banana crop
-
చంద్రబాబు వేస్ట్.. రైతుల ఆవేదన
-
అరటి చెట్టు సాగుతో లక్షల్లో ఆదాయం
-
అరటి తోట సాగుకు ముందే భూసార పరీక్షలు చేయాలి
-
అరటి పొలం నుండి పంట వరకు
-
అరటి సాగుతో లక్షలు గడిస్తున్న గుంటూరు రైతు
-
‘సిగటోక’ చిత్తవ్వాలిక.. నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ.. అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్‌టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్‌టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. నివారణా చర్యలు సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి -
అరటి రైతుకు మహర్దశ
సాక్షి, అమరావతి: అరటి రైతుకు మహర్దశ పట్టనుంది. విత్తు నుంచి విపణి వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవనుంది. దిగుబడుల్లో నాణ్యత పెంచడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.269.95 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేసింది. రానున్న మూడేళ్లలో వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ని అమలు చేయనుంది. గడిచిన మూడేళ్లలో లక్ష టన్నుల ఎగుమతులు రాష్ట్రంలో 2,02,602 ఎకరాల్లో అరటి సాగవుతుండగా, 48.62 లక్షల టన్నుల దిగుబడులతో దేశంలో నం.1 స్థానంలో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 23వేల టన్నులు ఎగుమతులు జరుగగా, కరోనా పరిస్థితులున్నప్పటికీ గడిచిన మూడేళ్లలో లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతులు చేయగలిగారు. దేశంలోనే తొలిసారి తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేక రైలు ద్వారా అరటిని ఎగుమతి చేసి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వాల్యూచైన్ ప్రాజెక్టు వల్ల హెక్టార్‌కు 24 టన్నుల వరకు దిగుబడులు, టన్నుకు రూ.12వేల వరకు ఆదాయం పెరిగింది. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో అనంతపురంలో రెండు ప్యాక్ హౌస్‌లు, రెండు కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించగా, పులివెందులలో ప్యాక్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. 42,500 ఎకరాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తాజాగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ ఉద్యాన బోర్డు దేశవ్యాప్తంగా 12 క్లస్టర్స్‌ను ఎంపిక చేయగా, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అరటి ఎగుమతులను ప్రోత్సహించనున్నారు. అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, జిల్లాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. మూడు జిల్లాల పరిధిలో గుర్తించిన 42,500 ఎకరాల్లో సీడీపీ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూ.269.95కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మొత్తంలో రూ.100 కోట్లు గ్రాంట్ రూపంలో అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని పీపీపీ కింద సమీకరించనున్నారు. క్లస్టర్ గ్యాప్ అసెస్మెంట్ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతంలో మొక్కల నుంచి ఎగుమతి వరకు మూడు దశల్లో రైతులకు సపోర్టు ఇవ్వనున్నారు. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్ – ప్రొడక్షన్)వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతర నిర్వహణ–విలువ ఆపాదించడం (పోస్ట్‌హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూఎడిషన్) కోసం రూ.74.75కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70కోట్లు ఖర్చు చేయనున్నారు. అరటికి కేరాఫ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గడిచిన మూడేళ్లలో అరటి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రూ.269.95 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఎగుమతుల్లో ఏపీకి త్వరలో అంతర్జాతీయఖ్యాతి లభించనుంది. –డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ రైతుకు చేయూత ఇలా.. సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సçస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం(ఐపీఎం), ఫ్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40వేల వరకు ఆర్థిక చేయూతనివ్వనున్నారు. తోట బడుల ద్వారా15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిస్తారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ)ఇస్తారు. కోతలనంతర నిర్వహణకు అవసరమైన ప్యాక్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్‌లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైనపెట్టుబడులు అందించడంతో పాటు బ్రాండింగ్, విదేశాల్లో ప్రమోçషన్ వంటి కార్యకలాపాలకు ఆర్థిక చేయూతనందిస్తారు. (చదవండి: సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన) -
వీడియో వైరల్: ఏనుగులు చేసిన పనికి ఫిదా కావాల్సిందే
చెన్నె: భారీ ఆకారం.. ఎన్ని టన్నులైనా ఎత్తగల శక్తిసామర్థ్యం ఉన్న గజరాజుకు కోపమొస్తే ఇక అంతే సంగతులు. అని అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటికి మనసు ఉంటుంది.. మానవత్వం ఉంటుంది. భారీ గజరాజులకు సున్నిత మనస్తత్వం కలదని ఓ సంఘటన నిరూపించింది. ఏనుగులు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. మానవత్వంతో ఏనుగులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని ఓ గ్రామంలో శుక్రవారం అరటి తోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి తోటను ధ్వంసం చేశాయి. అరటి చెట్లను పారవేస్తూ.. అరటిగేలలను తింటూ తోటలో నానా హంగామా చేసి వెళ్లాయి. ఏనుగుల దాడిలో నష్టపోయామంటూ రైతులు లబోదిబోమన్నారు. ఈ సందర్భంగా పంట ను పరిశీలించేందుకు తోటలోకి వెళ్లి చూడగా ఒకచోట ఆశ్చర్యం కలిగేలా ఓ దృశ్యం కనిపించింది. తోటంతా నాశనం చేసిన ఏనుగులు ఒక్క అరటి చెట్టును మాత్రమే తొలగించకుండా వెళ్లిపోయాయి. ఎందుకంటే వాటిపైన పక్షిగూడు ఉంది. వాటిలో అప్పుడే పుట్టిన బుజ్జి పక్షులు ఉన్నాయి. వాటిపై ఏనుగులు మానవత్వం చూపాయి. పక్షులతో కూడిన గూడు ఉన్న చెట్టును నాశనం చేయకుండా ఏనుగులు మిగిల్చి వెళ్లాయి. వీటిని రైతులు ఆసక్తిగా గమనించారు. పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన అధికారులు చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారి సుశాంత నంద ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు. తోటి జీవులను ఏనుగులు కాపాడాయి అని తెలిపారు. ‘ఒక్క పక్షులున్న ఒక్క చెట్టు తప్ప మొత్తం అరటి తోటను నాశనం చేశాయి. అందుకే అంటారు గజరాజులను సున్నిత మనస్తత్వం కలవి’ అని చెబుతూ సుశాంత నంద ట్వీట్ చేశారు. చెట్టుపై ఉన్న పక్షులతో కూడిన ఉన్న గూడు వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూసి వావ్.. సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏనుగులు నిజంగా ఎంత మంచివో అని పేర్కొంటున్నారు. చదవండి:కొత్త సీఎం స్టాలిన్: తొలి ఐదు సంతకాలు వీటిపైనే.. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ This is the reason as to why elephants are called gentle giants. Destroyed all the banana trees , except the one having nests. Gods amazing Nature🙏 (Shared by @Gowrishankar005) pic.twitter.com/iK2MkOuvaM — Susanta Nanda IFS (@susantananda3) May 7, 2021 -
అరటి రైతుపై పిడుగు
వేముల/పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి అరటి తోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడులు చేతికందే సమయంలో ప్రకృతి ప్రకోపించడంతో కోతకు వచ్చిన అరటి గెలలు నేలవాలాయి. నిమ్మ తోటలు కూడా దెబ్బతినడంతోఅన్నదాతలు లబోదిబోమంటున్నారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో 285 హెక్టార్లలో అరటి, 5 ఎకరాల్లో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. అరటి రైతులకు రూ.10 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే వేంపల్లె మండలంలో 160 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతినగా రూ.1.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గాలివానతో రాత్రికి రాత్రే తన నాలుగెకరాల్లో సాగు చేసిన అరటి దెబ్బతిని రూ.8 కోట్లు నష్టపోయానని వి.కొత్తపల్లెకు చెందిన మల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, రెండెకరాల్లోని అరటి తోటను గాలివాన దెబ్బతీసిందని అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.35 వేలు ఇవ్వాలి: వైఎస్ అవినాష్‌రెడ్డి గాలివాన బీభత్సంతో నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.35 వేల నష్టపరిహారం ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె, వి.కొత్తపల్లెలలో గాలివానతో నేలవాలిన అరటి తోటలను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యానశాఖ అధికారులను అప్రమత్తం చేసి, పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అరటి మొక్కలను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వెదర్ స్టేషన్లు ఉండటంతో వాతావరణాన్ని అంచనా వేయొచ్చని, మిగిలిన ప్రాంతాల్లో వెదర్ స్టేషన్లు లేవని తెలిపారు. వాతావరణం ఆధారంగా కాకుండా వాస్తవంగా క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేసి రైతులకు పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గత 15 ఏళ్లుగా రైతులు అరటిని సాగు చేస్తున్నారని.. ప్రతి ఎకరాకు రూ.3 వేల ప్రీమియం చెల్లిస్తున్నా ఇన్సూరెన్స్ వచ్చిన దాఖలాల్లేవన్నారు. ఇన్సూరెన్స్ విధానంలో లోపాలున్నాయని.. ఈ విషయంపై పార్లమెంటులో కూడా తాను ప్రస్తావించామని, లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వేముల మండలంలో నష్టపోయిన అరటి రైతుల విషయాన్ని వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేసి, రైతులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. పంట నష్టం వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని బాధిత రైతులకు ఎంపీ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
యాజమాన్య పద్ధతులతోనే దిగుబడి
అనంతపురం అగ్రికల్చర్ : అరటిలో సుస్థిరమైన నాణ్యమైన దిగుబడుల కోసం నాటిన నాటి నుంచి పంట కోత వరకు సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం అరటి సాగుపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాస్త్రవేత్త శ్రీనివాసులుతో పాటు ముంబైకి చెందిన ఐఎన్ఐ ఫార్మ్ జనరల్ మేనేజర్ డాక్టర్ అజిత్‌కుమార్ హాజరై అవగాహన కల్పించారు. ‘అనంత’ అనుకూలం వాతావరణ పరిస్థితులు, నేలలు అరటి తోటల సాగుకు ‘అనంత’ అనుకూలం.. గతంలో దుంపల ద్వారా ప్రవర్ధనం చేసిన అరటి మొక్కలు సాగు చేస్తుండగా ఇపుడు టిష్యూకల్చర్ పద్ధతి మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. టిష్యూకల్చర్ ద్వారా నులిపురుగులు, వైరస్ వల్ల వ్యాపించే తెగుళ్లు తగ్గిపోయి దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 1400 మొక్కలు నాటుకోవాలి. రెండు అడుగులు గుంతలు తవ్వి ఒక్కో గుంతకు 10 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్‌సూపర్‌ఫాస్పేట్, అర కిలో వేపపిండి వేసుకుని నాటుకోవాలి. సింగిల్‌సూపర్‌ఫాస్పేట్ వేయడం వల్ల వేరువ్యవస్థ బలపడుతుంది. పంట కాలంలో ఒక్కో అరటి మొక్కకు 300 గ్రాములు యూరియా, 300 గ్రాములు పొటాష్ ఎరువులు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా ఎరువులు శ్రేయస్కరం జింక్, బోరాన్, ఇనుము తదితర సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్) లోపం తలెత్తకుండా ఎప్పటికపుడు వీటిని ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వాలి. 19–19–19, 13–0–45 ఎరువులు లేదంటే యూరియా, వైట్ పొటాష్ ఎరువులు డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు అందజేయాలి. మొక్కల కింద పెరిగే పిలకలు ఎప్పటికపుడు తీసివేస్తూ ప్రధాన మొక్క గెల వేసిన నెల తర్వాత ఒక పిలక ఉంచాలి. ఒకేసారి గెల అరటి గెల ఒకేసారి పక్వానికి వచ్చి అన్ని హస్తాలు అభివృద్ధి చెందాలంటే.. గెలలో హస్తాలు ఏర్పడిన తరువాత గెల కింద భాగాన ఉండే మగపువ్వును తీసేయాలి. 10 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 5 గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (ఎస్వోపీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గెలలో అన్ని కాయలు సమానంగా నాణ్యతగా వస్తాయి. గెల సిలెండర్ షేపులో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ – వర్షాకాలంలో ఆశించే సిగటోకమచ్చ తెగులును డైథేనియం–45 మందుతో నివారించుకోవాలి. పండుఈగ కనిపిస్తే మిథైల్ యూజినాల్ ఎర ఏర్పాటు చేసుకోవాలి. నత్రజనితో పొటాష్ ఎరువులు వేయాలి. మార్చి–ఏప్రిల్ నెలల్లో సంభవించే అకాల వర్షాలు, వడగళ్లవాన, ఈదురుగాలుల నుంచి అరటి తోటను కాపాడుకునే క్రమంలో తోట చుట్టూ అవిశె, సరుగుడు లాంటి చెట్లను నాటుకుంటే గాలివేగాన్ని కొంతవరకు నివారిస్తాయి. -
అరటికి భలే డిమాండ్
వేముల : మార్కెట్లో అరటికి డిమాండ్ పెరిగింది. రెండు, మూడు నెలలుగా మార్కెట్లో అరటి ధరలు నిలకడగా ఉండటంతో కొనుగోలుకు తోటల వద్దకు వ్యాపారులు పరుగులు తీస్తున్నారు. తోటలలో కాయల పక్వానికి రాకముందే కోత కోస్తున్నారు. అయితే మరో రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో తోటలలో అరటి దిగుబడులు రానున్నాయి. ఆ సమయంలో ధరలు ఎలా ఉంటాయోనని రైతులలో ఆందోళన నెలకొంది. కాగా జిల్లాలో 12,800హెక్టార్లలో అరటి తోటలు సాగులో ఉన్నాయి. పులివెందుల, రైల్వేకోడూరు, రాజంపేట, మైదుకూరు నియోజకవర్గాల్లో అరటి సాగులో ఉంది. జిల్లాలోనే అత్యధికంగా పులివెందుల నియోజకవర్గంలో 6వేల హెక్టార్లల్లో అరటి సాగైంది. అరటి పంటను జూన్, జులై మాసాల్లో సాగు చేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో అరటి కాయలు కోతకు వస్తాయి. అరటి కోతకు వచ్చే సమయంలోనే ముంగారు వర్షాలతో పెనుగాలులకు అరటి తోటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అరటి ధరలు గణనీయంగా పడిపోయాయి. టన్ను రూ.2వేల నుంచి రూ.4వేల లోపు ఉన్నాయి. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడులలో 30శాతం కూడా రైతులకు రాలేదు. తోటలలో కాయల్లేక అరటికి డిమాండ్ : తోటల్లో కాయలు లేకపోవడంతో అరటికి డిమాండ్ పెరిగింది. తోటలలో దిగుబడులు అమ్మిన తర్వాత అరటికి ధరలు వచ్చాయి. మే, జూన్ మాసం నుంచే ధరలు పెరిగాయి. మార్కెట్లో టన్ను అరటి కాయలు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఉన్నాయి. జిల్లాలో అక్కడక్కడా ఆలస్యంగా సాగు చేసిన కొంతమంది రైతులకు పెరిగిన ధరలతో ఊపిరి వచ్చింది. మరో రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అరటి కాయలు కోతకు రానున్నాయి. అప్పటి వరకు ధరలు ఇలాగే నిలకడగా ఉంటే రైతులకు ఊరట వస్తుంది. తోటల వద్దకు పరుగులు తీస్తున్న వ్యాపారులు : గత రెండు, మూడు నెలలుగా మార్కెట్లో అరటి ధరలు నిలకడగా ఉండటంతో వ్యాపారులు కాయల కోసం తోటల వద్దకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఎక్కడ తోటలలో అరటి కాయలు ఉన్నాయో గాలిస్తున్నారు. ఎక్కడ అరటి కాయలు ఉంటే అక్కడికి వ్యాపారులు వాలిపోతున్నారు. తోటలలో అరటి గెలలు మరో నెలకు పక్వానికి వస్తాయనగా ముందుగానే కోత కోసేందుకు వ్యాపారులు వెనుకాడలేదు. ఈ ధరలతో వ్యాపారులకే కాకుండా రైతులు కూడా ఆదాయం కళ్లజూస్తున్నారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి దిగుబడులు : జిల్లా వ్యాప్తంగా అరటి తోటల్లో మరో రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో దిగుబడులు రానున్నాయి. అక్టోబరు, నవంబరు మాసాల్లో అరటి తోటలలో గెలలు కోతకు వస్తాయి. ఆ సమయంలో మార్కెట్ ధరలు ఎలా ఉంటాయోనని రైతులలో ఆందోళన నెలకొంది. రెండో కాపు నిలిపిన తోటలలో కాయలు కోతకు వచ్చే సమయం ఆసన్నమైంది. ధరలు తగ్గితే నష్టపోతాం.. : అరటి గెలలు కోతకు వచ్చే సమయంలో ధరలు తగ్గితే నష్టపోతాం. తోటలలో కాయలు లేని సమయంలో ధరలు ఉంటున్నాయి. కాయలు ఉన్నప్పుడు ధరలు తగ్గిపోతున్నాయి. ధరలు నిలకడగా లేకపోవడంతో అరటిలో నష్టాలను చవిచూస్తున్నాం. – శ్రీరామిరెడ్డి(అరటి రైతు), భూమయ్యగారిపల్లె -
