-
కలెక్టరేట్‌లో పైఅంతస్తు నుంచి కుమార్తెతో దూకేందుకు యత్నం
-
అడ్డుకున్న సిబ్బంది
కాకినాడ క్రైం :
కట్టుకున్న భర్త కాపురం చేయడానికి నిరాకరించడం..పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంతో భవిష్యత్తుపై ఆందోళనతో ఏడాది కుమార్తెతో కలిసి కలెక్టరేట్ పై అంతస్తు నుంచి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించిన సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కరప మండలానికి చెందిన రమణమ్మ పెదపూడికి చెందిన తుమ్మలపల్లి వేణులు ఏడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ నేపధ్యంలో వేణు వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి తనను, తన, పిల్లల ఆలనా, పాలనా చూడకపోవడంతో గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై పెదపూడి పోలీస్‌స్టేçÙన్లో భర్తపై కేసు పెట్టింది. వీరిద్దరి మధ్య రాజీకి పోలీసులు పలుసార్లు యత్నించారు. తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో తన భర్త కులం పేరుతో దూషించాడంటూ పోలీస్ కేసు పెట్టారు. పోలీస్‌లు రమణమ్మ ఫిర్యాదు మేరకు తుమ్మలపల్లి మధుపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసి, సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తన కాపురం నిలబెట్టాలని పోలీసులను కోరితే ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టకుండా రిమాండ్‌కు పంపడంతో మనస్తాపానికి గురయింది. భర్త బెయిల్‌పై బయటకు వచ్చి ఏమి చేస్తాడోనని ఆందోళనతో మంగళవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్‌కొచ్చి పైఅంతస్తు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు యత్నించింది. అనుమానాస్పదంగా ఉన్న రమణమ్మను గమనించిన సిబ్బంది జేసీ–2 వద్దకు తీసుకెళ్లారు. జేసీ ఆదేశాలపై కాకినాడ డీఎస్పీ వద్దకు తీసుకెళ్లి ఈమెను అప్పగించారు. రవణమ్మకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన భర్త వేణును అరెస్టు చేస్తే ఇక తననేం చూసుకుంటాడని, తనకు, పిల్లలకు చావు ఒక్కటే శరణ్యమని చెప్పింది. ఈ విషయమై పెదపూడి ఎస్సై సుమంత్‌ను వివరణ కోరగా వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా కేసు నడుస్తోందని, రాజీకి ప్రయత్నించామన్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన సంతానం విషయంలో కూడా డీఎ¯ŒSఏ పరీక్షల కోసం సిఫార్సు చేశామన్నారు. ఇద్దరిపై పోలీస్టేçÙన్లో కేసులున్నట్లు తెలిపారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.