Salur
-
సాలూరు పోలీస్ స్టేషన్ లో పేలుడు కలకలం
-
సాలూరు మున్సిపాలిటీలో గడప గడపకు మన ప్రభుత్వం
-
ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్ వచ్చాక కాదన్నాడు
సహ విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటానని శారీకరకంగా లోబరుచుకున్నాడు. తీరా ఉద్యోగం వచ్చాక తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, పెద్దలు కౌన్సెలింగ్ ఇచ్చినా వివాహానికి నిరాకరించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. రామభద్రపురం: బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన మెరుపుల నాగేంద్ర, రామభద్రపురానికి చెందిన ఓ విద్యార్థిని 2014 నుంచి బొబ్బిలి రాజాకళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ప్రేమగా మారింది. ఉద్యోగం వస్తే వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. మూడు నెలల కిందట ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాగేంద్రకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి మే 31వ తేదీన పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేశారు. నిందితుడ్ని బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం సాలూరుకు రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై కృష్ణమూర్తితో కలసి సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు విలేకరులకు వెల్లడించారు. చదవండి: ప్రేమించి.. లోబర్చుకుని.. ఉద్యోగమొచ్చాక కాదన్నాడు -
వారు నకిలీ గిరిజనులే..
సాలూరు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్.పి. భంజ్‌దేవ్‌తో పాటు అర కు పార్లమెంటరీ అభ్యర్థి కిషోర్‌చంద్రదేవ్ గిరిజనులు కాదంటూ గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయసలహాదారుడు రేగుమహేశ్వరరావు విడుదల చేసిన కరపత్రాలు హల్చల్ చేస్తున్నా యి. భంజ్‌దేవ్ తాత, తండ్రి ఒరియా క్ష త్రియగా ప్రభుత్వడాక్యుమెంట్లలో క్లియర్‌గా ఉందని, 1900 సంవత్సరం నుంచి 1979వరకు క్షత్రియగానే చూపుతున్నాయని పేర్కొన్నారు. అయితే 1979లో భంజ్‌దేవ్ కొండదొరగా కులధ్రువీకరణ పత్రంపొందారని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కరపత్రాల్లో పొందుపరిచారు. గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో అసలైన గిరిజనుడికే ఓటేయాలని కోరారు. అలాగే కిషోర్ చంద్రదేవ్ తాత క్షత్రియగా తెలిపే 1901 నాటి రికార్డుల నుంచి కిషోర్‌చంద్రదేవ్ 1 957 నాటి స్కూల్ రికార్డుల్లో కూడా క్ష త్రియగా నే ఉందని, వీరు చెప్పుకుంటున్న కొండరాజు కులం ఎస్టీ జాబితాలోనే లేదని వివరించారు. -
పొలంలో బయటపడ్డ బంగారం
సాలూరు: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లాలో చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తున్న శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలిలా వున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సమీర్‌కు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలో కొంత భూమి ఉంది. దానిని విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి లీజుకు సాగుచేస్తున్నారు. గత శుక్రవారం వరకు భూమిని అభివృద్ధి చేసేందుకు యంత్రాలసాయంతో నొల్లించారు. అనంతరం కురిసిన వర్షాలతో ఆదివారం ఆ భూమిలో ఒక పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు వెలుగు చూశాయి. శ్యామల గౌరీపురం గ్రామానికి చెందిన ఓ యువతికి ఆ ఆభరణాలు కనిపించడంతో వాటిని తెచ్చి అష్టలక్ష్మీదేవి ఆలయం వద్దనున్న బోరింగువద్ద కడిగి ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. పంట భూమిలో బంగారునగలు, వెండి ఆభరణాలు దొరికిన విషయం గ్రామంలో వ్యాపించడంతో పలువురు ఆ భూమిలో వెదుకగా మరికొన్ని చైన్లు, ముక్కుపుడకలు దొరికినట్ట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డితో పాటు గ్రామస్థుల్లో కొందరిని సాలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో దొరికిన బంగారు చైన్‌ను ఒకరు పట్టణంలోని ఓ నగల దుకాణంలో అమ్మిన విషయాన్ని సైతం పోలీసులు గుర్తించినట్టు సమాచారం. -
15 బస్తాల గుట్కా, కైనీ పట్టివేత
సాలూరు (విజయనగరం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల గుట్కా, కైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రానికి చెందిన డీఎంపీపీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో శుక్రవారం సరుకును దించుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు లక్షా 80 వేలు ఉంటుందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. స్పెషల్ టీం పోలీసుల సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్టు పేర్కొన్నారు. సరుకును దించే దగ్గర దానికి సంబంధించిన వ్యాపారులు ఎవరూ లేకపోవడంతో అక్రమ దందా చేసేవారిని పట్టుకోలేక పోయామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. కచ్చితంగా అక్రమ రవాణాకు పాల్పడే వారిని పట్టుకుని తీరతామన్నారు. బొబ్బిలి, పార్వతీపురంకు చెందిని వ్యాపారులే ఈ రవాణాకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఈదురు గాలులు: 400 ఎకరాలు నేలమట్టం
సాలూరు (విజయనగరం) : ప్రకృతి వైపరీత్యానికి అరటి రైతు భారీగా నష్టపోయాడు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో శనివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు సుమారు 400 ఎకరాలలో అరటి తోటలు నేల మట్టం అయ్యాయి. దీంతో రూ. కోటిన్నర వరకు రైతులు నష్టపోయారు. విషయం తెలుసకున్న సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆస్తి తగాదాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
సాలూరు: అన్నదమ్ముల ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సాలూరు తెలగ వీధికి చెందిన కూనుశెట్టి రాంబాబుకు తోబుట్టువులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు బుధవారం కోర్టు నోటీసులు అందాయి. దీనిపై బుధవారం రాత్రి అన్నదమ్ములతో వాగ్వాదం చోటు చేసుకుంది. వీటన్నిటితో మనస్తాపం చెందిన రాంబాబు భార్య వరలక్ష్మి(45) గురువారం ఉదయం ఆ వీధిలో అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మందుగుండు సామాగ్రి స్వాధీనం
సాలూరు (విజయనగరం జిల్లా) : సాలూరు మండలంలో గురువారం సుమారు రూ.40 వేలు విలువ చేసే మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలకేంద్రం లావుడువీధిలో బుచ్చిరాజు అనే వ్యక్తి ఇంటిలో రూ.25 వేల విలువైన మందుగుండు సామగ్రి, వడ్డివీధిలో మజ్జిశ్యామలమ్మ అనే మహిళ ఇంట్లో రూ.15 వేల విలువైన మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ మారుఫ్ తెలిపారు. -
గోదాములో భారీగా ఎగసిపడ్డ మంటలు
సాలూరు : విజయనగరం జిల్లా సాలూరులోని పెద్ద బజార్లో ఉన్న ఓ గోనె సంచుల గోదాములో శనివారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాచర్ల ఈశ్వరరావుకు చెందిన గోదాములో మంటలు ఎగసిపడ్డాయి. అయితే స్థానిక అగ్నిమాపక సిబ్బంది జన్ని వీధిలో వేరొక అగ్ని ప్రమాదం సమాచారంతో అక్కడికి వెళ్లగా... బాడంగి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. కాగా, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆదివారం ఉదయం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. జన్ని వీధిలో రెండు పూరిళ్లు దగ్ధం కాగా, బాధితులు వాసంశెట్టి మహేశ్, రాము కుటుంబ సభ్యులకు తగిన సాయం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే. పెద్ద బజార్లో అగ్ని ప్రమాదం జరిగిన గోదామును కూడా పరిశీలించారు. -
అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు
విజయనగరం : అమ్మా.. ఉల్లి తల్లమ్మా.. మామీద కనికరం చూపమ్మా...అంటూ మహిళలు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. సాలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా ఈ విధంగా తమ ఆందోళన తెలిపారు. ప్రభుత్వాల చేతగానితనం వల్లే ఉల్లి ధరలు ఆకాశనంటాయని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళలు గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం ఉల్లి గడ్డల ధరలను నియంత్రించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని మహిళలు అందజేశారు. -
కొండచిలువ దెబ్బకు 12 మేకలు బలి
సాలూరు: అటవీ ప్రాంతం నుంచి బయటికొచ్చిన ఓ కొండ చిలువ ఎనిమిది మేకలను మింగేసింది. మరో నాలుగు మేకలపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన రాజు నిద్రలేచి చూడగా తన ఇంటి ఆవరణలో జరిగిన ఘోరాన్ని చూసి భయకంపితుడయ్యాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులకు వచ్చి కొండచిలువను పట్టుకుని వెళ్లారు. -
మా ఆయన బంగారం అనుకుంది కానీ..