అంతరించనున్న అరటి
లాస్ ఏంజెలిస్: మరో ఐదు, పదేళ్లలో అరటి పంట అంతరించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మూడు ఫంగస్ల వల్ల ఈ పంటకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ (యూసీ) పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కాస్తంత భరోసా ఇచ్చారు. మూడు ఫంగస్‌లలో రెండింటి వల్ల మాత్రం తీవ్ర ముప్పు వాటిల్లనుందని డేవిస్లోని యూసీకి చెందిన శాస్త్రవేత్త అయనీస్ స్ట్రెగి యోపోలోస్ చెప్పారు. తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఫంగస్ వల్ల మరో ఐదు పదేళ్లలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరటి పంట తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. -
అరటి.. దిగుబడిలో మేటి
సస్యరక్షణ తప్పనిసరి.. తెగుళ్ల బెడద అధికం నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి అప్పుడే అధిక దిగుబడులు సాధ్యం ఏడీఏ వినోద్‌కుమార్ సలహా సూచనలు జహీరాబాద్ టౌన్: అరటికి అన్ని కాలాల్లో డిమాండ్ ఉంటుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో రైతులు అరటిని పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ప్రధానంగా ఈ పంటకు నులి పురుగు, కాయముచ్చిక కుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్(7288894426) తెలిపారు. వీటి నివారణకు, ఇతరత్రా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తెగుళ్ల నివారణ చర్యల గురించి ఆయన రైతులకు ఇస్తున్న సలహా సూచనలు.. నులి పురుగులు వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వివిధ రకాల తెగుళ్ల కారణంగా పంటకు నష్టం ఉంటుంది. నులి పురుగు తేలికపాటి నేలల్లో ఉంటూ అరటికి నష్టం కలిగిస్తుంటాయి. వేర్లపై బుడిపెలు వంటి కాయలను కలుగచేస్తాయి. వీటి తీవ్రత కారణంగా అరటి ఆకులు వాలిపోయి ఆకుల అంచులు నల్లగా మాడినట్లు ఉంటాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. అరటి సాగుకు ముందు విత్తన శుద్ధి చేసుకోవడమే దీనికి మార్గం. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ + 2.5 మి.లీ మోనోక్రాటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారుచేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. ద్రావణంలో ముంచి నాటుకొన్నట్లయితే నులి పురుగుల దాడి తగ్గుతుంది. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోప్యురాన్ 3జీ గుళకలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు తీశ్రతను తగ్గించవచ్చు. కాయముచ్చిక కుళ్లు ఈ తెగుళ్ల ఉదృతి ఎక్కవగా వర్షాకాలంలో ఉంటుంది. అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇలా పిచికారి చేసి తెగులును పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆకుమచ్చ తెగులు వర్షాకాలంలో వచ్చే ప్రధాన తెగులు ఇది. ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి తరువాత బూడిద రంగులోకి పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారిపోతాయి. ఈ తెగులు నియంత్రణ కోసం తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయాలి. అలాగే ఒక మిల్లీలీటరు ట్రైడిమార్ఫ్ లేదా ప్రాపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు పిచికారి చేయాలి. -
ఈదురు గాలులు: 400 ఎకరాలు నేలమట్టం
సాలూరు (విజయనగరం) : ప్రకృతి వైపరీత్యానికి అరటి రైతు భారీగా నష్టపోయాడు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో శనివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు సుమారు 400 ఎకరాలలో అరటి తోటలు నేల మట్టం అయ్యాయి. దీంతో రూ. కోటిన్నర వరకు రైతులు నష్టపోయారు. విషయం తెలుసకున్న సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అరటి రైతు గిలగిల
9 నెలలకే పండిపోతున్న వైనం తగ్గిన కాయ పరిమాణం పడిపోయిన ధర ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం కానరాని ఉద్యానశాఖాధికారులు తాడేపల్లి రూరల్: గతేడాది అరటి పంటను సాగు చేసిన రైతులు ఒకింత ఆధాయాన్ని పొందారు. అయితే ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో పెళ్ళిళ్లు, శుభముహుర్తాలు, పండుగలు ఉండటంతో అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది అందుకు విరుద్దుంగా అరటి రైతులు నష్టాలు చవిచూసే పరిస్థితి తల్తెతింది. జిల్లాలోని అరటితోటల పెంపకానికి కృష్ణాతీరం పేరొందిన ప్రాంతం. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర తదితర మండలాల్లో వేలాది ఎకరాలలో అరటి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఎకరానికి కౌలుతో కలిపి రూ. 90 వేలు పెట్టుబడి అవుతోంది. వర్షాలు సకాలంలో కురువకపోవడంతో బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల అరటి రైతులకు ఈ సంవత్సరం కలిసి రాలేదని రైతులు చెబుతున్నారు. పంట వేసిన దగ్గర నుండి 11 నెలలకు పంట చేతికి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 8-9 నెలలోనే అరటి గెలలు పండి ధర సగానికి సగం పడిపోయింది. ఈ సంవత్సరం వర్షాలు లేక, ఎండా కాలాన్ని తలపిస్తుండడంతో గెలలు ముందుగానే పక్వానికి వస్తున్నాయి కానీ కాయ పరిమాణం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. అదే 11 నెలలకు గనుక పక్వానికి వస్తే ఇప్పుడున్న సైజుకు రెండింతలు ఉంటుంది. దాంతో మార్కెట్లో కూడా అనుకున్న రేటు వస్తుందని రైతులు అంటున్నారు. ఆగిపోయిన ఎగుమతులు.. మన ప్రాంతంలో పండిన అరటి గెలలు రాజస్తాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. గెల 9 నెలలకే పండడంతో ఇతర రాష్ట్రాల ఎగుమతి ఆగిపోయింది. రూ. 250లకు అమ్ముడుపోయిన గెల రూ. 100-130 లకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.1.5 లక్షలు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. అరటి తోటల్లో లోపాలను గుర్తించి, సలహాలు సూచనలు ఇచ్చే చర్యలు ఉద్యానవన శాఖాధికారులు చేపట్టలేదని రైతులు వాపోతున్నారు. -
అరటిపంటను ధ్వంసం చేసిన దుండగులు
అనంతపురం(తాడిమర్రి): ఓ రైతుకు చెందిన అరటిపంట మరో నెల రోజుల్లో చేతికి వస్తుందనగా కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని దాడితోటగ్రామానికి చెందిని కె. వెంకటకృష్ణ రెడ్డి అనే వ్యక్తి రెండెకరాల్లో అరటి పంట సాగుచేస్తున్నాడు. అయితే ఈ సారి మంచి దిగుబడి రావడంతో నెలరోజుల్లో పంట కాపుదింపుదామనుకున్నారు. ఈలోపే కొంతమంది దుండగులు అరటి గెలలను నరికి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన వై. వెంకటేశ్వరరెడ్డినే ఈ విధ్వంసానికి బాధ్యుడని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అరటితోట ధ్వంసం
అనంతపురం: ఓ రైతుకు చెందిన అరటిపంట మరో నెల రోజుల్లో చేతికి వస్తుందనగా కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని దాడితోట గ్రామానికి చెందిని కె. వెంకటకృష్ణ రెడ్డి అనే వ్యక్తి రెండెకరాల్లో అరటి పంట సాగుచేస్తున్నాడు. అయితే ఈ సారి మంచి దిగుబడి రావడంతో నెలరోజుల్లో పంట కాపుదింపుదామనుకున్నారు. ఈలోపే కొంతమంది దుండగులు అరటి గెలలను నరికి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన వై. వెంకటేశ్వరరెడ్డినే ఈ విధ్వంసానికి బాధ్యుడని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.] (తాడిమర్రి)