
శివకుమార్‌కు వైఎస్సార్‌సీపీ షోకాజ్ నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌కు తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శివకుమార్‌కు తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనందున గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవిధంగా ఉన్నాయని, అందుకే ఆయనకు షోకాజ్ నోటీసుల జారీ చేశామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటీసులపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని శివకుమార్‌ను కోరారు.