అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు | women's protests at salur town due to onion price hike | Sakshi
Sakshi News home page

అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు

Published Tue, Aug 25 2015 11:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు

అమ్మా... ఉల్లి తల్లీ కనికరించు

విజయనగరం : అమ్మా.. ఉల్లి తల్లమ్మా.. మామీద కనికరం చూపమ్మా...అంటూ మహిళలు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. సాలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా ఈ విధంగా తమ ఆందోళన తెలిపారు.

ప్రభుత్వాల చేతగానితనం వల్లే ఉల్లి ధరలు ఆకాశనంటాయని వారు ఆరోపించారు.  ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళలు గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం ఉల్లి గడ్డల ధరలను నియంత్రించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని మహిళలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement