సాక్షి, హైదరాబాద్: లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు ఐదేళ్లు పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఐదేళ్లైనా లక్ష రుణమాఫీ చేయని బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అన్నారు కానీ.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజును చేసే పనిలో పడ్డామని చెప్పారు తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాజీ మంత్రుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.
‘ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం. మిగతా ఖర్చులు తగ్గించుకుని రైతులకు మేలుచేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైన ఉన్న మొత్తంచెల్లిస్తే రుణమాఫీ అవుతుంది. బీఆర్‌ఎస్‌లా మేం రూ. వేల కోట్లు దోచుకోలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పాం
కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్
రేవంత్‌పైకేసు పెట్టినప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్ ఇల్లు అని పెట్టారు. ఇప్పుడా ఇల్లు నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు. నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జోన్‌లో పాంహౌజ్ కట్టుకున్నారు. మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పను
నా ఇళ్ళు బఫర్ జోన్‌లో ఉన్నా.. ఎఫ్‌టీఎల్‌లో ఉన్నా మొత్తం పడగొట్టండి. కేటీఆర్ చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ విమర్శలకు కట్టుబడి ఉండాలి. కొత్త టేప్ తెచ్చుకుని కొలవండి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment