కాకినాడ క్రైం :
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఫ్రెండ్లీగా తిరిగాం.. మనది ఉత్తుత్తి వివాహమే.. కలిసి జీవించడం కుదరదని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాకినాడలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట మండలం వేట్లపాలెం ఎస్సీపేటకు చెందిన పరస హారతి(ఆర్తి) రమణయ్యపేటలోని పురుషుల హాస్టల్‌లో వంటకుక్‌కి హెల్పర్‌గా పని చేస్తుంది. జేఎన్ టీయూకేలో బీటెక్ చదువుతున్న హైదరాబాద్ బేగంపేటకు చెందిన మౌర్యకృష్ణసాయితో హారతికి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు ఈ ఏడాది జూలై 27న అన్నవరంలో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని హారతి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటోంది. వివాహానంతరం వేట్లపాలెం అమ్మమ్మ ఇంటి వద్ద రెండు నెలల పాటు కాపురం చేశారు. ఆ తర్వాత అక్టోబర్ రెండున ఇంటి నుంచి వెళ్లిన తన భర్త కనిపించకుండా పోయాడని హారతి వాపోయింది. బలవంతంగా తనకు మాత్రలు ఇచ్చి గర్భాన్నీ విచ్ఛిన్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో ఉన్న మావయ్య, అత్తయ్య విశ్వప్రసాద్, ధరణికి ఫో¯ŒS చేస్తుంటే ఎస్సీ కులానికి చెందిన నీతో, మా కుమారుడు వివాహం చేసుకోవడమేంటి, కాపురం చేయడమేంటని తనను కులంపేరుతో దూషించారని వాపోయింది. తనను ప్రేమిస్తున్నానని, ప్రేమించకపోతే సముద్రంలో దూకేస్తానని బెదిరించి పెళ్లిచేసుకున్న తన భర్త ఇప్పుడు హైదరాబాదులో ఉన్న తల్లిదండ్రుల మాటలు విని, నీవు కులం తక్కువదానివి, రూ.ఆరు లక్షలు కట్నం ఇస్తేనే కాపురం చేస్తాననడంతో గత్యంతరం లేక ఈ నెల 4న కాకినాడలోని మహిళా పోలీస్టేçÙన్లో ఫిర్యా దు చేశానన్నారు. సోమవారం రాత్రి మహిళా పోలీస్టేçÙ¯ŒS డీఎస్పీ తన భర్త, తనను పిలిపించి మాట్లాడారన్నారు. ఫ్రెండ్లీగా తిరిగాం. ఉత్తుతి వివాహం చేసుకున్నామని సాక్షాత్తు డీఎస్పీ ఎదుటే తన భర్త చెప్పడంతో తట్టుకోలేక, ఇంటికెళ్లి రెండు చేతులపై బ్లేడ్లతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త, ఇంట్లోవాళ్ల మాటలు విని, తనతో కాపురం చేయడానికి నిరాకరిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జయరావు చెప్పారు.