పెద్దచెర్లపల్లి(ప్రకాశం): ప్రకాశం జిల్లా పీసీపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం ఉదయం ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించింది. గ్రామానికి చెందిన కల్లూరి అంకమ్మకు పొరుగువారితో భూ తగాదాలున్నాయి. ఈ విషయంలో పోలీసులు ప్రత్యుర్థులకే సహకరిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితో తనకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని, పురుగు మందుతాగింది. గమనించిన పోలీసులు ఆమెను వెంటనే కనిగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అంకమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
Published Mon, Aug 1 2016 10:15 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement