- దెబ్బతీసిన ఈదురు గాలులు
సిద్దిపేట రూరల్: మండలంలోని నాంచారుపల్లి, బక్రిచెప్యాల, ఎల్లుపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలుల వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గాలులు వీయడంతో వరి పొట్ట దశలో ఉండడంతో భారీగా నష్టం చోటుచేసుకుంది. అదే విధంగా మామిడి తోటలతో పాటు పలు ఇళ్లు సైతం కూలిపోయాయి. అలాగే పౌల్ట్రీ ఫారల్లో కోళ్లు కూడా చనిపోయాయి.
నాంచారుపల్లి, బక్రిచెప్యాల గ్రామాల రహదారిపై భారీ వృక్షాలు కూలిపోగా, అదే గ్రామంలో చెట్టు కరెంట్ తీగలపై పడింది. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఎన్‌వై గిరి పంటలను పరిశీలించారు. మూడు గ్రామాల్లో 120 ఎకరాల్లో వరి పంట, 52 ఎకరాల్లో మామిడి తోటలు, నాలుగు ఇళ్లతో పాటు పౌల్ట్రీలో కోళ్లు మృత్యువాత పడ్డట్లు సిద్దిపేట తహశీల్దార్ పేర్కొన్నారు.
అకాల వర్షం.. అపార నష్టం
Published Mon, May 4 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement