అరటితోట ధ్వంసం | someone collapsed the banana crop | Sakshi
Sakshi News home page

అరటితోట ధ్వంసం

Published Mon, Feb 23 2015 8:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

అరటితోట ధ్వంసం

అరటితోట ధ్వంసం

అనంతపురం: ఓ రైతుకు చెందిన అరటిపంట మరో నెల రోజుల్లో చేతికి వస్తుందనగా కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలో చోటుచేసుకుంది.  మండలంలోని దాడితోట గ్రామానికి చెందిని కె. వెంకటకృష్ణ రెడ్డి అనే వ్యక్తి రెండెకరాల్లో అరటి పంట సాగుచేస్తున్నాడు. అయితే ఈ సారి మంచి దిగుబడి రావడంతో నెలరోజుల్లో పంట కాపుదింపుదామనుకున్నారు. ఈలోపే కొంతమంది దుండగులు అరటి గెలలను నరికి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన వై. వెంకటేశ్వరరెడ్డినే ఈ విధ్వంసానికి బాధ్యుడని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.]
(తాడిమర్రి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement