న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు.
ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్‌ను ఎక్కేందుకు బస్సు సర్వీస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండువేల కోట్లతో 7.7 కి.మీ. పొడవున ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి.
🚨 Delhi airport to get India's first air train by 2027, connection terminals 1, 2, and 3. pic.twitter.com/z9Qsiok9t9
— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024
ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్‌లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడతాయి.
ఇది కూడా చదవండి: చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు
Comments
Please login to add a commentAdd a comment