సాక్షి, అమరావతి/సాలూరు: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల జీవితాలు అభివృద్ధి పథంలో పయనింపజేసేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. సీఎం జగన్ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువగా గిరిపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేతలు బీఆర్ అంబేడ్కర్, వైఎస్సార్, గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 18 సెల్ టవర్లతో అన్ని గ్రామాలకు కమ్యూనికేషన్ వచి్చందన్నారు. గిరిజన మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు మాట్లాడుతూ గిరిజనలకు సీఎం జగన్ నాణ్యమైన విద్య, ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషును అందిస్తున్నారని కొనియాడారు. అడవుల్లో రోగాలతో వందలాది మంది చనిపోయేవారని ఇప్పుడు సీఎం జగన్ వైద్యం అందుబాటులోకి తెచ్చారని, గిరిజనులు కోసం ట్రైబల్ మెడికల్ కాలేజీని తెచ్చారని తెలిపారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిరిజనులను కనీసం మనుషులుగా కూడా చూడలేదన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ నేతలు డాక్టర్ వెంకటలక్షి్మ, మేరాజోత్ హనుమంత్‌నాయక్, రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి గుండా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు అండగా సీఎం జగన్ : డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
గిరిజనులకు అండగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన అధ్యక్షతన, పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వైభవంగా
నిర్వహించారు.
రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాజ్యాంగపరమైన గిరిజన చట్టాలు జగనన్న పాలనలో పరిరక్షింపబడుతున్నాయన్నారు. గత టీడీపీ పాలనలో ఎన్నికలకు ఆరు నెలలు ముందు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.70 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.డీవీజీ శంకరరావు, ఎమ్మెల్సీ పి.రఘువర్మ, జీసీసీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment