ఆస్తి తగాదాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
Published Thu, Dec 24 2015 10:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
సాలూరు: అన్నదమ్ముల ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సాలూరు తెలగ వీధికి చెందిన కూనుశెట్టి రాంబాబుకు తోబుట్టువులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు బుధవారం కోర్టు నోటీసులు అందాయి.
దీనిపై బుధవారం రాత్రి అన్నదమ్ములతో వాగ్వాదం చోటు చేసుకుంది. వీటన్నిటితో మనస్తాపం చెందిన రాంబాబు భార్య వరలక్ష్మి(45) గురువారం ఉదయం ఆ వీధిలో అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement