'పోలవరం బాధితులకు న్యాయం చేయండి' | Give justice to polavaram project, demands Telangana YSR Congrees party MP,MLAs | Sakshi
Sakshi News home page

'పోలవరం బాధితులకు న్యాయం చేయండి'

Published Fri, May 30 2014 1:30 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

Give justice to polavaram project, demands Telangana YSR Congrees party MP,MLAs

పోలవరం ముంపు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ను కలసి స్థానిక ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్లాల్లు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్పై తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది. అందులోభాగంగా గురువారం తెలంగాణ బంద్కు ఆ పార్టీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement