gusty winds
-
ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం
ఢిల్లీ: భానుడి ప్రతాపంతో ఉడికిపోయిన ఢిల్లీ.. ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో అతలాకుతలం అయ్యింది. శనివారం వేకువఝాము నుంచే కురిసిన భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలులకు పలుప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. మరోవైపు విమాన రాకపోకలపైనా ఇది ప్రభావం చూపెట్టింది. నోయిడా, ఘజియాబాద్తోపాటు దేశ రాజధాని రీజియన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణంలోని మార్పుల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని, సరైన సమాచారం కోసం తమను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల్ని చవిచూసింది ఢిల్లీ. ఈ సీజన్లో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో నగరవాసులు అల్లలాడిపోయారు. #DelhiRains pic.twitter.com/1dcdsPmygm — Munna Bhai (@3MunnaBhai3) May 27, 2023 Storm Alert ⚠️ Massive Thunderstorms impacting #Haryana is moving towards NCR. Strong surface winds of 50 to 100km/h, moderate to heavy rains, non stop lightning, thunder and #hailstorm would occur in #Delhi #Gurgaon #Noida #Faridabad #Ghaziabad b/w 6:00 too 8:00AM.#DelhiRains pic.twitter.com/gwLXi17yVV — Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) May 26, 2023 Woke up because of this #DelhiRains #delhiweather pic.twitter.com/kKn9jNzIsI — samridhi (@swiminpul) May 27, 2023 Operations at #Delhi Airport are highly affected as morning supercell #Thunderstorm and #DelhiRains hit entire national capital region. Airport clocked massive 102km/h wind gust, flights seen circling around and none was able to land. weather is improving but light to moderate… https://t.co/toAisuXuA3 pic.twitter.com/r6vlPJeT3I — Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) May 27, 2023 Kind attention to all flyers!#Badweather #Rain pic.twitter.com/2NUCfzpczw — Delhi Airport (@DelhiAirport) May 27, 2023 -
మళ్లీ అకాల వర్ష బీభత్సం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన
వరంగల్/ జగిత్యాల/ మోత్కూరు/ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు ప్రభావం చూపించాయి. శనివారం వివిధ జిల్లాల పరిధిలో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షం తక్కువే కురిసినా.. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్‌లో అతలాకుతలం.. శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఓ జిన్నింగ్ మిల్లు రేకులు లేచిపోయాయి. హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేటలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి, లెంకాలపల్లి, నందిగామ, రేలకుంట, రు ద్రగూడెం, శనిగరం గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. జగిత్యాల, యాదాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో.. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. మినీస్టేడియం గోడ కూలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు. పిడుగుపాటుకు ఇద్దరు మృతి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భోజ్యనాయక్తండాకు చెందిన బానోతు సుమన్ పిడుగుపాటుతో మృతిచెందగా.. బానోతు భద్రు, బానోతు రమ, అజ్మీరా శశిరేఖలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేటలో మేకల కాప రి క్యాతం రాజయ్య (65) పిడుగుపాటుకు మృతిచెందాడు. బుగ్గారం మండలం సిరికొండలో పిడుగుపడి మరో మేకలకాపరి మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. -
తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుపతి: ఒకవైపు ఏపీలో ఎండలు మండిపోతుంటే.. తిరుమలలో మాత్రం ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Heat induced & atmospheric instability triggering thunderstorms along sesachalam hills and it's raining heavily in #Tirumala now. these thunderstorms likely to spread into parts of #Tirupati city and surroundings during next 1 hour. Go out with umbrella! Tirupatians. pic.twitter.com/JRgBAvd09u — Eastcoast Weatherman (@eastcoastrains) May 18, 2023 -
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరం మరోసారి అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి, అబిడ్స్.. ఇలా నగర మధ్య ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం పడింది. ఉదయం ఎండ, సాయంత్రం వానతో నగరవాసులు ఉపశమనం పొందారు. అయితే.. ఈదురు గాలుల తాకిడికి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ హైకోర్టు వద్ద ఈదురు గాలుల తాకిడికి భారీ వృక్షం ఒకటి నేలకొరిగింది. దీంతో రెండు బైక్‌లు, ఓ కారు ధ్వంసం అయ్యాయి. మహిళతో పాటు ఓ చిన్నారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇదీ చదవండి: ఏపీకి రెండు రోజులు హీట్ వేవ్ అలర్ట్ -
AP: ఆ జిల్లాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన మరో ద్రోణి శుక్రవారం బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో, ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో త్రిపురాంతకం కోట (తిరుపతి)లో 7.3 సెంటీమీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)లో 5, రేపల్లె (బాపట్ల)లో 4.8, పోతిరెడ్డిపాలెం (కృష్ణా)లో 4.7, ఎన్.కండ్రిగ (చిత్తూరు), గుడ్లదోన (ఎస్పీఎస్సార్)లో 3.8, శివరాంపురం (అన్నమయ్య)లో 3.7, గుంటూరు పశ్చిమలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, నంద్యాల జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం వడగండ్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి పిడుగుల శబ్దాలకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. -
ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సంతో మెట్రో రైళ్లను నిలివేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 70 విమానాలను దారి మళ్లిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ పాల్గొన్న మీటింగ్‌కు ఈదురుగాలులు ఆటంకం కల్గించాయి. ఆయన సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, ఫ్లెక్సీలు గాలులకు ఎగిరిపోయాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. -
ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం
-
ఖమ్మం జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుకు ఈడులచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని రమణ తండాలో 10 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇళ్ల పై కప్పులు, రేకులు ఎగిరిపోయాయి. ఈదురుగాలుల ధాటికి మండలపరిధిలో తీవ్రనష్టం జరిగింది. ఖమ్మం జిల్లా పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది. -
ఏడు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో బుధవారం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరికొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. గురువారం సాధారణ వాతావరణం నెలకొని ఉంటుందని, ఆ తర్వాత రెండ్రోజులు మళ్లీ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. -
వర్షానికి గోడ కూలి నలుగురు మృతి
మృతుల్లో అక్కాతమ్ముడు మాక్లూర్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో వర్షానికి పాత భవనం గోడ కూలడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో నందిపేట మండలం జోర్‌పూర్‌కు చెందిన ఏడే రమాదేవి(21), మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కులకు చెందిన నీరడి అఖిల(19) అక్కడికక్కడే మృతిచెందగా.. వెల్మల్ గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్(48), జోర్‌పూర్‌కు చెందిన ఏడే ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రమాదేవి, అఖిల, ప్రవీణ్ కుటుంబ సభ్యులు శనివారం మండల కేంద్ర సమీపంలోని శ్రీకేదారేశ్వర ఆశ్రమం వద్ద సత్యనారాయణ పూజ కోసం వెళ్లారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని వీరి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో వెళ్లగా, వీరు మాత్రం బైక్‌పై బయలు దేరారు. సాయంత్రం మండల కేంద్రంలోని నర్సాగౌడ్‌కు చెందిన పాత భవనం వద్దకు రాగానే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరు పాత భవనం వద్ద నిలబడ్డారు. ఇదే సమయంలో నందిపేట నుంచి ఇంటికి వెళ్తున్న ఆకుల సుదర్శన్ కూడా వీరి వద్ద వచ్చి నిలబడ్డాడు. ఈ క్రమంలో గోడ కూలడంతో రమాదేవి, అఖిల అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని స్థానికులు ట్రాక్టర్లతో మట్టిపెళ్లలను తొలగించి బటయకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్, ప్రవీణ్‌ను 108 అంబులెన్స్‌లో జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతుల్లో రమాదేవి, ప్రవీణ్‌లు అక్కా తమ్ముడు. రమాదేవి ఇంటర్ పూర్తి చేయగా, ప్రవీణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నీరడి అఖిలది మాక్లూర్ మండలం గొట్టుముక్కుల. ఈమె బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆకుల సుదర్శన్ చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. -
పార్వతీపురంలో ఈదురుగాలులు
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురంలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు భారీగా ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
విద్యుత్ తీగలు తెగి పడి 20 గొర్రెలు మృతి
గాలివీడు (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడటంతో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలీవీడు మండలం కసిరెడ్డిగారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడటంతో కొట్టంలో ఉన్న 20 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. -
విద్యుత్ వైర్లు తెగి వాహనదారుడు మృతి
భారీ ఈదురుగాలులకు 11కేవీ విద్యుత్ వైర్లు తెగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శివారులోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని జగ్గుతండాకు చెందిన బుల్డోజర్ డ్రైవర్ భూక్యా మోహన్‌గా గుర్తించారు. -
ఈదురుగాలుల బీభత్సం
గరిడేపల్లి (నల్లగొండ) : గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తుండటంతో గ్రామంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఈదురుగాలుల బీభత్సం
* ఉరుములు, మెరుపులతో భారీ వర్షం * కూలిన చెట్లు.. హోర్డింగ్‌లు... కరెంటు స్తంభాలు... * తెగిన కరెంట్ తీగలు... గాడాంధకారంలో వీధులు * పార్వతీపురం, బొబ్బిలి, ఎస్‌కోటలో కారు చీకట్లు పార్వతీపురం/బొబ్బిలి/శృంగవరపుకోట: పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి రోిహణి ఎండలు, ఉక్కబోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా... సాయంత్రమయ్యేసరికి ఉన్నట్టుండి కరిమబ్బులు కమ్ముకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈదురు గాలి ఎక్కువైంది. దానికి ఉరుముల మెరుపులతో కూడిన వర్షం తోడయ్యింది. ఈదురు గాలులకు వీధుల్లో దూళి రేగి, వాహనాలు, రిక్షాలను ఎగరేసుకుపోయింది. పార్కింగ్ వాహనాలను నేల పడేసింది. పట్టణ మెయిన్ రోడ్డులోని పెద్ద పెద్ద హోర్డింగులు, చిన్న చిన్న వ్యాపార షాపుల బోర్డులు గాలికి ఎగిరిపోయాయి. అలాగే పార్వతీపురంలోని కర్షకమహర్షి ఆస్పత్రి ముందున్న తురాయి చెట్టు కూకటి వేళ్లతో కూలిపోయింది. దీని కింద పలు ద్విచక్రవాహనాలున్నాయి. అలాగే సుదర్శన్ షాపీపై ఉన్న హోర్డింగ్ భయాన్ని గొలిపేలా వేలాడుతోంది. అలాగే హోటల్ కిన్నెర సమీపంలో మేడపై ఉన్న సోలార్ ప్లేట్లు ఎగిరి మెయిన్ రోడ్డుపై ముక్క ముక్కలుగా ఎగిరిపడ్డాయి. అలాగే సిబ్బన్న భవనం సమీపంలోని ఆస్పత్రి హోర్డింగ్‌లు నేలపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలి, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీలో-4, బైపాస్ రోడ్డులో-5 గౌడవీధిలో- 2, సాయిబాబా టెంపుల్ వద్ద 2 పెద్ద స్తంభాలు కూలిపోయి, వైర్లు తెగిపోయినట్లు విద్యుత్‌శాఖ ఏడీ ఎల్ సత్యనారాయణ తెలిపారు. ఇంకా మండలాల్లో పరిస్థితి తెలియరాలేదని, రాత్రికి విద్యుత్ సరఫరా చేయడం ఇబ్బందేనని చెప్పారు. గాలికి కేబుల్స్ కూడా తెగిపోవడంతో నెట్ సేవలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ గాలికి అరకొరగా ఉన్న మామిడి పంట నేలరాలిపోయినట్లు రైతులు వాపోతున్నారు. బొబ్బిలిలో... బొబ్బిలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌వద్ద చెట్టుకూలి ప్రహరీ ధ్వంసమైంది. పార్వతీపురం రోడ్డులో విద్యుత్ హైటెన్షన్ వైర్లపై చెట్టుకూలింది. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న చెట్టు కొమ్మ విరగడంతో తె ర్లాం మండలం కూనాయవలస గ్రామ మాజీ సర్పంచ్ కర్రి ప్రభాకరరావుకు చెందిన కారు ధ్వంసమైంది.. కొమ్మ కారు ముందు భాగంపై పడగానే డ్రైవరు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.. పట్టణంలోని పలు హోర్డింగులు ఈ గాలులకు నేలకొరిగాయి. తారకరామాకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో చెట్టు కూలాయి.. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం ముందుకు కదలలేని విధంగా బలమైన గాలులు వీయడంతో ద్విచక్ర వాహనాలు, కార్లలోప్రయాణించే వారు ఇబ్బందులు పడ్డారు. రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో కూడా గాలులు బీభ త్సం సృష్టించాయి. ఎలక్ట్రికల్ డీఈ మాసిలామణి సబ్స్టేషన్లను, తెగిన విద్యుత్ తీగలను పరిశీలించారు. అరగంట గాలితో అతలాకుతలం శృంగవరపుకోటలో శుక్రవారం రాత్రి 7.30గంటలకు ఆరంభమైన గాలులు సుమారు 20నిమిషాలు కలవర పెట్టాయి. హుద్‌హుద్ బీభత్సాన్ని జ్ఞాపకం చేశాయి. బలమైన ఈదురు గాలుల తాకిడికి పట్టణంలో పలు దుకాణాలపై బోర్డులు, హోర్డింగ్‌లు, కటౌట్లు నేలకూలాయి, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. మారిన వాతావరణంతో జనం ఒక్కసారిగా ఇళ్లలోకి పరుగులు తీశారు. -
వర్ష బాధితులను ఆదుకుంటాం
♦ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ♦ గాయపడిన వారికి రూ. 50 వేలు ♦ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ యాకుత్‌పురా: ఈదురు గాలులు, వర్షం కారణంగా మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందజేసి ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆయన డిప్యూటీ మేయర్ మహ్మద్ ఫసియుద్దీన్, చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఆర్డీఓ నిఖిలతో కలిసి ఈదురు గాలుల కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, దేవాలయాన్ని సందర్శించారు. మొదట గౌలిపురా సుల్తాన్షాహి, జగదీష్ హనుమాన్ దేవాలయంలో కూలిన చెట్టును పరిశీలించారు. అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తలాబ్‌కట్టా జహంగీర్‌నగర్‌లో ఈదురు గాలులకు శుక్రవారం సాయంత్రం సింథటిక్ వాటర్ ట్యాంక్ పడి మృతిచెందిన అహ్మద్ బిన్ ఇబ్రహీం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మద్ బిన్ ఇబ్రహీం కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేసి మృతుడి భార్యకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇదే సంఘటనలో గాయపడిన ఖలీల్ బిన్ ఇబ్రహీం, షరీఫా బేగంలకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. మృతుడి భార్యకు రూ.5 లక్షలు వచ్చేంత వరకు ఖర్చుల నిమిత్తం రూ. 25 వేలను అందజేస్తామన్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-4ఎ,బీ, సర్కిల్-5 బి. కృష్ణశేఖర్, వి.విజయ్ కుమార్, డాక్టర్ ఎన్.యాదగిరిరావు, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం బయోడైవర్సిటీ అడిషనల్ డెరైక్టర్ అన్నపూర్ణాదేవి, చార్మినార్, బండ్లగూడ మండల తహసీల్దార్లు ఎస్.పి.ఆర్.మల్లేష్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అరగంటలో అతలాకుతలం
బషీరాబాద్‌లో జోరువాన అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షానికి బషీరాబాద్ మండలంలోని పలుగ్రామాలు అతలాకుతలమయ్యాయి. గురువారం మండల కేంద్రంతోపాటు కొర్విచెడ్, నవాంద్గి, దామర్‌చెడ్ తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం భారీగా కురిసింది. హోరు గాలికి 200 చెట్లు నేలకూలాయి. కొర్విచెడ్‌లో చెట్టు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నవాంద్గి, కొర్విచెడ్తో పాటు పలు గ్రామాల్లో 20 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మండలంలో అంధకారం అలుముకుంది. మండల కేంద్రంలో వీచిన హోరు గాలికి రైస్‌మిల్లు పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మిల్లులోని 200 క్వింటాళ్ల బియ్యం, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన 80 క్వింటాళ్ల వరిధాన్యం వర్షం ప్రభావంతో తడిపోయింది. - బషీరాబాద్ -
ఈదురుగాలుల బీభత్సం
* ఎగిరిపడ్డ ఇంటికప్పు రేకులు.. నిలిచిన కరెంట్ సరఫరా * గాలికి ఎగిరిపడ్డ ఊయలలోని చిన్నారి మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వీచడంతో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. మహావృక్షాలు నేలకూలాయి. ఇదే సమయంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. ఈదురుగాలులకు నిడ్జింత, మన్నాపూర్, దుప్పట్‌గట్, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మక్తల్‌లో ప్రాణభయంతో గొర్రెల కాపరి పూజరి నర్సింలు(30) చెట్టు ఎక్కాడు. ఈదురుగాలులకు చెట్టు నేలకూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మాగనూర్ మండలం హిందూపురంలో ఓ చిన్నారి రేకుల ఇంట్లో ఊయలలో ఆడుకుంటోంది. బలమైన గాలి వీచడంతో రేకులతోపాటు ఊయల లేచిపోయి అల్లంతదూరాన ముళ్లపొదల్లో పడింది. అక్కడే ఉన్న స్థానికులు కొందరు గుర్తించి ఆ పసికందును తల్లి శాంతమ్మకు అప్పగించారు. మక్తల్‌లో ఈదురుగాలులకు కరెంట్ స్తంభం విరిగిపోయి ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో మహబూబ్‌నగర్- రాయిచూర్ ప్రధానరోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అరగంటలో అతలాకుతలం బషీరాబాద్: రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో హోరు గాలికి 200 చెట్ల వరకు నేలకూలాయి. కొర్విచెడ్‌లో చెట్టు మీద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని రైస్‌మిల్లులో హోరు గాలికి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మిల్లులోని 200 క్వింటాళ్ల బియ్యం, 80 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయాయి. -
ఈదురుగాలుల బీభత్సం
-
ఈదురుగాలుల బీభత్సం
నేలకూలిన వృక్షాలు.. తెగిపడిన విద్యుత్ వైర్లు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం సిటీబ్యూరో నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్ల కొమ్మలు విరిగి పడటంతో వాటినీడలో పార్కిం గ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. శివారుల్లోని పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆయా బస్తీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రామంతాపూర్ పరిధిలోని ఇందిరానగర్‌లో విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఫ్లెక్సీ బ్యానర్ విద్యుత్ తీగలపై పడ్డాయి. నెహ్రూనగర్, ఇందిరానగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే విధంగా ఆర్కేపురం ప్రధాన రహదారిలో ఓ భవనం నిర్మాణానికి సపోర్టుగా ఏర్పాటు చేసిన కర్రలు ఈదురు గాలికి కూలి కారుపై పడటంతోధ్వంసమైంది. చంపాపేట్ డివిజన్ పరిధిలోని రాజీవ్శెట్టినగర్లో ఈదురు గాలికి డిస్ట్రిబ్యూషన్ విద్యుత్ లైన్ తెగిపడి ంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అంతే కాదు చంపాపేట్, సరూర్‌నగర్, హబ్సిగ ూడ, నాగోలు, వనస్థలిపురం, చంచల్‌గూడ, మలక్‌పేట్, మూసారంబాగ్, ఆస్మాన్‌ఘడ్, తదితర సబ్స్టేషన్లలోని ఫీడర్లు ట్రిప్పై విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఎల్బీనగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, మెహిదీపట్నం, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రూ.వంద కోట్లు ఖర్చు చేసినా... గ్రేటర్ పరిధిలో ఆరు సర్కిళ్లు ఉన్నాయి. 13 వేల కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ)విభాగం చూస్తుంది. ఇందు కోసం విద్యుత్ నియంత్రణ మండలి(ఈ ఆర్సీ) 2013-14 వార్షిక సంవత్సరానికి రూ.110 కోట్లు కేటాయించగా, 2015-16 వార్షిక సంవ త ్సరానికి రూ.120 కోట్లు కేటాయించి ంది. ఇందులో కేవలం ట్రీ కటింగ్ పనులకే రూ.40 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. మరో 80 కోట్లకు పైగా లైన్ల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నారు. ఒకసారి చెట ్లకొమ్మలు నరికిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం తక్కువ. కానీ అవే కొమ్మలను మళ్లీ మళ్లీ తొలగించినట్లు లెక్క చూపుతూ డిస్కం నిధులు స్వాహా చేస్తున్నారు. ఏటా ఈ ఖర్చు పెరుగుతున్నా..సరఫరా వ్యవస్థ మాత్రం ఏమాత్రం మెరుగుప డలేదు. ఆదివారం సాయంత్రం నగరంలో చిన్నపాటి ఈదురు గాలికే విద్యుత్ వైర్లు తెగిపడటాన్ని పరిశీలిస్తే డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎంత అద్వానంగా ఉందో అర్థమవుతుంది. ఇక అత్యవసర సమయంలో వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిన స్థానిక విద్యుత్ అధికారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. 25 సబ్స్టేషన్ల పరిధిలో.... ఆదివారం రాత్రి వర్షం, గాలుల కారణంగా నగరంలో 25 సబ్ స్టేషన్ల పరిధిలో సుమారు 100 ఫీడర్లలో దాదాపు గంటసేపు కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
ఈదురు గాలులకు నేలకొరిగిన హనుమంతుడి విగ్రహం
ఆదివారం వీచిన గాలులకు ఓ భారీ విగ్రహం నేల కూలింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం తొగచ్చేడు గ్రామంలో నిర్మిస్తున్న హనుమంతుడి విగ్రహం నేలకొరిగింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసుకున్న 54 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం భారీ ఈదురు గాలులకు ఒరిగి పోయింది. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.40లక్షలు ఖర్చు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. -
ఈదురు గాలులతో షార్ట్‌సర్క్యూట్
మెదక్ రూరల్ : ఎర్త్ వైర్ తెగి విద్యుత్ సరఫరా చేసే లైన్‌పై పడటంతో ఒక్కసారిగా హైవోల్టేజీ కరెంట్ వచ్చి పలువురి ఇళ్లలోఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయిన సంఘటన మెదక్ మండలం మంభోజిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మంభోజిపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వద్ద శుక్రవారం వీచిన గాలికి ఎర్త్‌వైర్ తెగి ఫేస్ వైర్‌పై పడింది. దీంతో హైవోల్టేజ్ వచ్చి గ్రామంలోని అనేక మంది ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్, మోటార్లు, బల్బులు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేర నష్టం జరిగిందని పలువురు బాధితులు పేర్కొన్నారు. వీధిలైట్లు సైతం కాలిపోయినట్లు సర్పంచ్ గంజి ప్రభాకర్ తెలిపారు. -
ఈదురు గాలులు: 400 ఎకరాలు నేలమట్టం
సాలూరు (విజయనగరం) : ప్రకృతి వైపరీత్యానికి అరటి రైతు భారీగా నష్టపోయాడు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో శనివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు సుమారు 400 ఎకరాలలో అరటి తోటలు నేల మట్టం అయ్యాయి. దీంతో రూ. కోటిన్నర వరకు రైతులు నష్టపోయారు. విషయం తెలుసకున్న సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అంధకారంలో 5 గ్రామాలు
ప్రకాశం: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెగపూడిలో ఈదురుగాలుల దాటికి 5 గ్రామాల్లో అంధకారం నెలకొంది. వెలగపూడి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 5 గ్రామాలు శనివారం అర్ధరాత్రినుంచి అంధకారంలోనే ఉండాల్సి వస్తోంది. -
హోరు గాలి..జోరు వాన
-
హోరు గాలి..
ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరూ..? అనే ఓ పాట పల్లవిని నిజం చేస్తూ శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం వనస్థలిపురం, హయత్‌నగర్ డివిజన్ల ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అప్పటివరకూ భగభగలాడిన భాస్కరుడు.. వరుణుడి రాకను గమనించి నెమ్మదిగా జారుకున్నాడు. క్షణాల్లోనే వాతావరణం చల్లబడింది.. ‘చిటా.. పటా చినుకులతో’.. మొదలైన వాన ‘కురవనీ.. కురవనీ’.. అనేలా తీవ్రరూపం దాల్చింది. దీనికి ఈదురు గాలుల తోడవటంతో పలు చోట్ల వృక్షాలు నేలవాలాయి. ఇవి రోడ్లు, కరెంటు తీగలు, వాహనాలపై పడ్డాయి. - వనస్థలిపురం/హయత్‌నగర్ -
ఈదురుగాలుల బీభత్సం : చెట్లు కూలి 3 కార్లు ధ్వంసం
హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు కూలాయి. కారులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 20 నిమిషాలలోనే ఈ ఘటనలు అన్నీ జరిగిపోయాయి. వనస్థలిపురంలో భారీ స్థాయిలో వీచిన ఈదాఉరు గాలులకు చెట్లు కూలాయి. ఇళ్ల ముందు ఉంచిన కారులపై చెట్లు కూలడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ తీగలపై కూడా చెట్లు కూలడంతో విద్యత్ సరఫరా నిలిచిపోయింది. -
అకాల వర్షం.. అపార నష్టం
- దెబ్బతీసిన ఈదురు గాలులు సిద్దిపేట రూరల్: మండలంలోని నాంచారుపల్లి, బక్రిచెప్యాల, ఎల్లుపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలుల వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గాలులు వీయడంతో వరి పొట్ట దశలో ఉండడంతో భారీగా నష్టం చోటుచేసుకుంది. అదే విధంగా మామిడి తోటలతో పాటు పలు ఇళ్లు సైతం కూలిపోయాయి. అలాగే పౌల్ట్రీ ఫారల్లో కోళ్లు కూడా చనిపోయాయి. నాంచారుపల్లి, బక్రిచెప్యాల గ్రామాల రహదారిపై భారీ వృక్షాలు కూలిపోగా, అదే గ్రామంలో చెట్టు కరెంట్ తీగలపై పడింది. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఎన్వై గిరి పంటలను పరిశీలించారు. మూడు గ్రామాల్లో 120 ఎకరాల్లో వరి పంట, 52 ఎకరాల్లో మామిడి తోటలు, నాలుగు ఇళ్లతో పాటు పౌల్ట్రీలో కోళ్లు మృత్యువాత పడ్డట్లు సిద్దిపేట తహశీల్దార్ పేర్కొన్నారు. -
నీడనిస్తుందనుకుంటే నిండు ప్రాణం బలి
- కొట్టం కూలి కౌలు రైతు దుర్మరణం - పటేల్‌గూడెంలో విషాదం లింగాలఘణపురం : బలమైన ఈదురు గాలులు, వర్షం నుంచి రక్షించి నీడనిస్తుందనుకున్ను కొట్టమే ఓ రైతును బలి తీసుకుంది. మరో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మండలంలోని పటేల్‌గూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానిక రైతుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కౌలు రైతు అనుముల మల్లయ్య(65) లింగాలఘణపురానికి చెందిన మంద నర్సిరెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం అక్కడే వంకాయతోటకు మందు వేశాడు. ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు, వర్షం వస్తుండడంతో సమీపంలోని నకిరెడ్డి యాదయ్య కొట్టం వద్దకు వచ్చాడు. ఇద్దరు ఆ కొట్టంలోనే తలదాచుకున్నారు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడంతో కొట్టం పైకప్పుకు ఉన్న ఇనుకరేకులు ఎగిరిపోయాయి. రేకులు వేసిన సిమెంట్ స్తంభాలతోపాటు కొట్టంలోని కణి (రాయి స్తంభం) విరిగి మల్లయ్య తలపై పడింది. తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా యాదయ్య వెంటనే కణిని అతడి తలపై నుంచి తొలగించాడు. స్పృహలేకపోడంతో సమీపంలోని రైతు వీరారెడ్డి వద్దకు తీసుకొచ్చాడు. అప్పటికే మల్లయ్య మృత్యువాత పడ్డాడు. -
మళ్లీ ముంచిన వడగళ్లు
- ఈదురుగాలుల బీభత్సం - మామిడి మటాష్ - తెగిపడిన కరెంటు తీగలు - జిల్లాలో అంధకారం జిల్లాలో ఈదురుగాలులు, అకాలవర్షం మరోసారి బీభత్సం సృష్టించారుు. చెట్లు, స్తంభాలు విరిగిపడ్డారుు. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు భారీగావీయడంతో కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈసారి మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలు విపరీతంగా రాలిపోయూరుు. కొమ్మలు విరిగిపడ్డారుు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డారుు. స్థానిక గాంధీచౌక్ చౌరస్తాలో హోర్డింగ్ పడిపోరుంది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోరుంది. సారంగాపూర్ : మండలంలో రాత్రి ఏడుగంటల నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. మామిడితోటలు తుడిచిపెట్టుకుపోయూరుు. నాగునూర్, రంగపేట, లచ్చక్కపేట గ్రామాల్లో కోళ్ల షెడ్లు గాలికి కొట్టుకుపోయూరుు. ఓదెల : మండలంలో కుండపోత వాన కురిసింది. గుంపుల, ఓదెల, ఇందుర్తి, గూడెం, పొత్కపల్లి, కొలనూర్, కనగర్తి, ఉప్పరపల్లె గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. కరెంటు లేక గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మామిడి, వరి నేలవాలారుు. గొల్లపల్లి : మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన నుంచి తేరుకోకముందే ఆదివారం రాత్రి మళ్లీ వడగళ్లు దెబ్బతీశారుు. భీంరాజ్‌పల్లి, ఆత్మకూర్, చిల్వకోడూర్ తదితర గ్రామాల్లో భారీగా రాళ్లు పడ్డారుు. అరగంట పాటు రాళ్లవానతో ప్రజలు భయూందోళనకు గురయ్యూరు. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దరుుంది. మామిడి కాయ మిగిలే పరిస్థితే లేదు. వెల్గటూర్ : మండలంలో రాత్రి గాలివాన బీభత్సానికి ప్రజలు వణికిపోయూరు. పెద్దపెద్ద చెట్లు నేలకొరిగారుు. కరెంటు తీగలు తెగి, స్తంభాలు కూలి రోడ్లపై పడ్డారుు. ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర రహదారిపై రాజక్కపల్లి వద్ద రెండు పెద్ద చెట్లు విరిగి పడ్డారుు. రాత్రిపూట వర్షంలో ఈ చెట్ల తొలగింపు కష్టమే. దీంతో కరీంనగర్- రాయపట్నం రహదారిపై వాహనాలు నిలిచిపోయూరుు. వీణవంక : దేశారుుపల్లి, మల్లారెడ్డిపల్లి, చల్లూరు, బేతిగల్, ఎల్బాక, గంగారం, కిష్టంపేట గ్రామాల్లో విద్యుత్‌వైర్లు తెగిపడ్డారుు. రేకుల షెడ్లు కొట్టుకుపోయూరుు. సత్యనారాయణరెడ్డికి చెందిన రేకులు 15 మీటర్ల దూరంలో పడ్డారుు. కోర్కల్, ఎల్బాక, వీణవంక సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ నిలిపివేశారు. సప్తగిరికాలనీ : జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సరిగ్గా రాత్రి 8:30 గంటలకు పెద్ద ఎత్తున ఈదురుగాలులు రావడంతో నగరం మొత్తం దుమ్ముతో కమ్ముకుపోరుుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోరుు నగరంలో అంధకారం అలుముకుంది. దీంతో విద్యుత్ మొత్తం నిలిచిపోగా నగరం అంధకారమయమైంది. ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డారుు. ఫ్లెక్సీలు కొట్టుకుపోయూరుు. రాత్రి 10 గంటలకు కరెంటు రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. -
వాన బీభత్సం
లింగంపేట, న్యూస్‌లైన్ : మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి, మాల పాటి, లొంకల్‌పల్లి, సజ్జన్పల్లి, ఎక్కపల్లి, ఎక్కపల్లితండా, పర్మల్ల తదితర గ్రామాలలో 20 విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. సుమా రు 150 చెట్లు నేల కూలిపోయా యి. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల బాల్‌రాజ్, మార్గం స్వరూప, మార్గం లచ్చవ్వ, బైండ్ల శివకుమార్, బైండ్ల పోచయ్య తది తరులకు చెందిన రేకుల షెడ్లు సు మారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సుమారు 20 ఇళ్ల కూన పెంకులు గాలికి ఎగిరి పోయాయి. శెట్పల్లి సంగారెడ్డిలో 15 నివాస గుడిసెలు, ఇండ్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. శెట్పల్లి సంగారెడ్డి పంచాయతీ పరిధిలోని మాలపాటి గ్రామంలో రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఈదురు గాలులకు ధ్వంస మయ్యాయి. కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి పోయాయి. రైతులు జనరేటర్‌ను ఉపయోగించి వర్షం నీటిని తొలగించారు. బలమైన ఈదురు గాలుల తాకిడికి రేకుల షెడ్లు కొట్టుకు పోయాయి. అకాల వర్షం వల్ల సుమారు రూ. 70 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జోరు వర్షం కురియడంతో జనజీవనం అతలాకుతలమైంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తిర్మలాపూర్‌లో.. బాన్సువాడరూరల్ : బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్ పంచాయతీ పరిధిలోని మొగులాన్పల్లి, కొత్తాబాది, తిర్మలాపూర్ గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మొగులాన్ పల్లి గ్రామం, తండాల్లో షెడ్లపై నుంచి రేకులు ఎగిరిపోగ, ఇళ్లపై కూనలు పగిలిపోయాయి. కొత్తాబాది బస్టాండ్ సమీపంలో విద్యుత్ స్తంభం విరిగింది. తిర్మలపూర్లో పంట పొలాల్లో ఇనుప విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. తిర్మలాపూర్ గేట్ వద్ద తాగునీటి లైన్ స్తంభం విరిపోయింది. గ్రామం అంధాకారమయమైంది. ఆరుబయట వున్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తూకం వేసిన సంచులు తడిసి పోవడంతో రైతులు ధాన్యాన్ని వేరేసంచుల్లోకి మార్చారు. గ్రామసర్పంచ్ బేగరిసాయిలు, వార్డుసభ్యుడు సద్దాం గ్రామంలో జరిగిన నష్టాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పిట్లంలో.. నిజాంసాగర్ : పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ఇళ్లకు చెందిన రేకులు కొట్టుక పోయాయి. ఇళ్ల రేకులు ఎగిరి పోవడంతో భయాందోళనకు గురైనట్లు గ్రామానికి చెందిన నుప్పల అంజయ్య తెలిపారు. -
అకాల వర్షంతో రైతులు విలవిల
గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంకటాపురం, బురుజుపల్లి, దిగువమెట్ట, రాజుపేటలో రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెంకటాపురానికి చెందిన పసుపు రైతులు అకాల వర్షం దెబ్బకు పసుపు కొమ్ముల్ని రక్షించుకునేందుకు అవస్థ పడ్డారు. గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు ఇంటి వద్ద బయట ఆరబోసిన పసుపు కొమ్ములు తడిసిపోయాయి. దిగువమెట్ట సమీపంలోని మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. రాజుపేట, మిట్టమీదపల్లె గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఫలితంగా గ్రామంలోని 28 వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిచిపోయింది. గాలులకు బురుజుపల్లె వెంకటాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న విద్యుత్ స్తంభం తీగలతో సహా కిందకు ఒరిగి ప్రమాదకరంగా ఉంది. -
గాలివాన బీభత్సం
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలచోట్ల చెట్లు విరిగి పోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు పూర్తిగా నేలరాలయి. చాలా మంది ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. సుమారు రెండు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం అధికారులు సరఫరాను పునరుద్ధరించారు. తడిసిపోయిన ధాన్యం బస్తాలు తాండూరు: తాండూరులో అకాల వర్షం హడలెత్తించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత జోరుగా వర్షం కురిసింది. గాలిదుమారంతో మొదలై మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి జరిగిన భారీ నష్టం దృష్ట్యా యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఈసారి ధాన్యం బస్తాలు తక్కువగా తడిసాయి. ఈసారి కొనుగోలుదారుల బస్తాలు వర్షంతో తడిసిపోయాయి. వరి ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యాన్ని యార్డులో మంగళవారం ఉదయం లారీల్లో కొనుగోలుదారులు తరలించారు. కొందరు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. దెబ్బతిన్న ఇళ్లు మొయినాబాద్: ఈదురు గాలులు, హోరువాన బీభత్సం సృష్టించాయి. సోమవారం అర్థరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కేతిరెడ్డిపల్లిలో ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. అప్పోజిగూడలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్లు విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామాల్లో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమ్డాపూర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ లైన్లో శంషాబాద్ మండలంలోని రాయన్నగూడ చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభం విరిగి పడటంతో సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం వరకు పునరుద్ధరించలేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని అమ్డాపూర్, బాకారం, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్ గ్రామాల్లో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువుల్లోకి చేరిన నీరు కందుకూరు: మండల పరిధిలో సోమవారం రాత్రి 46.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కుంటలు, చెక్‌డ్యాంలు, రహదారుల వెంబడి గుంతల్లో నీరు నిలిచింది. కొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి స్వల్పంగా నీరు చేరింది. ఓ మోస్తరు వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడిన జనం చేవెళ్లరూరల్: మండలంలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌వైర్లు తెగిపడ్డాయి. మంగళవారం ఉదయం వరకూ గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. పంటలకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన చెట్లు పూడూరు: మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బలమైన ఈదురు గాలులతో వర్షం కురవడంతో రాకంచర్ల గ్రామానికి చెందిన జంగయ్య పొలంలోని పెద్ద తుమ్మ చెట్టు విరిగిపడింది. పక్కనే విద్యుత్ వైర్లపై పడటంతో తీగల తెగిపడ్డాయి. కెరవెళ్లి, సిరిగాయపల్లి, సోమన్గుర్తి, కంకల్, మంచన్‌పల్లి గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుకు అపార నష్టం గండేడ్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోవువారం రాత్రి కురిసిన గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ట్రాన్స్ఫార్మర్లతో సహా కిందపడిపోయాయి. కూరగాయల తోటలు, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని నంచర్ల, జిన్నారం, జక్లపల్లి, జిన్నారం తండా, సాలార్‌నగర్ గ్రామాల్లో ఇళ్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోయింది. నంచర్ల, గండేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. వికారాబాద్/ ఆలంపల్లి: డివిజన్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు మార్గాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు, బంట్వారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలి వానకు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి సంబంధించిన స్తంభాలు పడి పోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో రాత్రంతా రోగులు చీకట్లో ఇబ్బందులు పడుతూ గడిపారు. మంగళవారం ఉదయం విద్యుత్ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. మండలంలో అక్కడక్కడా చెట్లు విరిగిపోయాయి. గాలి వానతో మామిడికాయలు నేలరాలాయి. పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. -
గాలుల బీభత్సం నుంచి తేరుకోని ఢిల్లీ
యూపీ, జార్ఖండ్, బెంగాల్‌లలో ఈదురుగాలులు.. పదుల సంఖ్యలో మృతి న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీ ఈదురు గాలులు సృష్టించిన బీభత్సం నుంచి స్థానికులు ఇంకా తేరుకోలేదు. తెగిన విద్యుత్ లైన్లు, కూలిన చెట్లు, ఆగిన విద్యుత్, నీటి సరఫరాతో నగరం అస్తవ్యస్తమైంది. విపత్తు ముగిసి 24 గంటలు గడిచినా విద్యుత్, తాగునీరు సరఫరా కాకపోవడంతో శనివారం ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రధాన విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ద్వారక, రోహిణి, పశ్చిమ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేకపోయారు. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కరెంటు లేకపోవడంతో నీటి ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో తాగునీరు సరఫరా కాలేదు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. చాలా ప్రాంతాల్లో బస్సులు నడవలేదు. ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేసేందుకు వచ్చిన సంబంధిత శాఖల సిబ్బందిపై దాడి చేశారు. పెనుగాలుల ధాటికి చెట్లు, గోడలు కూలడం తదితర ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 14కు చేరింది. మరోపక్క.. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో ఈదురుగాలులు, వర్ష బీభత్సానికి 14 మంది అసువులు బాశారు. శనివారం జార్ఖండ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వల్ల ఏడుగురు చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో పిడుగులు పడి 10 మంది చనిపోగా, 28 మంది గాయపడ్డారు. -
గాలివాన బీభత్సం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పడిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలమైంది. పట్టణంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి రహదారులకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. స్తంభాలు విరిగాయి. రాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. గౌతమీనగర్ బైపాస్‌రోడ్‌లోని శ్రీసాయి కారు మెకానిక్ షెడ్డు పక్కనే నూతనంగా నిర్మాణం అవుతున్న భవనం పరిధి గోడ కింద పడటంతో రేకులు పగిలి కింద పడంతో రేకుల షెడ్డు కింద ఉన్న కారు ముందు భాగం ధ్వంసమైంది. గౌతమీనగర్‌లో అల్లి శ్రీనివాస్‌కు చెందిన ఇల్లు భారీ వర్షానికి పూర్తి ధ్వంసమైంది. పక్కనే నిర్మాణం అవుతున్న నాలుగు అంతస్థుల భవనానికి సంబంధించిన గోడలు కూలి ఇంటిపై కప్పు రేకులపై పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇంట్లోనే ఉన్న అల్లి సత్యవతి, ఆమె కుమార్తె వినీత, కుమారుడు నిశాంత్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
క‘న్నీటి’ వర్షం
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : నెల వ్యవధిలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలకు వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలో మే 4, 9, 11, 19, 21 తేదీల్లో కురిసిన అకాల వర్షాలకు పంటలు నేలపాలయ్యాయి. దాదాపు 20 మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, 150 ఎకరాల్లో నువ్వు, 100 ఎకరాల్లో పసుపు, 130 ఎకరాల్లో సజ్జ, ఇతర పంటలు కోత దశలోనే నీటిపాలయ్యాయి. అపార నష్టం.. జిల్లాలోని సారంగాపూర్, జన్నారం, దండేపెల్లి, వేమనపల్లి, నెన్నెల, చెన్నూర్, జైపూర్, నిర్మల్, నిల్వాయ్, బెజ్జూర్, కోటపల్లి, భీమిని, దహెగాం మండలాల్లో వరి ధాన్యం కొనులగోలు కేంద్రాలకు తీసుకురాగా అకాల వర్షాలకు తడిసిపోయింది. సుమారు రూ.రెండున్నర కోట్ల నష్టం వాటిల్లింది. పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేక సగం వరకు ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలో రబీలో 48 వేల ఎకరాల్లో వరి సాగుచేయగా అధికారులు 75 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆశించినంత ధాన్యం కేంద్రాలకు రాలేదు. పంట పొలాల్లోనే నూర్పిడికి సిద్ధంగా ఉన్న చేలు వడగళ్ల వాన కు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే వేళ ప్రకృతి ప్రకోపం ఓ వైపు.. అధికారుల అలసత్వం మరోవైపు రైతులను నిండా ముంచాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల కొరత తదితర సమస్యలతో కేంద్రాల వద్దే రోజుల తరబడి పడిగాపులు పడ్డారు. ఇదే క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. అతిగా తడిసిన చోట మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్‌లో అకాల వర్షాలకు 50ఎకరాల్లో పసుపు పంట పొలాల్లోనే నీట మునిగింది. దహెగాం మండలంలో 65 ఎకరాల్లో మిర్చి పంట పాడైంది. సారంగాపూర్, దిలావర్పూర్లలో సజ్జపంట నేలకొరిగింది. నేల రాలిన మామిడి.. మొదట్లో మామడి పూత అధికంగా పూయగా రైతులు ఆనందంగా ఉన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటకు తీవ్ర నష్టం జరిగింది. చెన్నూర్, మందమర్రి, జైపూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి, భీమిని, తాంసి, దండేల్లి మండలాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జైపూర్ మండలంలో 2,500 ఎకరాల్లో మామిడి కాత రాలింది. దీంతో 190 టన్నుల వరకు కాయలు రాలి రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. తాంసి మండలం జామిడి, వడ్డాడి, నిపాని, కరంజీ(పి), పొన్నారి, ఈదుల్లావర్గావ్, గొట్కూరి, కప్పర్ల తదితర గ్రామాల్లో సుమారు 450 ఎకరాల్లో సాగవుతున్న జొన్న, నువ్వు , మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. కోతకోసి ఆరబె ట్టిన నువ్వు, జొన్న పంటలు తడిసి పోయాయి. వేమనపల్లి మండలంలో ఈనెల 20న కురిసిన వడగళ్ల వర్షానికి 200 ఎకరాల్లో మామిడి పంట నేలరాలి రూ.25 లక్షల నష్టం వాటిల్లిట్లు రైతులు తెలిపారు. మంచిర్యాల, దండేపెల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మామడ మండలాల్లో సుమారు 3వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసింది. రైతులను ఆదుకోని అధికారులు.. రైతులు వేల ఎకరాల్లో పంటనష్టపోగా వ్యవసాయ అధికారులు నష్టం వివరాలను తక్కు వ చూపుతున్నారు. కేవలం 333 ఎకరాల్లో వరి, 87 ఎకరాల్లో నువ్వు, 20 ఎకరాల్లో మొ క్కజొన్నకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంటున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యానికి సంబంధించి రైతుల నష్టపోయిన వివరాలు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారుల దగ్గర లేవు. వారు కొనుగోలు చే సిన ధాన్యం తడవగా వాటి వివరాలు మాత్రమే చెబుతున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
కంభం రూరల్, న్యూస్‌లైన్: కంభం మండలంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో పాటు సుమారు 30కిపైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఉదయం నుంచి ప్రచండభానుడి దెబ్బకు విలవిల్లాడిన కంభం ప్రజలకు ఊరటనిస్తూ సాయంత్రం వర్షం మొదలైంది. దీనికితోడు ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో కంభం నుంచి గిద్దలూరు వెళ్లే రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌వైర్లు, స్తంభాలపై పడటంతో కంభం నుంచి బేస్తవారిపేట, హెచ్గూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు కూడా కొద్దిసేపు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ ఖాసీంవలి సిబ్బందితో అక్కడకు చేరుకుని రోడ్డుపై అడ్డంగా పడివున్న స్తంభాలు, తీగలను తొలగించారు. ఏఈ మాట్లాడుతూ ఈదురు గాలులకు కంభం పట్టణంలో 10 స్తంభాలు, సూరేపల్లిలో 2, లింగోజిపల్లిలో 4, ఎల్.కోటలో 5, జంగంగుంట్ల నుంచి సూరేపల్లికి వెళ్లే రహదారిలో 11, జంగంగుంట్ల ఎస్సీపాలెంలో 2, జంగంగుంట్లలో 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ఆయన తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. బేస్తవారిపేట మండలంలో... బేస్తవారిపేట, న్యూస్‌లైన్ : ఈదురుగాలులతో కూడిన వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ చెట్లు సైతం నేలవాలాయి. మండలంలోని గొట్టమిండ్లులో పొట్టిపాటి జాన్‌పాల్‌కు చెందిన రేకుల షెడ్డు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న జాన్‌పాల్, మరియమ్మలపై రేకులు, ఇటుకలు పడటంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు వారిని తరలించారు. చింతలపాలెం గ్రామానికి చెందిన ఉదయగిరి నరసింహులు, దేవరపల్లి సుబ్బరాయుడు, గువ్వా చిన్నదస్తగిరి, గువ్వా పెద్దదస్తగిరి, పొట్టేల్ల చిన్నకాశయ్య, మాజీ సర్పంచ్ మాబు, దేవరపల్లి చిన్నసుబ్బరాయుడు, సయ్యద్ మహబూబ్‌బాషా, ఎస్సీకాలనీకి చెందిన కృపయ్య, మల్లయ్య, మరో ఐదుగురి ఇళ్లపై రేకులు ఎగిరి కిందపడ్డాయి. గ్రామంలోని మసీదు గోడతో పాటు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రహరీ కుప్పకూలింది. మహబూబ్‌బాషాకు చెందిన గేదెల రేకుల షెడ్డు పూర్తిగా పడిపోయింది. దీంతో రెండు గేదెలకు గాయాలయ్యాయి. అదే షెడ్డులోని 100 బస్తాల సిమెంట్ తడిసిపోయింది. చింతలపాలెం వెలిగొండ ప్రాజెక్టు సమీపంలో హైవేపై చెట్లు విరిగి 11 కేవీ విద్యుత్ లై న్పై పడటంతో తీగలు తెగిపడ్డాయి. దీనివల్ల నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగి హైవేపై పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గొట్టమిండ్లు, చింతలపాలెం, బేస్తవారిపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
గాలి దుమారం... పిడుగుల బీభత్సం
ఈదురు గాలుల బీభత్సానికి జిల్లా వాసులు వణికిపోయారు. జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పిడుగులు తోడయ్యాయి. దీంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఉదయం భీకరంగా సూర్యుడు నిప్పులు కురిపించగా, సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారం లేచింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గురువారం సాయంత్రం పె ద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. గాలుల కారణంగా రోడ్డుపై దుమ్మూధూళి రేగి కళ్లలో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లుల నుంచి భారీ వర్షం పడిం ది. చోట్ల చెట్లు నేలకూలగా సుమారు 100 విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలముకుంది. మామిడి పంటకు అపార నష్టం కలిగి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. బొబ్బిలి మండలం రాముడువలసలో పొలంపనులకు వెళ్లిన బొంతలకోటి పోలమ్మ, మునగపాటి నారాయణమ్మలపై పిడుగు పడడంతో వారు మృత్యువాత పడ్డారు. ఎల్.కోట మండల కేంద్రంలో కె.భాస్కరరావు అనే వ్యక్తిపై గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. తెర్లాం మండలం నందబలగలో కండి వెంకటరమణకు చెందిన ఓ ఎద్దుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది. నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, గజపతినగరం, గుర్ల తదితర మండలాల్లో ఈదురుగాలులకు అనేక చెట్లు నేలకూలాయి. మొరకముడిదాం మండలంలో మామిడి పంట, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుర్ల, బాడంగి, తెర్లాం, బొబ్బిలి, ఎల్.కోట మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. బాడంగి మండలం వాడాడలో ఓ ఇంటిపై చెట్టు కూలిపోవడంతో గొట్టాపు తమ్మినాయుడు ఆయన భార్య నారాయణమ్మ, జగ్గునాయుడులు గాయపడ్డారు. దీంతో వారికి చికిత్స అందించారు. గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌కు అడ్డంగా చెట్టు కూలిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయనగరం నుంచి బొబ్బిలివైపు వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట సేపు నిలిపివేశారు. అనంతరం చెట్టును తొలగించాక రైళ్ల రాకపోకలను కొనసాగించారు. అదేవిధంగా నెల్లిమర్ల మండలం గరికిపేటలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది,. విజయనగరం నుంచి చీపురుపల్లి వెళ్లే రహదారిలోనూ, పార్వతీపురం వెళ్లే రహదారిలోనూ చాలా చెట్లు కూలిపోయాయి. పట్టణంలో కూలిన హోర్డింగ్‌లు, చెట్లు.. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, చెట్లు నేలకూలాయి. ట్యాంక్‌బండ్, ఇందిరా నగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. వాహనచోదకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. -
ఈదురు గాలుల బీభత్సం
- విజయనగరం జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు మృతి - అంధకారంలో విశాఖ ఉత్తరాంధ్రలో భారీ నష్టం - నేలకూలిన విద్యుత్ స్తంభాలు - ఉష్ణోగ్రతల్లో పెరుగుదలే కారణమంటున్న వాతావరణ నిఫుణులు న్యూస్‌లైన్ నెట్వర్క్: ఉత్తరాంధ్రలో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. విజయనగరం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మరోవైపు చిత్తూరు జిల్లా కలికిరి శివారు ప్రాంతంలో వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లికి చెందిన దేశాయ్ శ్రీనాథరెడ్డి(45) అనే రైతు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖ నగరం అర్ధరాత్రి వరకు అంధకారంలోనే ఉండిపోయింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాముడువలసకు చెందిన బొంతలకోటి పోలమ్మ, మునగపాటి నారాయణమ్మలు పొలంపనులు చేస్తుం డగా పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్.కోటలో కె.భాస్కరరావుపై ఇంటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాడంగి మండలం వాడాడలో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన గొట్టాపు తమ్మినాయుడు, నారాయణమ్మ, జగ్గునాయుడులు గాయాలపాలయ్యారు. సుమారు వంద విద్యుత్ స్తంభాలు నేలకూలినట్టు ప్రాథమిక అంచనా. గాలుల తీవ్రత వల్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గజపతినగరంలో రైల్వే స్టేషన్ సమీపం లో ట్రాక్‌కు అడ్డంగా చెట్టు కూలడంతో సుమారు గంటపాటు బొకారోరైలును నిలిపివేశారు. ఉత్తరాంధ్రలో అరటి, మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లింది. స్థిరంగా వాయుగుండం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర వాయువ్య దిశగా 540కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖకు 950 కి.మీ. తూర్పుగా ఉంది. అది మెల్లగా ఉత్తర/ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది బలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్ మయన్మార్ తీరంవైపు తరలిపోనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం ఉండబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. మరోవైపు చత్తీస్ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణా, రాయలసీమల్లో రాగల 48 గంటల్లో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రమంతా వేడి సెగలు రాష్ట్రంలో మరోవైపు వేడి సెగలు కొనసాగుతున్నాయి. గురువారం బాపట్లలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోస్తా జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగత్రలు నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని వెల్లడించింది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 42-28 డిగ్రీల మధ్య ఉండవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
విశాఖలో ఈదురు గాలుల బీభత్సం
-
విశాఖలో ఈదురు గాలుల బీభత్సం
విశాఖపట్నం: విశాఖపట్నంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్పూఘర్ వద్ద కూలిన వుడా స్వాగత ద్వారం కూలిపోవడంతో విశాఖ-భీమిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు విశాఖ స్టీల్‌సిటీ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. -
వడగండ్లు, గాలివాన బీభత్సం
నేరడిగొండ, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కురిసిన ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షంతో ఇండ్ల పైకప్పులు లేచిపోయి అల్లంత దూరంలో పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. బుగ్గారం, చిన్నబుగ్గారం, నేరడిగొండ, బంధం, దూదిగండి, గుత్పాల, సావర్గాం, కిష్టాపూర్, సావర్గాం, కుంటాల తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ప్రజలు భయపడ్డారు. కాగా కొందరి ఇండ్ల పైకప్పులు, రేకులు ఈదురు గాలులకు లేచి గ్రామ శివారులో పడ్డాయి. సావర్గాం గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ తీగలన్నీ గ్రామంలో పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూరగాయల పంటలు, మామిడి రైతులకు వడగండ్ల వర్షం పెను నష్టం కలిగించింది. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలుకు సంబంధించి పైకప్పు రేకులు ఈదురు గాలులకు లేచిపోయాయి. రెండు గంటల పాటు కురిసిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వడగండ్ల వర్షంతో ఎంత నష్టం వాటిల్లిందనేది పూర్తిస్థాయిలో తెలియరాలేదు. -
మళ్లీ వానదెబ్బ..
కందుకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. ఆకులమైలారంలో పిడుగు పాటుకు రైతు మృతి చెందగా, నేదునూరు సమీపంలోని పొలంలో రంగని బాల్‌రాజ్‌కు చెందిన ఓ ఎద్దుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. మహ్మద్‌నగర్‌లో ఈదురుగాలులకు ఇంటి రేకులు లేచిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తల్లోజి బ్రహ్మచారి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ముచ్చర్లలో వడగళ్లు పడి వరి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో గుమ్మడవెళ్లి, కందుకూరు, మీర్కాన్‌పేట, దెబ్బడగూడ, నేదునూరు, జైత్వారం, కొత్తగూడ, గూడూరు, కొత్తూర్, తదితర గ్రామాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలగా, మామిడి కాయలు నేలరాలి నష్టం వాటిల్లింది. గుమ్మడవెళ్లి, మహ్మద్‌నగర్ గ్రామాల పరిధిలో విద్యుత్ స్థంభాలు కూలిపోగా, కొన్ని చోట్ల తీగలు తెగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. షాబాద్‌లో.. షాబాద్: షాబాద్ మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. మండలంలోని నాగరకుంట. షాబాద్, కుమ్మరిగూడ. హైతాబాద్, మద్దూర్, సోలీపేట్ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఇళ్లు. పశువుల పాకలు దెబ్బతిన్నాయి. ఇళ్లు దెబ్బతిన్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గండేడ్‌లో.. గండేడ్: కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుల దైన్యానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. గండేడ్‌లోని కొనుగోలు కేంద్రంలో వెయ్యి బస్తాల వరి ధాన్యం సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు చేసి తడిసి ముద్దయ్యేలా నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కనీసం తాడ్పాలీన్ (తాడుపత్రీలు) కూడా ధాన్యంపై కప్పే దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రమలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంవల్లే రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకునేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
వర్ష బీభత్సం
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రబీపై రైతులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న గాలివానకు జిల్లాలో భారీ విస్తీర్ణంలో పంటలు ధ్వంసమయ్యాయి. ఈదురు గాలుల ఉధృతికి వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు మొక్కలు నేలకు ఒరిగాయి. మామిడి పూతలు, పిందెలు నేలరాలాయి. పంట నష్టంపై జిల్లా వ్యవసాయ శాఖ ఏ రోజుకారోజు అంచనా వేస్తోంది. వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. శుక్రవారం ఒక్క రోజే జిల్లాలో 350 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, శనివారం కురిసిన వర్షానికి మరో 63 హెక్టార్ల విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రం కుండపోతగా వర్షం కురవడంతో నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం నాటి నష్టంపై సోమవారం అధికారిక లెక్కలు వెల్లడికానున్నాయి. -
అకాల వర్షం..రైతుకు నష్టం
పంటలకు దెబ్బ చేగుంట: మండలంలో కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గొల్లపల్లి తండాలోని కాశీరాం, దన్ను, సోమ్లా, రవి రాంపూర్‌లోని భూషణం, శ్రీను, సిద్దిరాములు, చిన్నశివునూర్లో కనకయ్య, రుక్మాపూర్‌లో పంచాక్షరి, చేగుంటలో దివాకర్‌కు చెందిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో పాటు మక్కరాజిపేట, పోతాన్‌పల్లి, బి.కొండాపూర్, నార్సింగి గ్రామాల్లోనూ మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా అనంతసాగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ నీటితో నిండిపోయింది. పంట నష్టంపై అధికారులు విచారణ జరిపి పరిహారం అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. మిరుదొడ్డిలో వడగళ్ల వాన మిరుదొడ్డి: మండలంలోని ఆరెపల్లి, లక్ష్మీనగర్, కొండాపూర్, కాసులాబాద్, లింగుపల్లి, మల్లుపల్లిలో శనివారం సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతోపాటు వడగ ళ్లతో కూడిన వర్షం కురవడంతో పొలాల వద్ద చెట్లు విరిగి పడ్డాయి. రోడ్లపై అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బీర్నిస్ పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడి పంటలకు నష్టం కొండాపూర్: ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మండలంలో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది. గోధుమ, ఉల్లి, పశువుల పచ్చిమేత పంటలు నేలకొరిగాయి. చేతికందే సమయంలో వానకు తడవడంతో పసుపు పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. మామిడి చెట్లకు పూతకాత చూసి మురిసి పోయిన రైతులు అకాల వర్షంతో కన్నీరు పెడుతున్నారు. మండలంలోని గొల్లపల్లి, తేర్పోలు, మునిదేవునిపల్లి, ఎదురుగూడెం, హరిదాస్పూర్ తదితర గ్రామాల్లో ఆరుతడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కౌలు రైతుల పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు. దెబ్బతిన్న పంటలను వెంటనే గుర్తించి పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.