windstorms
-
గాలివాన బీభత్సం... నెలకొరిగిన స్తంభాలు
నెన్నెల: జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బుధవారం బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో బలమైన గాలులు వీయడంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి దేవాలయంలో ఉన్న షెడ్డు రేకులు ఎగిరిపడ్డాయి. గంటపాటు బలమైన గాలులు, వర్షానికి లంబాడితండా సమీపంలో నాలుగు స్తంభాలు పడిపోయాయి. మన్నెగూడం రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు విరిగి వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ కాసారాలు విరిగిపోవడంతో సరఫరాకు ఎనిమిది గంటలపాటు అంతరాయం ఏర్పడింది. చిన్న, పెద్ద లంబాడితండాలలో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఎండవేడిమితో అల్లాడిన జనం వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. కూలిన ఇల్లు వేమనపల్లి: మండలంలోని గొర్లపల్లి కొత్తకాలనీలో ఆవుల శంకర్‌కు చెందిన ఇల్లు నేలకూలింది. ఆ సమయంలో ఆయన భార్య యశోద బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. టీవీ, కుర్చీలు, టేబుళ్లు, వంట సామగ్రి ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. విరిగిన చెట్లు భీమిని: కన్నెపల్లి, భీమిని మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సంతో పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. రెబ్బెన, వీగాం గ్రామాల్లో వర్షానికి చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రెబ్బెన గ్రామంలోని పురంశెట్టి పెంటయ్య, సుధాకర్ ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. -
ఏలూరు జిల్లాలో తుఫాన్ బీభత్సం
-
ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సంతో మెట్రో రైళ్లను నిలివేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 70 విమానాలను దారి మళ్లిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ పాల్గొన్న మీటింగ్‌కు ఈదురుగాలులు ఆటంకం కల్గించాయి. ఆయన సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, ఫ్లెక్సీలు గాలులకు ఎగిరిపోయాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. -
ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం
-
గాలి వాన బీభత్సం
-
గాలి వాన బీభత్సం
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం ఎండ తీవ్రత అధికంగా ఉండటం, విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, పెనుగాలలతో కూడిన భారీవర్షం కురిసింది. గుళ్లదూర్తి, పొట్టిపాడు, కంపమల్ల, హరివరం, అల్లూరు, తదితర గ్రామాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురవడంతో పొలాల్లో వర్షపు నీరు చేరింది. పెనుగాలుల కారణంగా కోవెలకుంట్ల- జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కురిసిన తొలకరి వాన రైతులకు ఊరట నిచ్చింది. వేసవికాలం కావడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఆళ్లగడ్డటౌన్: ఆళ్లగడ్డ ప్రాంతంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, మహా వృక్షాలు నేలకొరిగాయి. ఫలితంగా వాహనాల రాక పోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర పంచాయతీ పరిధిలోని చింతకుంటలో కోవెలకుంట్ల మార్గంలో ఉన్న వందల సంవత్సరాల నాటి గుర్రమ్మమాను కూకటి వేళ్లతో సహా నేలకొరిగింది. ఆ సమయంలో రోడ్లపై ఎవరు లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. అదృష్ట వశాత్తు ఆ సమయంలో విద్యుత్ సర ఫరా లేకపోవడంతో ఘోరప్రమాదం తప్పింది. చెట్టు విరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజామలలో పిడుగుపాటు కోవెలకుంట్ల రూరల్: మండల కేంద్రం సంజామలలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది. పెనుగాలుల వీస్తూ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో గ్రామంలోని బీసీ కాలనీలో వెంకటరామకృష్ణుడు, గాండ్లవెంకటరామయ్య, గొల్లసంజన్న ఇళ్ల మధ్య ఉన్న కంపచెట్లపై పిడుగుపడటంతో కాలనీవాసులు బెంబెలెత్తారు.