సాలూరు: ప్రేమించానని చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. బంగారం షాపు నిర్వహిస్తున్నాడు. అతని మనసు కూడా బంగారమే అయి ఉంటుందని భావించి కోటి ఆశలతో ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో సోమవారం అర్ధరాత్రి మృతిచెందింది. సాలూరు పట్టణంలోని నాయుడు వీధిలో జరిగిన సంఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బంగారం షాపు నిర్వహిస్తున్న కొల్లేపర మధు గరివిడికి చెందిన కాదవం శార్వాణి(24)ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె తల్లిదండ్రుల సమ్మతితో 2009లో సింహాచంలంలో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నాలుగేళ్ల దీక్షిత్, ఏడాదిన్నర యశ్మిత్ ఉన్నారు. అయితే గత మూడేళ్ల నుంచి శార్వా ణిని భర్త నిత్యం అదనపు కట్నం కోస వేధిస్తూ హతమార్చాడని మృతురాలి తల్లిదండ్రులు, ఇతర మహిళలు మంగళవారంఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో శార్వాణి ఫోన్‌చేసి భర్త కొడుతున్నాడని తెలిపిందని మృతురాలి తల్లి సూర్యకళ తెలిపారు. రాత్రి 12గంటల ప్రాంతంలో కాలిపోయి చనిపోయిందని సమాచారం తెలియడంతో హుటాహుటిన ఇక్కడికి వచ్చామని వాపోయారు. భార్య ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదు చేసిన భర్త తన భార్య ఇంటిలో కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని, తాను కాపాడే ప్రయత్నం చేశానని, ప్రయోజనం లేకపోయిందంటూ సోమవారం అర్ధరాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి మధు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాలుతున్న శార్వాణి మృతదేహాన్ని చూసి భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. మహిళల ఆందోళన ఇదిలా ఉండగా తమ బిడ్డను అల్లుడే హత్యచేశాడని, అనంతరం, కిరోసిన్‌పోసి నిప్పంటించాడని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు రోదించడంతో వారికి ఐద్వా నాయకురాలు లక్ష్మి, సీపీఎం నాయకులు గేదెల సత్యనారాయణ, శ్రీను, ఎన్వై నాయుడు తదితరులు సంఘీభావం తెలుపుతూ ఇతర మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేశారు. ఏఎస్పీ విచారణ; ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఈఘటనపై విచారణ జరి పారు.ఆధారాల సేకరణకోసం క్లూస్‌టీంను రప్పిం చారు. తహశీల్దార్ కె ఆనందరావు సహకారంతో శవపంచనామా నిర్వహించారు. ఆందోళనకు దిగినవారి తో ఏఎస్పీ మాట్లాడుతూ సంఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హా మీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. అదుపులో నిందితులు మృతురాలి భర్తతోపాటు అతని తమ్ముడు రమేష్, తల్లి సుశీల,మరదలు సౌజన్య, సోదరి సరస్వతి, బావ శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా క్లూస్‌టీంకు కీలక ఆధారం లభించినట్టు సమాచారం. భర్త తనను హింసిస్తున్నాడని, తనకు ఏక్షణమైనా ప్రాణహాని తప్పదని, తన బిడ్డలను మీరే చూసుకోవాలని తలిదండ్రులను ఉద్దేశించి శార్వాణి డైరీలో రాసుకున్నట్టు క్లూస్ టీం గుర్తించారు. అయితే ఆకాగితాన్ని డైరీనుంచి చింపేశారని, కానీ పెన్నురాతతో కింది కాగితంపై ఏర్పడ్డ గీతల ఆనవాళ్ల ఆధారంగా వివరాలను సేకరించి నట్టు తెలిసింది. -
మీకు...మేమున్నాం!
సాలూరు, న్యూస్‌లైన్ : ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరూ అధైర్యపడొద్దని... కార్యకర్తలకు తాము అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భరోసా ఇచ్చారు. ఆదివారం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర 50వ జన్మ దినోత్సవంతో పాటు ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందడం తో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముందుగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, చీపురుపల్లి నేత బెల్లాన చంద్రశేఖర్ తదితరులు రాజన్నదొరకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభ లో రాజన్నదొర మాట్లాడుతూ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబసభ్యులను కూడా కాదనుకుని పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల సేవలను తాము మరవలేమన్నారు. టీడీపీ నాయకులు దాడులకు పాల్ప డినా... వెరవకుండా నిలబడి విజయాన్ని కట్టబెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పా రు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలాంటి నిబంధనలు పెట్టకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాటి అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చె బుతున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారితో ఉద్యమానికి దిగుతామని చెప్పారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి : అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రైల్వేలైన్ నిర్మాణం, బైపాస్ రోడ్డు కోసం కూడా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతోనే జగనన్న పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రాజన్న కష్టం... హైదరాబాద్‌లోనూ చెబుతారు : ఎమ్మెల్యే రాజన్నదొర నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగా కష్టపడతారో హైదరాబాద్‌లోనూ చెబుతారని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు, అసెంబ్లీ, సెక్రటరియేట్లలో ఆయన పడిన కష్టం కళ్లారా చూశానని తెలిపారు. అందుకే ఆయనకు ప్రజలు హేట్రిక్ విజయాన్ని అందించారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు మాట్లాడుతూ రాజన్నదొర ప్రజల మనిషని కొనియాడారు, నిత్యం ప్రజలతో మమేకమై పని చేయడంతోనే హేట్రిక్ విజ యాన్ని సాధించారని తెలిపారు. కాగా సభకు ముందు ఆ పార్టీ పట్టణ నాయకులు ఎంపీ గీతనుకూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు ఈశ్వరరావు, సూరిబాబు, సాలూ రు మున్సిపాలిటీతో పాటు సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాజకీయాల్లోకొస్తా: తారకరత్న
సాలూరు: తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని, అయితే దానికి ఇంకా సమయం ఉందని సినీహీరో నందమూరి తారకరత్న అన్నారు. ఆదివారం ఆయన విజయనగరం జిల్లా సాలూరులో విలేకరులతో మాట్లాడారు. హరికృష్ణకు నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఫిట్నెస్ కోసమే తాను సన్నబడ్డానని, సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నా, అయితే సినిమాల కోసం మాత్రం కాదన్నారు. తాను నటించిన అలెగ్జాండర్ సినిమా ఈ నెలలో విడుదల కానున్నట్టు చెప్పారు. రెండేళ్లగా మంచి స్క్రిప్ట్ దొరక్క సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. -
దండిగాం రోడ్డు వరకూ రైల్‌బస్
సాలూరు రూరల్,న్యూస్‌లైన్ : సాలూరు ప్రాంత ప్రజల కల మరి కొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చనుంది. పెరుగుతున్న ఆర్టీసీ బస్సు చార్జీల నేపథ్యంలో రైల్వే చార్జీలు తక్కువగా ఉండడంతో రైల్‌బస్‌లో ప్రయాణించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బొబ్బిలి-సాలూరు మధ్య నడుస్తున్న రైల్‌బస్‌ను దండిగాం రోడ్డు వరకూ పొడిగించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. మక్కువ బైపాస్ రోడ్డు మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దండిగాం రోడ్డు వరకు రైల్‌బస్‌ను నడిపితే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. సాలూరు పట్టణానికి దగ్గరగా ఉన్న దండిగాం రోడ్డు వరకు రైల్వేట్రాక్ ఉంది. రైల్‌బస్‌ను పొడిగించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఇంద్రసేన్‌కు లేఖ రాశారు. ఇందుకు వారి స్పందించి రైల్‌బస్‌ను పొడిగించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర వద్ద ఫోన్లో ప్రస్తావించగా సాలూరు ప్రజలు సౌకర్యార్థం రైల్‌బస్‌ను పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారని, రైల్వే జీఎం నుంచి లేఖ తనకు వచ్చిందని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే సంబందిత పనులు చేపట్టనున్నట్టు లేఖలో పేర్కొన్నారన్నారు. సర్వత్రాహర్షం రైల్ బస్ సేవలను వినియోగించుకోవాలని సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సాలూరు పరిసర ప్రాంత వాసులకు విషయం తెలియడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. సాలూరు నుంచి బొబ్బిలికి ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే 15 రూపాయలు చార్జీ వసూళు చేస్తున్నారని, అదే రైల్‌బస్‌లో వెళితే కేవలం 5 రూపాయలు సరిపోతుందని చెబుతున్నారు. -
