'మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేయాలి' | telangana ysr congress party farm loan waiver | Sakshi
Sakshi News home page

'మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేయాలి'

Published Mon, Jun 9 2014 11:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

telangana ysr congress party farm loan waiver

హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు,  మదన్‌లాల్‌ తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మరణించిన విద్యార్థులు, తెలంగాణ అమరవీరులకు అసెంబ్లీలో సంతాపం తీర్మానం పెట్టాలని వారు సూచించారు.

నవ తెలంగాణ నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలుగా సోమవారం వీరు ప్రమాణస్వీకారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement