అంతరించనున్న అరటి
లాస్ ఏంజెలిస్: మరో ఐదు, పదేళ్లలో అరటి పంట అంతరించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మూడు ఫంగస్‌ల వల్ల ఈ పంటకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ (యూసీ) పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కాస్తంత భరోసా ఇచ్చారు.
మూడు ఫంగస్‌లలో రెండింటి వల్ల మాత్రం తీవ్ర ముప్పు వాటిల్లనుందని డేవిస్‌లోని యూసీకి చెందిన శాస్త్రవేత్త అయనీస్ స్ట్రెగి యోపోలోస్ చెప్పారు. తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఫంగస్ వల్ల మరో ఐదు పదేళ్లలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరటి పంట తుడిచిపెట్టుకొని పోతుందన్నారు.