పరుగులకు మరో ‘వందేభారత్‌’ సిద్ధం | Vande Bharat Express Train Will Run Between Patna Delhi | Sakshi
Sakshi News home page

పరుగులకు మరో ‘వందేభారత్‌’ సిద్ధం

Published Sat, May 25 2024 11:23 AM | Last Updated on Sat, May 25 2024 12:11 PM

Vande Bharat Express Train Will Run Between Patna Delhi

పట్టాలపై పరుగులు తీసేందుకు మరో వందేభారత్‌ రైలు సిద్ధంకానుంది. పట్నా- ఢిల్లీ మధ్య  నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఈ రైలు రాకతో పట్నా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి పట్నాకు కేవలం తొమ్మది గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం పట్నా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి హై స్పీడ్ రైళ్లు ఢిల్లీ నుండి పట్నా చేరుకోవడానికి 13 గంటలు పడుతోంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం రైల్వే బోర్డు త్వరలో  పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది. అంటే త్వరలోనే పట్నా- న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్  విడుదల కానున్నది. భారతీయ రైల్వే తొలిసారి ఢిల్లీ-హౌరా లైన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపింది. అయితే అది గయ జంక్షన్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బీహార్ రాజధాని పట్నా నుండి నడపడానికి ప్లాన్ చేస్తున్నది.

న్యూఢిల్లీ- పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 130 కి.మీ. వందే భారత్ పట్నా నుండి అర్రా, బక్సర్ మీదుగా 9 గంటల ప్రయాణంతో ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలులో ఒక కోచ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ క్లాస్, ఏడు కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్‌గా ఉండవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో 52 సీట్లు, ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్‌లో 478 సీట్లు ఉండనున్నాయి. కాగా పట్నా-ఢిల్లీ మార్గంలో వందేభారత్‌ను నడిపే విషయమై భారత రైల్వే నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement