసమే అన్నట్టు వ్యవహరిస్తోంది.
పంజాబ్‌లో కంటి వెలుగు
ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌లో మొహల్లా క్లినిక్‌లు పెట్టాం. కంటి వెలుగు పథకం బాగుంది. ఇంత పెద్ద సభకు వచి్చన జనాన్ని చూసేందుకు పెద్ద కళ్లజోడు అద్దాలు ఉంటే ఇంకా బాగా చూసి ఆనందించేవాడిని. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్‌లో చేపడతాం. ఎమ్మెల్యేలను తక్కువ ధరకు అమ్మే పారీ్టగా కాంగ్రెస్ మారిపోయింది. గతంలో ఢిల్లీ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసింది. ఆ తర్వాత ట్రంప్ సతీమణి మన దేశంలో స్కూళ్లను చూడాలనుకుంటే.. కేజ్రీవాల్ అభివృద్ధి చేసిన స్కూళ్లనే కేంద్రం చూపించింది. దేశం కోసం బ్రిటీష్ వాళ్లతో పోరాడి ప్రాణాలు అరి్పంచిన భగత్‌సింగ్ గుర్తుగా ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం నినదించాలి. తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న కేసీఆర్‌కు అభినందనలు..’’ అని భగవంత్‌మాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment