సాక్షి, హైదరాబాద్: నగరం మరోసారి అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి, అబిడ్స్.. ఇలా నగర మధ్య ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం పడింది.
ఉదయం ఎండ, సాయంత్రం వానతో నగరవాసులు ఉపశమనం పొందారు. అయితే.. ఈదురు గాలుల తాకిడికి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ హైకోర్టు వద్ద ఈదురు గాలుల తాకిడికి భారీ వృక్షం ఒకటి నేలకొరిగింది.
దీంతో రెండు బైక్‌లు, ఓ కారు ధ్వంసం అయ్యాయి. మహిళతో పాటు ఓ చిన్నారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.
ఇదీ చదవండి: ఏపీకి రెండు రోజులు హీట్ వేవ్ అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment