బషీరాబాద్‌లో జోరువాన
అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షానికి బషీరాబాద్ మండలంలోని పలుగ్రామాలు అతలాకుతలమయ్యాయి. గురువారం మండల కేంద్రంతోపాటు కొర్విచెడ్, నవాంద్గి, దామర్‌చెడ్ తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం భారీగా కురిసింది. హోరు గాలికి 200 చెట్లు నేలకూలాయి. కొర్విచెడ్‌లో చెట్టు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
నవాంద్గి, కొర్విచెడ్‌తో పాటు పలు గ్రామాల్లో 20 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మండలంలో అంధకారం అలుముకుంది. మండల కేంద్రంలో వీచిన హోరు గాలికి రైస్‌మిల్లు పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మిల్లులోని 200 క్వింటాళ్ల బియ్యం, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన 80 క్వింటాళ్ల వరిధాన్యం వర్షం ప్రభావంతో తడిపోయింది. - బషీరాబాద్