
'ఒంటరిగానే పోటీకి దిగుతాం'
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్గా మర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఒకటి, రెండు రోజుల్లో గ్రేటర్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. ఒంటరిగానే పోటీలోకి దిగుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.