మీకు...మేమున్నాం!
సాలూరు, న్యూస్‌లైన్ : ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరూ అధైర్యపడొద్దని... కార్యకర్తలకు తాము అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భరోసా ఇచ్చారు. ఆదివారం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర 50వ జన్మ దినోత్సవంతో పాటు ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందడం తో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముందుగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, చీపురుపల్లి నేత బెల్లాన చంద్రశేఖర్ తదితరులు రాజన్నదొరకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభ లో రాజన్నదొర మాట్లాడుతూ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.
ఎన్నికల సమయంలో కుటుంబసభ్యులను కూడా కాదనుకుని పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల సేవలను తాము మరవలేమన్నారు. టీడీపీ నాయకులు దాడులకు పాల్ప డినా... వెరవకుండా నిలబడి విజయాన్ని కట్టబెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పా రు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలాంటి నిబంధనలు పెట్టకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాటి అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చె బుతున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారితో ఉద్యమానికి దిగుతామని చెప్పారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి :
అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రైల్వేలైన్ నిర్మాణం, బైపాస్ రోడ్డు కోసం కూడా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతోనే జగనన్న పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.
రాజన్న కష్టం... హైదరాబాద్‌లోనూ చెబుతారు :
ఎమ్మెల్యే రాజన్నదొర నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగా కష్టపడతారో హైదరాబాద్‌లోనూ చెబుతారని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు, అసెంబ్లీ, సెక్రటరియేట్‌లలో ఆయన పడిన కష్టం కళ్లారా చూశానని తెలిపారు. అందుకే ఆయనకు ప్రజలు హేట్రిక్ విజయాన్ని అందించారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు మాట్లాడుతూ రాజన్నదొర ప్రజల మనిషని కొనియాడారు, నిత్యం ప్రజలతో మమేకమై పని చేయడంతోనే హేట్రిక్ విజ యాన్ని సాధించారని తెలిపారు. కాగా సభకు ముందు ఆ పార్టీ పట్టణ నాయకులు ఎంపీ గీతనుకూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు ఈశ్వరరావు, సూరిబాబు, సాలూ రు మున్సిపాలిటీతో పాటు సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.