వైద్యుడి నిర్లక్ష్యం...బాలుడి మృతి
సాలూరు,న్యూస్‌లైన్: వైద్యుడి నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలిగొంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో బాలుడికి రకరకాల వైద్యపరీక్షలు నిర్వహించి సుమారు రూ.40 వేలు ఫీజు వసూలు చేసిన వైద్యుడు తమకు పుత్రశోకాన్ని మిగిల్చాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతితో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి అందోళనకారులను శాంతింపజేశారు. మలేరియా జ్వరంతో బాధపడుతున్న జమ్ము వినయ్‌కుమార్ (7)ను సాలూరు పట్టణంలో ఉన్న జ్యోతి ఆస్పత్రిలో తల్లిదండ్రులు జమ్ము రమణ,సత్యవతిలు గత శుక్రవారం చేర్చారు. ఆ బాలుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు,ఎక్స్‌రేల పేరుతో తల్లిదండ్రుల నుంచి వైద్యుడు శివకుమార్ సుమారు రూ.40 వేలు వసులు చేశాడు. నాలుగవ తేదీన మంగళవారం బాబుకు బాగానే ఉంది ఇంటికి తీసుకు వెళ్లొచ్చని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు పాచిపెంట మండలం కోనవలస గ్రామానికి బాలుడిని తీసుకుని వెళ్లిపోయారు. అయితే బాలుడికి మళ్లీ జ్వరం అధికం కావడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. ఆస్పత్రికి తీసుకురమ్మని వైద్యుడు సలహా చెప్పడంతో తీసుకువచ్చారు. దీంతో వైద్యుడు మళ్లీ వైద్యపరీక్షల పేరుతో డబ్బులు తీసుకుని శుక్రవారం సాయంత్రం వరకు వైద్యశాలలో ఉంచి బాబుకు అరోగ్యం విషమించిందని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించాడు. హాస్పిటల్ అంబులెన్స్ ఇచ్చి దానికి కూడా డబ్బులు వసూలు చేశాడు.అంబులెన్స్‌లో బాలుడిని తీసుకు వెళ్తు ండగా బూర్జివలస సమీపంలో ఓ సారి పరిశీలించగా బాబు అప్పటికే చనిపోయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఇదే విషయాన్ని గజపతినగరం లోని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి బందువులు సాలూరులో డాక్టర్‌ను నిలదీశా రు. వైద్యుడి నుంచి సమాధానం రాకపోవడంతో రాత్రి 10గంటల సమయంలో రోడ్డుపై బైఠాయిం చారు. పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు పాచిపెంట మాజీ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్‌బాబు వచ్చి అందోళన కారులను శాంతింప జేశారు. -
ఏజెన్సీ గ్రామాల్లో నిఘా పెంచిన పోలీసు బలగాలు
మక్కువ/కొమరాడ/గుమ్మలక్ష్మీపురం, సాలూరు రూరల్ న్యూస్‌లైన్: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ అలజడి నెలకొంది. ఏజెన్సీ గ్రామాలు భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఏఓబీ మళ్లీ పోలీస్ బలగాల బూట్ల చప్పుళ్లు తుపాకీ శబ్దాలతో మారుమోగుతోంది. సాలూరు మండలం పాచిపెంట సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మంగళవారం పంజా విసిరి నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లను బలితీసుకోవడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టులు సంఘటన స్థలం నుంచి ఒడిశాలోని నారాయణపట్న ప్రాంతం వైపు వెళ్లే అవకాశముండండంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. మక్కువ మండల కేంద్రంలో ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు బుధవారం ఆర్వోపీ(రోడ్ ఓపెనింగ్ పార్టీ) ముమ్మరంగా నిర్వహించారు. మక్కువ మండలం ఒడిశాకు సమీపంలో ఉన్నందున, గతంలో పలుమార్లు మావోయిస్టులు ఈ ప్రాం తంలో తమ ఉనికిని చాటుకోవడంతో పోలీసులు గట్టి నిఘా వేశారు. అలాగే కొమరాడ మండలం ఏఓబీని ఆనుకుని ఉండడంతో పెద్ద ఎత్తున బల గాలు మోహరించి ప్రత్యేక బలగాలతో ఉద్ధృతంగా గాలింపుచర్యలు చేపడుతున్నారు. ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివర కు ప్రశాంతంగా కొండశిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుమ్మలక్ష్మీపురం ఏజె న్సీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గుమ్మలక్ష్మీపురం,ఎల్విన్‌పేట గ్రామాల్లో బుధవారం జరిగి న సమైక్యాంధ్ర శంఖారావం కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు. అనంతరం ఎల్విన్‌పేట,తదితర ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టారు. వచ్చిపోయే వాహనాలను పోలీ సులు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లానుంచి ఒడిశాకు, ఒడిశా నుంచి జిల్లాకు వస్తున్న ప్రతి వాహనాన్ని సాలూరులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాలూరు మండలంలో కొదమ, గంజాయిభద్ర, సంపంగిపాడు, డెన్సరాయి, జిల్లేడువలస, కరడువలస, పట్టుచెన్నారు,పగులుచెన్నారు. పంచాయతీల్లో ఉన్న అనేక గ్రామాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి. పాచిపెంట మండలంలో అజూరు ఒడిశా రాష్ట్రానికి అతి సమీపంలో ఉంది. దీంతో ఈ గ్రామాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒక పక్క జిల్లాలో మావోయిస్టుల అలజడి లేదని పోలీసులు చెబుతుంటే, మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు.