
సాక్షి, హైదరాబాద్: వివాహం చేసుకుంటానని వ్యక్తి మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆ యువతి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు షాదీ డాట్‌కాం సైట్‌లో సాయినాథ్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా తిరిగాడు. తర్వాత ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. చికిత్స అనంతరం ఆమె సాయినాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment