సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మంలో తలపెట్టిన సభ విజయవంతమైంది. సభలో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఖమ్మం ప్రజలపై వరాలు కురిపించారు. ఈ క్రమంలోనే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
దీంతో, కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్.. గుజరాత్‌లో ఎందుకు పోటీ చేయలేదు. బీజేపీతో పోరాడతానుంటున్న కేసీఆర్.. కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీనే. విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని మోదీ అమ్మకానికి పెట్టిన సంస్థలు స్థాపించింది కాంగ్రెస్ పార్టీనే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే కమ్రంలో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అందుకే బడ్జెట్ సమావేశాలను ఆలస్యం చేస్తున్నారు. టెక్నికల్‌గా ఎన్నికల సంఘం అడ్డురాకుండా ఉండేందుకు బడ్జెట్ సమావేశాలను ఆలస్యం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment