
'నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర'
నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో కూడా తాము ప్రజల పక్షానా పోరాడతామని తెలిపింది.
హైదరాబాద్: నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో కూడా తాము ప్రజల పక్షానా పోరాడతామని తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని తెలంగాణ అడ్హక్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అడ్హక్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు పాల్గొనాలని పొంగులేటి పిలుపునిచ్చారు.