
ఈదురు గాలులు: 400 ఎకరాలు నేలమట్టం
ప్రకృతి వైపరీత్యానికి అరటి రైతు భారీగా నష్టపోయాడు.
సాలూరు (విజయనగరం) : ప్రకృతి వైపరీత్యానికి అరటి రైతు భారీగా నష్టపోయాడు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో శనివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు సుమారు 400 ఎకరాలలో అరటి తోటలు నేల మట్టం అయ్యాయి. దీంతో రూ. కోటిన్నర వరకు రైతులు నష్టపోయారు. విషయం తెలుసకున్న సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.