హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో పోలీస్ రాజ్యం నడుస్తోందని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడిమా సమావేశంలో మాట్లాడుతూ....'బంగారు తెలంగాణ అంటే ఇదేనా?. నిర్వాసితులకు ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలి. రీ డిజైన్ పేరుతో తెలంగాణ ప్రజలను ముంచుతున్నారు. చట్టప్రకారం భూ సేకరణ జరపాలి. లేకుంటే నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తాం' అని తెలిపారు. కాగా మెదక్ జిల్లా తోగుట మండలంలో మల్లన్న ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 15వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు భూసేకరణ కోసం సర్కారు 123, 214 జీవోలను విడుదల చేసింది.. అయితే ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి… దీంతో ఈ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.. భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే.
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?..
Published Fri, Jun 17 2016 1:14 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
Advertisement
Advertisement