న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్‌లో ఉల్లికి మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఢిల్లీలో ఉల్లి ధరలు మండుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల లోడుతో బయలు దేరిన కందా ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉల్లిని ఢిల్లీలోని ఎన్‌సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీలతో పాటు వ్యాన్ల ద్వారా ప్రభుత్వం కేజీ రూ. 35కు విక్రయిస్తోంది. ఢిల్లీ రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో 75 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీపావళికి ముందుగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు భారతీయ రైల్వే సహాయంతో ఢిల్లీలోని హోల్‌సేల్ మార్కెట్‌లకు 1,600 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు నెల నుండి ఉల్లిపాయలు, టమోటాలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం?
Comments
Please login to add a commentAdd a comment