హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. లోటస్ పాండ్లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్దమైంది. వచ్చే నెల మొదటివారం నుంచి వైఎస్ జగన్ వారం రోజుల పాటు ఈ సమీక్షలు చేయనున్నారు. ఇప్పటికే సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీలు రివ్యూ చేస్తున్నాయి.
తెలంగాణ వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం భేటీ
Published Sat, May 31 2014 11:24 AM | Last Updated on Sat, Aug 11 2018 8:00 PM
Advertisement
Advertisement