1/9
ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరూ..? అనే ఓ పాట పల్లవిని నిజం చేస్తూ శనివారం(09-05-2015) సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం వనస్థలిపురం, హయత్‌నగర్ డివిజన్ల ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అప్పటివరకూ భగభగలాడిన భాస్కరుడు.. వరుణుడి రాకను గమనించి నెమ్మదిగా జారుకున్నాడు. క్షణాల్లోనే వాతావరణం చల్లబడింది.. ‘చిటా.. పటా చినుకులతో’.. మొదలైన వాన ‘కురవనీ.. కురవనీ’.. అనేలా తీవ్రరూపం దాల్చింది. దీనికి ఈదురు గాలుల తోడవటంతో పలు చోట్ల వృక్షాలు నేలవాలాయి. ఇవి రోడ్లు, కరెంటు తీగలు, వాహనాలపై పడ్డాయి. - వనస్థలిపురం/హయత్‌నగర్
2/9
శారదానగర్లో చెట్టు కూలి ధ్వంసమైన కారు
3/9
నాగోలు: రోడ్డు పైనుంచి కొమ్మల తొలగింపు
4/9
హయత్నగర్ మునుగనూరులో ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు
5/9
ఎల్బీనగర్లో వరదనీటిలో ఇబ్బంది పడుతూ ప్రయాణం
6/9
ఎల్బీనగర్లో గాలివాన తరువాత వర్షం కురుస్తున్న దశ్యం
7/9
కొత్తపేటలో గాలి దుమారంతో చెలరేగిన దుమ్ముతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
8/9
కొత్తపేట వద్ద ప్రధాన రహదారిపై గాలి దుమారంతో చెలరేగిన దుమ్ము
9/9
నాగోలు: ఈదురు గాలులకు విరిగి వాహనాలపై పడిన చెట్టు