
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సంతో మెట్రో రైళ్లను నిలివేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 70 విమానాలను దారి మళ్లిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ పాల్గొన్న మీటింగ్‌కు ఈదురుగాలులు ఆటంకం కల్గించాయి. ఆయన సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, ఫ్లెక్సీలు గాలులకు ఎగిరిపోయాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో కారు మేఘాలు కమ్ముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment