టీ.వైఎస్ఆర్ సీపీ కార్యదర్శిగా దుబ్బాక సంపత్ | appointment of Telangana YSRCP office bearers | Sakshi
Sakshi News home page

టీ.వైఎస్ఆర్ సీపీ కార్యదర్శిగా దుబ్బాక సంపత్

Published Thu, Aug 4 2016 6:52 PM | Last Updated on Sat, Aug 11 2018 8:00 PM

appointment of Telangana YSRCP office bearers

హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో  నియామకాలు చేసింది. రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శులుగా తిరుపతయ్య, గంగాధర్, హనుమంతురెడ్డి, సిరి రవిని ఆపార్టీ నియామకం చేసింది. అలాగే వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శిగా దుబ్బాక సంపత్, జీహెచ్ఎంసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సుధాకర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడుగా వందాల సతీష్ నియమితులయ్యారు.

వైఎస్ఆర్ సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అనుమతితో, పార్టీ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్ ఆధ్వర్యంలో వారిని రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో నియమించడం అయింది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement