చెన్నె: భారీ ఆకారం.. ఎన్ని టన్నులైనా ఎత్తగల శక్తిసామర్థ్యం ఉన్న గజరాజుకు కోపమొస్తే ఇక అంతే సంగతులు. అని అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటికి మనసు ఉంటుంది.. మానవత్వం ఉంటుంది. భారీ గజరాజులకు సున్నిత మనస్తత్వం కలదని ఓ సంఘటన నిరూపించింది. ఏనుగులు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. మానవత్వంతో ఏనుగులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని ఓ గ్రామంలో శుక్రవారం అరటి తోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
అరటి తోటను ధ్వంసం చేశాయి. అరటి చెట్లను పారవేస్తూ.. అరటిగేలలను తింటూ తోటలో నానా హంగామా చేసి వెళ్లాయి. ఏనుగుల దాడిలో నష్టపోయామంటూ రైతులు లబోదిబోమన్నారు. ఈ సందర్భంగా పంట ను పరిశీలించేందుకు తోటలోకి వెళ్లి చూడగా ఒకచోట ఆశ్చర్యం కలిగేలా ఓ దృశ్యం కనిపించింది. తోటంతా నాశనం చేసిన ఏనుగులు ఒక్క అరటి చెట్టును మాత్రమే తొలగించకుండా వెళ్లిపోయాయి. ఎందుకంటే వాటిపైన పక్షిగూడు ఉంది. వాటిలో అప్పుడే పుట్టిన బుజ్జి పక్షులు ఉన్నాయి.
వాటిపై ఏనుగులు మానవత్వం చూపాయి. పక్షులతో కూడిన గూడు ఉన్న చెట్టును నాశనం చేయకుండా ఏనుగులు మిగిల్చి వెళ్లాయి. వీటిని రైతులు ఆసక్తిగా గమనించారు. పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన అధికారులు చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారి సుశాంత నంద ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు. తోటి జీవులను ఏనుగులు కాపాడాయి అని తెలిపారు. ‘ఒక్క పక్షులున్న ఒక్క చెట్టు తప్ప మొత్తం అరటి తోటను నాశనం చేశాయి. అందుకే అంటారు గజరాజులను సున్నిత మనస్తత్వం కలవి’ అని చెబుతూ సుశాంత నంద ట్వీట్ చేశారు. చెట్టుపై ఉన్న పక్షులతో కూడిన ఉన్న గూడు వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూసి వావ్.. సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏనుగులు నిజంగా ఎంత మంచివో అని పేర్కొంటున్నారు.
చదవండి:కొత్త సీఎం స్టాలిన్: తొలి ఐదు సంతకాలు వీటిపైనే..
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’
This is the reason as to why elephants are called gentle giants. Destroyed all the banana trees , except the one having nests.
— Susanta Nanda IFS (@susantananda3) May 7, 2021
Gods amazing Nature🙏
(Shared by @Gowrishankar005) pic.twitter.com/iK2MkOuvaM
Comments
Please login to add a commentAdd a comment