- ఈదురుగాలుల బీభత్సం
- మామిడి మటాష్
- తెగిపడిన కరెంటు తీగలు
- జిల్లాలో అంధకారం
జిల్లాలో ఈదురుగాలులు, అకాలవర్షం మరోసారి బీభత్సం సృష్టించారుు. చెట్లు, స్తంభాలు విరిగిపడ్డారుు. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు భారీగావీయడంతో కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈసారి మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలు విపరీతంగా రాలిపోయూరుు. కొమ్మలు విరిగిపడ్డారుు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డారుు. స్థానిక గాంధీచౌక్ చౌరస్తాలో హోర్డింగ్ పడిపోరుంది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోరుంది.
సారంగాపూర్ : మండలంలో రాత్రి ఏడుగంటల నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. మామిడితోటలు తుడిచిపెట్టుకుపోయూరుు. నాగునూర్, రంగపేట, లచ్చక్కపేట గ్రామాల్లో కోళ్ల షెడ్లు గాలికి కొట్టుకుపోయూరుు.
ఓదెల : మండలంలో కుండపోత వాన కురిసింది. గుంపుల, ఓదెల, ఇందుర్తి, గూడెం, పొత్కపల్లి, కొలనూర్, కనగర్తి, ఉప్పరపల్లె గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. కరెంటు లేక గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మామిడి, వరి నేలవాలారుు.
గొల్లపల్లి : మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన నుంచి తేరుకోకముందే ఆదివారం రాత్రి మళ్లీ వడగళ్లు దెబ్బతీశారుు. భీంరాజ్‌పల్లి, ఆత్మకూర్, చిల్వకోడూర్ తదితర గ్రామాల్లో భారీగా రాళ్లు పడ్డారుు. అరగంట పాటు రాళ్లవానతో ప్రజలు భయూందోళనకు గురయ్యూరు. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దరుుంది. మామిడి కాయ మిగిలే పరిస్థితే లేదు.
వెల్గటూర్ : మండలంలో రాత్రి గాలివాన బీభత్సానికి ప్రజలు వణికిపోయూరు. పెద్దపెద్ద చెట్లు నేలకొరిగారుు. కరెంటు తీగలు తెగి, స్తంభాలు కూలి రోడ్లపై పడ్డారుు. ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర రహదారిపై రాజక్కపల్లి వద్ద రెండు పెద్ద చెట్లు విరిగి పడ్డారుు. రాత్రిపూట వర్షంలో ఈ చెట్ల తొలగింపు కష్టమే. దీంతో కరీంనగర్- రాయపట్నం రహదారిపై వాహనాలు నిలిచిపోయూరుు.
వీణవంక : దేశారుుపల్లి, మల్లారెడ్డిపల్లి, చల్లూరు, బేతిగల్, ఎల్బాక, గంగారం, కిష్టంపేట గ్రామాల్లో విద్యుత్‌వైర్లు తెగిపడ్డారుు. రేకుల షెడ్లు కొట్టుకుపోయూరుు. సత్యనారాయణరెడ్డికి చెందిన రేకులు 15 మీటర్ల దూరంలో పడ్డారుు. కోర్కల్, ఎల్బాక, వీణవంక సబ్‌స్టేషన్‌ల పరిధిలో విద్యుత్ నిలిపివేశారు.
సప్తగిరికాలనీ : జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సరిగ్గా రాత్రి 8:30 గంటలకు పెద్ద ఎత్తున ఈదురుగాలులు రావడంతో నగరం మొత్తం దుమ్ముతో కమ్ముకుపోరుుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోరుు నగరంలో అంధకారం అలుముకుంది. దీంతో విద్యుత్ మొత్తం నిలిచిపోగా నగరం అంధకారమయమైంది. ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డారుు. ఫ్లెక్సీలు కొట్టుకుపోయూరుు. రాత్రి 10 గంటలకు కరెంటు రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
మళ్లీ ముంచిన వడగళ్లు
Published Tue, Apr 28 2015 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement
Advertisement